MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/game-changer5d344a2b-fd7a-4d28-bb3d-abd89c65cc8b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/game-changer5d344a2b-fd7a-4d28-bb3d-abd89c65cc8b-415x250-IndiaHerald.jpgదక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ 'గేమ్ చేంజర్'.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ సామాజిక సమస్యను సదరు ప్రేక్షకుడికి అర్థమయ్యే రీతిలో కథను చెబుతూ ఆ సామాజిక సమస్యకి మంచి ప్రేమ కథను జోడించి సినిమాను తెరకెక్కిస్తూ ఉంటాడు దర్శకుడు శంకర్. ఆయన తీసిన జెంటిల్మెన్ నుంచి రోబో 2.o వరకు ఎన్నో సమస్యలను తెరపైకి తీసుకొస్తూ వాటికి పరిష్కారాలను సైతం సూచించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తో తీస్తున్న గేమ్ చేంజర్ కూడా అదే కోవాకు చెందినదే. ఇక శంకర్ సGame Changer{#}prema;thaman s;Gentleman;dil raju;GEUM;producer;Producer;Darsakudu;Audience;shankar;India;Ram Charan Teja;Cinema;king;Director;Pawan Kalyan;Loveవామ్మో.. 'గేమ్ ఛేంజర్' సినిమాలో ఒక్కో పాటకి అన్ని కోట్లు ఖర్చు పెట్టారా..?వామ్మో.. 'గేమ్ ఛేంజర్' సినిమాలో ఒక్కో పాటకి అన్ని కోట్లు ఖర్చు పెట్టారా..?Game Changer{#}prema;thaman s;Gentleman;dil raju;GEUM;producer;Producer;Darsakudu;Audience;shankar;India;Ram Charan Teja;Cinema;king;Director;Pawan Kalyan;LoveFri, 07 Apr 2023 19:25:00 GMTదక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ 'గేమ్ చేంజర్'.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ సామాజిక సమస్యను సదరు ప్రేక్షకుడికి అర్థమయ్యే రీతిలో కథను చెబుతూ ఆ సామాజిక సమస్యకి మంచి ప్రేమ కథను జోడించి సినిమాను తెరకెక్కిస్తూ ఉంటాడు దర్శకుడు శంకర్. ఆయన తీసిన జెంటిల్మెన్ నుంచి రోబో 2.o వరకు ఎన్నో సమస్యలను తెరపైకి తీసుకొస్తూ వాటికి పరిష్కారాలను సైతం సూచించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తో తీస్తున్న గేమ్ చేంజర్ కూడా అదే కోవాకు చెందినదే. ఇక శంకర్ సినిమాలంటేనే అవి చాలా గ్రాండియర్ గా ఉంటాయి. 

ముఖ్యంగా తన సినిమాలో పాటలు కానీ యాక్షన్ సీక్వెన్స్లు గాని భారీ రేంజ్ లో ఉంటాయి. అయితే తాజాగా రామ్ చరణ్ తో తీసిన గేమ్ చేంజర్ సినిమా కోసం కూడా శంకర్ భారీ ఖర్చుతో సినిమాలోని పాటలను అద్భుతమైన విజువల్స్ తో తెనకెక్కించినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని నిర్మాత దిల్ రాజు రివిల్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడుతూ..' ఈ సినిమాలో సాంగ్స్ అన్ని వావ్ అనిపించేలా ఉంటాయని, అలాగే ఈ మూవీ తమ బ్యానర్ లో 50వ సినిమా కాబట్టి ఖర్చుకు వెనకాడకుండా సినిమా చేసామని అన్నారు. అంతే కాదు సినిమాలో ఒక్కో సాంగ్ కి 10 నుంచి 12 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్టు దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

ఒక పాటకి 10 నుంచి 12 కోట్లు అంటే సినిమాలో శంకర్ సాంగ్స్ ని ఏ రేంజ్ లో డిజైన్ చేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి గేమ్ చేంజర్ ద్వారా ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ అయితే రాబోతుందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో తమన్ కూడా ఈ మూవీ సాంగ్స్ వేరే లెవల్లో ఉంటాయని చెప్పడం జరిగింది. మొత్తం మీద గేమ్ చేంజర్ సినిమాతో దర్శకుడు శంకర్ ఆడియన్స్ ని తన విజువల్స్ తో ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయమని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం దిల్ రాజు 250 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ ని వచ్చేఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు...!!



RRR Telugu Movie Review Rating

పుష్ప2 : టీజర్ లోనే కథ మొత్తం చెప్పేసారుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>