MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nitya-menen48cf03b3-0f64-4d15-a066-7e2c3d4f0d42-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nitya-menen48cf03b3-0f64-4d15-a066-7e2c3d4f0d42-415x250-IndiaHerald.jpgనిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉంగరాల జుట్టు ఇంకా పెద్ద పెద్ద కళ్ళతో చూడగానే ఆకట్టుకునే రూపం నిత్యా మీనన్ సొంతం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ సౌందర్య అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తూ ఉంటారు ఈ బ్యూటీని.నిత్యా మీనన్ యాక్టింగ్ చూసిన ఏ ప్రేక్షకుడికైనా 'గుండెజారి గల్లంతవ్వాల్సిందే. నిత్యా మీనన్ కోసమే థియేటర్లకు వెళ్ళినవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఇలా ఎన్నో సినిమాల్లో తన సోలో ఫెర్మామెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ బర్త్ డే ఇవాళ (ఏప్రిల్ 8). నిత్యా మీనన్ 1NITYA MENEN{#}Sharwanand;geetha;isha talwar;nandini reddy;nithya menon;Kannada;Nayak;Amarnath K Menon;Rudramadevi;Pawan Kalyan;Jr NTR;Heart;Telugu;Cinemaనిత్యా మీనన్ బర్త్ డే స్పెషల్..!నిత్యా మీనన్ బర్త్ డే స్పెషల్..!NITYA MENEN{#}Sharwanand;geetha;isha talwar;nandini reddy;nithya menon;Kannada;Nayak;Amarnath K Menon;Rudramadevi;Pawan Kalyan;Jr NTR;Heart;Telugu;CinemaSat, 08 Apr 2023 08:00:00 GMTనిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉంగరాల జుట్టు ఇంకా పెద్ద పెద్ద కళ్ళతో చూడగానే ఆకట్టుకునే రూపం  నిత్యా మీనన్ సొంతం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ సౌందర్య అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తూ ఉంటారు ఈ బ్యూటీని.నిత్యా మీనన్ యాక్టింగ్ చూసిన ఏ ప్రేక్షకుడికైనా 'గుండెజారి గల్లంతవ్వాల్సిందే. నిత్యా మీనన్ కోసమే  థియేటర్లకు వెళ్ళినవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఇలా ఎన్నో సినిమాల్లో తన సోలో ఫెర్మామెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ బర్త్ డే ఇవాళ (ఏప్రిల్ 8). నిత్యా మీనన్ 1988 ఏప్రిల్ 8 వ తేదీన బెంగళూరులో కర్ణాటకలో స్థిరపడిన మలయాళీ తల్లిదండ్రులకు జన్మించింది. అక్కడే తన ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. ఇక యాక్టింగ్ మీద ఉన్న ఇష్టంతో 1998 వ సంవత్సరంలో హనుమాన్ అనే ఫ్రెంచ్-ఇండియన్ ఆంగ్ల చిత్రంలో టబుకు చెల్లెలుగా నిత్యా నటించింది. ఆ తరువాత 2006లో 7 ఓ క్లాక్‌ అనే కన్నడ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసింది. ఇక 2008 వ సంవత్సరంలో ఆకాశ గోపురం సినిమాతో మళయాలంలోకి నిత్యా మీనన్ అడుగుపెట్టింది. ఈ సినిమా ద్వారా నిత్యా మీనన్ చాలా ప్రశంసలు అందుకుంది.


2011 వ సంవత్సరంలో నందిని రెడ్డి డైరెక్షన్ లో నానీ హీరోగా వచ్చిన 'అలా మొదలైంది' సినిమాతో నిత్యామీనన్ తెలుగు సినిమా కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అటు నానీకి ఇంకా ఇటు నిత్యాకు చాలా అవకాశాలు లభించాయి. ఇక ఈ సినిమా ద్వారా నిత్యా మీనన్ అప్పుడు నంది అవార్డు కూడా అందుకుంది. ఇక 2013-15 సమయంలో జబర్తస్త్ ఇంకా గుండె జారి గల్లంతయ్యిందే అనే సినిమాల్లో నటించింది. ఇక నితిన్ హీరోగా వచ్చిన గుండె జారి గల్లంతయ్యిందే చిత్రంలో ఆమె రెండు షేడ్స్ ఉన్న పాత్రలను పోషించి ఎంతగానో ఆకట్టుకుంది.ఆ సినిమాలో తన సహనటి ఇషా తల్వార్ పాత్రకు కూడా డబ్బింగ్ చెప్పింది.  శర్వానంద్ తో 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాలో ముస్లిం అమ్మాయిగా ఆకట్టుకుంది, ఇక S/O సత్యమూర్తి, గీత గోవిందంలో సపోర్టింగ్ రోల్ చేసింది. రుద్రమదేవి సినిమాలో కూడా నిత్యా మీనన్ సపోర్టింగ్ పాత్ర పోషించింది. అలాగే 2022 వ సంవత్సరంలో వచ్చిన భీమ్లా నాయక్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్ నటించింది. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం నిత్యా మీనన్ తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కలిపి చాలా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయింది.



RRR Telugu Movie Review Rating

అందుకే బాలీవుడ్ సినిమాలు హిట్ అవ్వట్లేదు : సల్మాన్ ఖాన్

పవన్‌ ఢిల్లీ టూర్‌లో ఏం జరిగింది?

కర్ణాటకలో ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనా?

ఆ 15 మందికి జగన్ మళ్లీ టికెట్‌ ఇవ్వరా?

పవన్ టీమ్‌.. బీజేపీలో ఆయన్ను టార్గెట్‌ చేస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>