Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sachin1624a2ed-465a-432a-b34b-47f8dcdca28c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sachin1624a2ed-465a-432a-b34b-47f8dcdca28c-415x250-IndiaHerald.jpgధోని అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు . దీంతో ఇక ధోని ఐపిఎల్ లో ఆడుతున్నాడు అంటే చాలు ఎక్కడ మ్యాచ్ జరిగిన కూడా సీఎస్కే అభిమానులు అందరూ స్టేడియంకి తరలి వెళ్తూ ఉంటారు. దీంతో ఇక హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్న జట్టు అభిమనుల కంటే సీఎస్కే అభిమానులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. మైదానం మొత్తం అటు పసుపు వర్ణంతో నిండిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇలాంటివి చూసినప్పుడు మహేంద్రసింగ్ ధోనీకి ఈ రేంజ్ లో క్రేజ్ ఉందా అని అప్పుడే కొత్తగా ఐపీఎల్ ఆడుతున్న వSachin{#}Mahi;MS Dhoni;Sachin Tendulkar;VIRAT KOHLI;Kieron Pollard;Gujarat - Gandhinagar;kiran;Chennai;Turmeric;INTERNATIONAL;House;News;Mumbaiసచిన్ ముందు.. ధోని క్రేజ్ చాలా చిన్నది.. పోలార్డ్ కామెంట్?సచిన్ ముందు.. ధోని క్రేజ్ చాలా చిన్నది.. పోలార్డ్ కామెంట్?Sachin{#}Mahi;MS Dhoni;Sachin Tendulkar;VIRAT KOHLI;Kieron Pollard;Gujarat - Gandhinagar;kiran;Chennai;Turmeric;INTERNATIONAL;House;News;MumbaiSat, 08 Apr 2023 08:05:00 GMTధోని అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు . దీంతో ఇక ధోని ఐపిఎల్ లో ఆడుతున్నాడు అంటే చాలు ఎక్కడ మ్యాచ్ జరిగిన కూడా సీఎస్కే అభిమానులు అందరూ స్టేడియంకి తరలి వెళ్తూ ఉంటారు. దీంతో ఇక హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్న జట్టు అభిమనుల కంటే సీఎస్కే అభిమానులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. మైదానం మొత్తం అటు పసుపు వర్ణంతో నిండిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇలాంటివి చూసినప్పుడు మహేంద్రసింగ్ ధోనీకి ఈ రేంజ్ లో క్రేజ్ ఉందా అని అప్పుడే కొత్తగా ఐపీఎల్ ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు ఆశ్చర్యపోతూ ఉంటారు అని చెప్పాలి.



 మహేంద్ర సింగ్ ధోనీ వస్తే సీఎస్కే ఫాన్స్ మాత్రమే కాదు ఆర్సిబి ఫ్యాన్స్ కూడా చెన్నై జట్టుకి సపోర్ట్ చేస్తారని ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ కూడా స్వయంగా వెల్లడించాడు. ఫ్రాంచైజీ తో సంబంధం లేకుండా మహి బ్యాటింగ్ చూసేందుకు అందరూ ఇష్టపడతారని చెప్పుకొచ్చాడు. ఇక మొన్నటికి మొన్న గుజరాత్ టైటాన్స్ వారి హోమ్ గ్రౌండ్ లో ఆడిన మ్యాచ్లో కూడా సీఎస్కే అభిమానులే ఎక్కువగా కనిపించారు. ఇక లక్నోతో మ్యాచ్లో ధోని ఆడింది 3 బంతులే అయిన ధోని నామస్మరణతో స్టేడియం దద్దరిల్లిపోయింది. అయితే ధోని క్రేజ్ గురించి ముంబై ఇండియన్స్ మాజీ ఆల్ రౌండర్ కిరణ్ పోలార్డ్ మాత్రం షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు.



 ఇలాంటి అనుభవాన్ని ఇంతకుముందే చూసాం అంటూ చెబుతున్నాడు పోలార్డ్. ధోనీకి ఇది ఆఖరి సీజన్ అనే వార్తలు రావడం వల్లనేమో అతను ఎక్కడికి వెళ్లినా బీభత్సమైన సపోర్ట్ దక్కుతుంది. హోమ్ గ్రౌండ్ లేకపోయినా వేరే గ్రౌండ్ లో అయినా అందరూ మహి సపోర్టర్లు కనిపిస్తున్నారు. అతను క్రికెట్కు చేసిన సేవలకు దక్కుతున్న గౌరవం ఇది అంటూ పోలార్డ్ చెప్పుకొచ్చాడు. అయితే మేము ఇలాంటి అనుభవాన్ని చాలా ఏళ్ళ క్రితమే అనుభూతి చెందాము. మా ఐకాన్ సచిన్ టెండూల్కర్ టీమ్ లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్లినా సచిన్ సచిన్ అనే అరుపులతో స్టేడియాలు దద్దరిల్లిపోయేవి. ప్రతిచోట మాకు సపోర్ట్ దక్కేది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ధోని, సచిన్ ఇద్దరు లెజెండ్స్. అయితే ధోని కంటే ముందే సచిన్ ఆ రోజుల్లోనే ఇలాంటి సపోర్ట్ సాధించారు అంటే అది మాటలు కాదు అంటూ కిరణ్ పొలార్డు చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

అందుకే బాలీవుడ్ సినిమాలు హిట్ అవ్వట్లేదు : సల్మాన్ ఖాన్

పవన్‌ ఢిల్లీ టూర్‌లో ఏం జరిగింది?

కర్ణాటకలో ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనా?

ఆ 15 మందికి జగన్ మళ్లీ టికెట్‌ ఇవ్వరా?

పవన్ టీమ్‌.. బీజేపీలో ఆయన్ను టార్గెట్‌ చేస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>