MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/t-op-heroes504e3e00-bf42-4a51-b570-2dc09265c362-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/t-op-heroes504e3e00-bf42-4a51-b570-2dc09265c362-415x250-IndiaHerald.jpgఈసారి సమ్మర్ రేస్ కు టాప్ హీరోలు అంతా దూరంగా ఉండటంతో మీడియం రేంజ్ చిన్న హీరోల సినిమాలతోనే ఈ సమ్మర్ పరిసమాప్తి కాబోతోంది. అయితే సమ్మర్ చివరిలో ప్రభాస్ ‘ఆదిపురుష్’ వస్తున్నప్పటికీ ఆసినిమా పై ప్రభాస్ అభిమానులలో కూడ కొన్ని సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏప్రియల్ నెల ప్రారంభంలో ఉండటంతో ఈనెలకు సంబంధించిన విజేత ఎవరు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. ఈవారం రెండు సినిమాలు విడుదలవుతున్నాయి.రవితేజా ‘రావణాసుర’ కిరణ్ అబ్బవరం ‘మీటర్’ ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల అవుతున్నాయి. ఈరెండు సినిమాలకు T OP HEROES{#}Mani Ratnam;Pooja Hegde;raghava lawrence;sai dharam tej;Winner;akhil akkineni;kiran;Ravi;Salman Khan;Prabhas;Coronavirus;Industry;Samantha;Teluguహీరోలకు సస్పెన్స్ గా మారిన ఏప్రియల్ !హీరోలకు సస్పెన్స్ గా మారిన ఏప్రియల్ !T OP HEROES{#}Mani Ratnam;Pooja Hegde;raghava lawrence;sai dharam tej;Winner;akhil akkineni;kiran;Ravi;Salman Khan;Prabhas;Coronavirus;Industry;Samantha;TeluguFri, 07 Apr 2023 08:13:16 GMTఈసారి సమ్మర్ రేస్ కు టాప్ హీరోలు అంతా దూరంగా ఉండటంతో మీడియం రేంజ్ చిన్న హీరోల సినిమాలతోనే ఈ సమ్మర్ పరిసమాప్తి కాబోతోంది. అయితే సమ్మర్ చివరిలో ప్రభాస్ ‘ఆదిపురుష్’ వస్తున్నప్పటికీ ఆసినిమా పై ప్రభాస్ అభిమానులలో కూడ కొన్ని సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏప్రియల్ నెల ప్రారంభంలో ఉండటంతో ఈనెలకు సంబంధించిన విజేత ఎవరు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. ఈవారం రెండు సినిమాలు విడుదలవుతున్నాయి.

 

 రవితేజా ‘రావణాసుర’ కిరణ్ అబ్బవరం ‘మీటర్’ ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల అవుతున్నాయి. ఈరెండు సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్ టిక్కెట్లకు ఏమాత్రం స్పందన కనిపించడంలేదు అంటున్నారు. దీనికితోడు ఈరెండు సినిమాల పై కూడ పెద్దగా అంచనాలు లేవు. ఈరెండు సినిమాల విడుదల తరువాత వచ్చేవారం విడుదలకాబోతున్న ‘శాకుంతలం’ మూవీని సమంత గుణశేఖర్ లు కష్టపడి ప్రమోట్ చేస్తున్నప్పటికీ ఈసినిమాకు ఇప్పటివరకు ఎటువంటి మ్యానియా ఏర్పడలేదు.

 

 
ఈసినిమాల తరువాత లారెన్స్ చాల గ్యాప్ తరువాత ‘రుద్రుడు’ గా వస్తున్నప్పటికీ ఆసినిమా పై కూడ ఎటువంటి క్రేజ్ లేదు అని అంటున్నారు. మరొకవైపు సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ నువెరైటీగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈసినిమాతో సల్మాన్ ఖాన్ వెంకటేష్ పూజా హెగ్డేల క్రేజీ ప్రాజెక్ట్ ‘కిసీకా భాయ్ కిసీకా జాన్’ విడుదల అవుతున్నప్పటికీ ఈమూవీకి కూడ ఇప్పటివరకు చెప్పుకోతగ్గ స్థాయిలో మ్యానియా ఏర్పడలేదు. ఇక చివరి వారంలో విడుదలవుతున్న కాబోతున్న అఖిల్ ‘ఏజెంట్’ పరిస్థితి పై కూడ క్లారిటీ లేదు.

 

 ఈమూవీ అసలు ఆడేట్ కు విడుదల అవుతుందా లేదా అన్నసందేహాలు కూడ కొందరికి ఉన్నాయి. ఈమూవీకి పోటీగా మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ విడుదల కాబోతోంది. అయితే ఈమూవీ పై తమిళనాడులో అంచనాలు ఉన్నాయి కానీ తెలుగు ప్రేక్షకులలో పెద్దగా మ్యానియా లేదు. మండిపోతున్న ఎండలు మధ్యమధ్యలో వస్తున్న వానలు మరొక వైపు ఫ్రీగా వస్తున్న ఐపీఎల్ మ్యాచులు పదో తరగతి పిల్లల పరీక్షలు పెరుగుతున్న కరోనా కేసులు ఇన్ని వ్యతిరేక పరిస్థితుల మధ్య ఈ ఏప్రియల్ నెల విజేత ఎవరు అంటూ చాలామంది సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..  





RRR Telugu Movie Review Rating

సమంత శాకుంతలం.. హిట్టు కొట్టేసినట్లే.. ఎందుకంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>