MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan68180a49-adfe-4d89-85e8-5ccf2da4bb97-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan68180a49-adfe-4d89-85e8-5ccf2da4bb97-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి రేస్ కు చిరంజీవి బాలకృష్ణల ‘వాల్తేర్ వీరయ్య’ ‘వీరసింహా రెడ్డి’ మూవీలను కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఒకదాని పై ఒకటి పోటీగా ఈమూవీలను నిర్మించిన మైత్రీ మూవీస్ సంస్థ విడుదల చేయవలసి వచ్చింది. దీనితో చిరంజీవి బాలకృష్ణల అభిమానుల మధ్య అప్పట్లో మైత్రీమూవీస్ చాల టెన్షన్ పడింది అంటారు.సంక్రాంతికి విడుదలైన ఈ రెండు సినిమాలకు ఒక సినిమాకు ఎక్కువ మరొక సినిమాకు తక్కువ అన్న అభిప్రాయం అభిమానులలో కలగకుండా ఈ రెండు సినిమాలను చాల తెలివిగా మరియు సమానంగా ప్రమోట్ చేసి బాలయ్య చpavankalyan{#}kalyan;Allu Arjun;News;Makar Sakranti;Balakrishna;Chiranjeevi;Cinemaపవన్ బన్నీ అభిమానుల మధ్య టెన్షన్ పడుతున్న మైత్రీ మూవీస్ !పవన్ బన్నీ అభిమానుల మధ్య టెన్షన్ పడుతున్న మైత్రీ మూవీస్ !pavankalyan{#}kalyan;Allu Arjun;News;Makar Sakranti;Balakrishna;Chiranjeevi;CinemaFri, 07 Apr 2023 13:28:06 GMTఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి రేస్ కు చిరంజీవి బాలకృష్ణల ‘వాల్తేర్ వీరయ్య’ ‘వీరసింహా రెడ్డి’ మూవీలను కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఒకదాని పై ఒకటి పోటీగా ఈమూవీలను నిర్మించిన మైత్రీ మూవీస్ సంస్థ విడుదల చేయవలసి వచ్చింది. దీనితో చిరంజీవి బాలకృష్ణల అభిమానుల మధ్య అప్పట్లో మైత్రీమూవీస్ చాల టెన్షన్ పడింది అంటారు.

 

 

 

సంక్రాంతికి విడుదలైన ఈ రెండు సినిమాలకు ఒక సినిమాకు ఎక్కువ మరొక సినిమాకు తక్కువ అన్న అభిప్రాయం అభిమానులలో కలగకుండా ఈ రెండు సినిమాలను చాల తెలివిగా మరియు సమానంగా ప్రమోట్ చేసి బాలయ్య చిరంజీవి అభిమానుల కోపాన్ని తగ్గించగలిగారు. అయితే ఈ సంఘటన జరిగి కొన్ని నెలలు కూడ కాకుండానే మళ్ళీ మైత్రీమూవీస్ సంస్థకు బన్నీ పవన్ అభిమానుల నుండి తాకిడి ఎక్కువైంది.

 

 

 దీనికికారణం ఒకే రోజున ఈ మూవీ సంస్థ నిర్మిస్తున్న ‘పుష్ప 2 గ్లిం ప్స్’ విడుదల కావడంతో పాటు ఈసంస్థ నిర్మిస్తున్న పవన్ మూవీ షూటింగ్ ప్రారంభం కావడం. ‘పుష్ప 2 గ్లింప్స్’ ను విపరీతంగా ప్రమోట్ చేసిన మైత్రీమూవీస్ సంస్థ పవన్ సినిమా ప్రారంభం అయింది అన్న విషయానికి సంబంధించిన ఫోటోలను వార్తలను సోషల్ మీడియాలో తక్కువగా ప్రమోట్ చేసింది. ‘పుష్ప 2 గ్లింప్స్’ గురించి 10 పోష్టులు కనిపిస్తే పవన్ సినిమా గురించి ఒక పోష్ట్ మాత్రమే కనిపించడం పవన్ అభిమానులకు విపరీతమైన అసహనాన్ని కలిగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

 

 ఇప్పటికే ‘చెప్పను బ్రదర్’ సంఘటన తరువాత పవన్ కళ్యాణ్ అభిమానులకు బన్నీ అభిమానులకు మధ్య చాల గ్యాప్ కొనసాగుతోంది దీనితో మైత్రీ సంస్థ ‘పుష్ప 2’ ను పట్టించుకున్నట్లుగా పవన్ సినిమాను పట్టించుకోదా అంటూ పవన్ అభిమానుల మధ్య సందేహాలు మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితులలో రెండు భారీ సినిమాలను తలకెత్తుకున్న మైత్రీ సంస్థ ఎంతోతెలివిగా వ్యవహరిస్తే తప్పించి పవన్ బన్నీ అభిమానుల తాకిడిని తట్టుకోవడం కష్టం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..

 



RRR Telugu Movie Review Rating

పవన్ బన్నీ అభిమానుల మధ్య టెన్షన్ పడుతున్న మైత్రీ మూవీస్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>