MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas00e9bfcb-8b9c-4c1c-91ce-1fa39b8570cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas00e9bfcb-8b9c-4c1c-91ce-1fa39b8570cc-415x250-IndiaHerald.jpg‘మహానటి’ మూవీ తరువాత దర్శకుడు నాగ్ అశ్విన్ కు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. అయితే వాటిని పట్టించుకోకుండా ఈదర్శకుడు ప్రభాస్ తో 500 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ చేస్తూ అత్యంత సాహసం చేస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈమూవీని రెండు భాగాలుగా తీస్తారని వార్తలు వస్తున్నాయి.అయితే ఇప్పుడు ఈమూవీకి సంబంధించి మరొక లీక్ బయటకు వస్తోంది. ఈమూవీ రెండు భాగాలు కాదని ఒక సిరీస్ గా కొన్ని మూవీలు వస్తాయని అంటున్నారు. పురాణాలలో ఉన్న కృష్ణ – కర్ణ - కృపాచార్యుడు లాంటి పాత్రలు ఇప్పటికీ సజీవంగా మన prabhas{#}nag ashwin;Hollywood;Graphics;Industry;Prabhas;Darsakudu;krishna;News;Director;Rajamouli;Cinemaప్రాజెక్ట్ కె కు మహాభారత నేపధ్యం !ప్రాజెక్ట్ కె కు మహాభారత నేపధ్యం !prabhas{#}nag ashwin;Hollywood;Graphics;Industry;Prabhas;Darsakudu;krishna;News;Director;Rajamouli;CinemaSat, 08 Apr 2023 08:00:00 GMT‘మహానటి’ మూవీ తరువాత దర్శకుడు నాగ్ అశ్విన్ కు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. అయితే వాటిని పట్టించుకోకుండా ఈదర్శకుడు ప్రభాస్ తో 500 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ చేస్తూ అత్యంత సాహసం చేస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈమూవీని రెండు భాగాలుగా తీస్తారని వార్తలు వస్తున్నాయి.


అయితే ఇప్పుడు ఈమూవీకి సంబంధించి మరొక లీక్ బయటకు వస్తోంది. ఈమూవీ రెండు భాగాలు కాదని ఒక సిరీస్ గా కొన్ని మూవీలు వస్తాయని అంటున్నారు. పురాణాలలో ఉన్న కృష్ణ – కర్ణ - కృపాచార్యుడు లాంటి పాత్రలు ఇప్పటికీ సజీవంగా మన మధ్యన కనపడుతూనే ఉంటాయి అన్న పాయింట్ ను ఆధారంగా చేసుకుని ఈమూవీ సిరీస్ కథలను నాగ్ అశ్విన్ అల్లారు అని అంటున్నారు. ఈపాత్రాలను ఆధారంగా చేసుకుని నాగ్ అశ్విన్ 8 సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ కె లో బ్రహ్మగా అమితాబచన్ నటిస్తున్నాడు అని టాక్. ఇలా జనం మధ్య తరతరాల సజీవంగా ఉండే పాత్రలతో నాగ్ అశ్విన్ ప్యాంటసీ సినిమాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి జానపద కథల స్ఫూర్తితో ‘బాహుబలి’ ఆతరువాత స్వాతంత్రోద్యమ స్పూర్తితో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలను నిర్మిస్తే నాగ్ అశ్విన్ మాత్రం కొన్ని యుగాలుగా జన జీవనంలో కలిసి జీవిస్తున్న పురాణ పాత్రలను ఆధారంగా చేసుకుని ప్యాంటసీ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు లీకులు వస్తున్నాయి.


ప్రాజెక్ట్ కె విషయానికి వస్తే ఈమూవీ గ్రాఫిక్స్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా నాగ్ అశ్విన్ ఈమూవీని హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా పాన్ వరల్డ్ మూవీగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో అత్యంత భారీ అంచనాలు ఈమూవీ పై ఉండటంతో ఈమూవీ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా 1000 స్థాయిలో జరిగినా ఆశ్చర్యంలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి..






RRR Telugu Movie Review Rating

అందుకే బాలీవుడ్ సినిమాలు హిట్ అవ్వట్లేదు : సల్మాన్ ఖాన్

పవన్‌ ఢిల్లీ టూర్‌లో ఏం జరిగింది?

కర్ణాటకలో ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనా?

ఆ 15 మందికి జగన్ మళ్లీ టికెట్‌ ఇవ్వరా?

పవన్ టీమ్‌.. బీజేపీలో ఆయన్ను టార్గెట్‌ చేస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>