MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc0ad4964-a030-4e18-ac58-6ffd980cbcdf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc0ad4964-a030-4e18-ac58-6ffd980cbcdf-415x250-IndiaHerald.jpg దాసరి నారాయణరావు కె.రాఘవేంద్రరావు లాంటి అగ్ర దర్శకులు పీక్ లో ఉన్నప్పుడు అప్పట్లో వారు టాప్ హీరోలతో భారీ సినిమాలు చేస్తూనే మరొక వైపు చిన్న సినిమాలను కూడ తీస్తూ అనేక హిట్స్ సాధించారు. అయితే ఇప్పటి తరం టాప్ దర్శకులు చిన్న సినిమాలు తీయడానికి ఏమాత్రం యిష్టపడకపోవడంతో వారి దృష్టి అంతా టాప్ యంగ్ హీరోల సినిమాల పైనే ఉంది.దీనికితోడు చిన్న సినిమా చచ్చిపోయింది అన్న మాటలు ఇండస్ట్రీలో తరుచు వినిపిస్తూ ఉండటంతో చాలామంది చిన్న సినిమా గురించి పూర్తిగా మర్చిపోయారు. ఇలాంటి పరిస్థితులలో ‘జాతిరత్నాలు’ ‘డీజే TOLLYWOOD{#}dasari narayana rao;GEUM;raj;Allu Aravind;Josh;Darsakudu;Comedy;News;Director;Cinemaబ్రతికిన చిన్న సినిమాల మ్యానియా !బ్రతికిన చిన్న సినిమాల మ్యానియా !TOLLYWOOD{#}dasari narayana rao;GEUM;raj;Allu Aravind;Josh;Darsakudu;Comedy;News;Director;CinemaThu, 06 Apr 2023 11:00:00 GMT 
దాసరి నారాయణరావు కె.రాఘవేంద్రరావు లాంటి అగ్ర దర్శకులు పీక్ లో ఉన్నప్పుడు అప్పట్లో వారు టాప్ హీరోలతో భారీ సినిమాలు చేస్తూనే మరొక వైపు చిన్న సినిమాలను కూడ తీస్తూ అనేక హిట్స్ సాధించారు. అయితే ఇప్పటి తరం టాప్ దర్శకులు చిన్న సినిమాలు తీయడానికి ఏమాత్రం యిష్టపడకపోవడంతో వారి దృష్టి అంతా టాప్ యంగ్ హీరోల సినిమాల పైనే ఉంది.
 
 
 
దీనికితోడు చిన్న సినిమా చచ్చిపోయింది అన్న మాటలు ఇండస్ట్రీలో తరుచు వినిపిస్తూ ఉండటంతో చాలామంది చిన్న సినిమా గురించి పూర్తిగా మర్చిపోయారు. ఇలాంటి పరిస్థితులలో ‘జాతిరత్నాలు’ ‘డీజే టిల్లు’ సినిమాలు ఘన విజయం సాధించడంతో కొంతవరకు చిన్నసినిమల దర్శక నిర్మాతలలో ధైర్యాన్ని కలిగించినప్పటికీ ఆతరువాత వచ్చిన చాల చిన్న సినిమాలు ఫెయిల్ అవ్వడంతో మళ్ళీ చిన్న సినిమాల గురించి ఎవరూ ఎక్కువగా మాట్లాడుకోలేదు.
 
 
 
ఇలాంటి పరిస్థితుల మధ్య సినిమా ఇండస్ట్రీకి అన్ సీజన్ గా పేర్కొనబడే మార్చిలో విడుదలైన చిన్న సినిమా ‘బలగం’ సక్సస్ చిన్న సినిమా నిర్మాతలకు మళ్ళీ జోష్ ఇచ్చింది. చావు చుట్టూ తిరిగే కథలో కూడ కామెడీ సృష్టించవచ్చు అన్న పాఠం ‘బలగం’ మూవీ తెలియచేస్తోంది. ‘బలగం’ సక్సస్ ను చూసిన చాలామంది ప్రముఖ నిర్మాతలు ఎవరైనా చిన్న దర్శకుడు తమకు ఎదురైతే అతడి వద్ద చిన్న సినిమాకు సంబంధించిన మంచి కథ ఏదైనా ఉందా అంటూ ఎంక్వైరీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
 
 
అంతేకాదు సినిమాల పై మోజుతో ఇండస్ట్రీలోకి వస్తున్న యంగ్ నిర్మాతలు టాప్ హీరోల చుట్టూ తిరుగుతూ వారి డేట్స్ సంపాదించి 100 కోట్లు జూదం ఆడేకంటే మంచి కథ దొరికితే చిన్న సినిమా తీయడం సేఫ్ గేమ్ అవుతుంది కదా అంటూ సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. అయితే చిన్న సినిమా తీయడం అంతసులువైన పని కాదనీ బాగా అనుభవం ఉన్న అల్లు అరవింద్ దిల్ రాజ్ లాంటి కొందరు మాత్రమే చిన్నసినిమాలు తీసి సక్సస్ కాగలుగుతున్నారు అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు..
 
 





RRR Telugu Movie Review Rating

నరేష్ "ఉగ్రం" మూవీ షూటింగ్ కంప్లీట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>