Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9014a1f3-7434-41a7-92b4-6bed537f2c83-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9014a1f3-7434-41a7-92b4-6bed537f2c83-415x250-IndiaHerald.jpgహను రాఘవ పూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం. ఈ సినిమా గత ఏడాది ఆగస్టు నెలలో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా ఈ సినిమా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో నటి మృణాల్ కి తెలుగులో ఎంతోమంది అభిమానులు ఎక్కువ అయిపోయారు.. ఇలా ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన ఈమెకు ఇకపై తెలుగులో వరుస అవకాశాలు కూడా వస్తాయని ఈమె ఇండస్ట్రీలో బిజీగా మారబోతున్నారని అందరూ కూడా భావించారు. ఇక మొదటి సినిమాని ఇంత మంచి విజయం అందుకున్న తర్వాత ఈమె వరుస సినిమాలతోSocialstars lifestyle {#}Chitram;Nani;Blockbuster hit;Cinemaతెలుగు దర్శకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మృనాల్ ఠాకూర్...!!తెలుగు దర్శకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మృనాల్ ఠాకూర్...!!Socialstars lifestyle {#}Chitram;Nani;Blockbuster hit;CinemaFri, 07 Apr 2023 11:06:50 GMTహను రాఘవ పూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్  జంటగా నటించిన చిత్రం సీతారామం. ఈ సినిమా గత ఏడాది ఆగస్టు నెలలో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇలా ఈ సినిమా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో నటి మృణాల్ కి తెలుగులో ఎంతోమంది అభిమానులు ఎక్కువ అయిపోయారు.. ఇలా ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన ఈమెకు ఇకపై తెలుగులో వరుస అవకాశాలు కూడా వస్తాయని ఈమె ఇండస్ట్రీలో బిజీగా మారబోతున్నారని అందరూ కూడా భావించారు.

ఇక మొదటి సినిమాని ఇంత మంచి విజయం అందుకున్న తర్వాత ఈమె వరుస సినిమాలతో బిజీ అవ్వడం ఏమోగానీ ఇప్పటివరకు మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు అయితే రాలేదు. దాదాపు ఈ సినిమా విడుదల అయ్యి సంవత్సరం అవుతున్న ఈమె తదుపరి సినిమా విడుదలకు నోచుకోలేక పోతుందటా.. ఇలాంటి ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమా తీసిన తర్వాత మృణాల్ తన తదుపరి సినిమాని ప్రకటించడానికి ఎందుకంత ఆలస్యం అవుతుందని పలువురు సందేహాలు అయితే వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మృణాల్ ఇలా సీతారామం తర్వాత అంత గ్యాప్ రావడానికి గల కారణాలను కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ సీతారామం సినిమా మంచి హిట్ అయిన తర్వాత తాను పలువురు స్టార్ డైరెక్టర్లను నిర్మాతలను కలిశానని కూడా తెలిపారు. అయితే వారు సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మి వంటి అద్భుతమైన పాత్రలో నటించిన మీకు అంతకన్నా గొప్ప పాత్ర సిద్ధం చేయాలి అంటే మాకు కొంత సమయం పడుతుంది అని చెప్పారు. అందుకే తన తదుపరి సినిమా రావడానికి చాలా ఆలస్యం అవుతుందని ఈ సందర్భంగా మృణాల్ చేసిన ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈమె నాని నటిస్తున్న సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా నాని 30వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోందటా.. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టనుందని సమాచారం.



RRR Telugu Movie Review Rating

ఈషా రెబ్బా పై మండి పడుతున్న నెటిజన్స్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>