MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salmankhan91c2401f-5eae-4278-a13d-454f64dd4a25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salmankhan91c2401f-5eae-4278-a13d-454f64dd4a25-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ కు ఇప్పుడు ఒక సూపర్ హిట్ కావాలి. గత కొంతకాలంగా అతడి సినిమాలు వరసగా ఫ్లాప్ లు అవుతున్న పరిస్థితులలో సల్మాన్ మార్కెట్ బాగా దెబ్బతిన్నది. దీనికితోడు షారూఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీతో 1000 కోట్ల హీరోగా మారిన పరిస్థితులలో సల్మాన్ కు ఒక భారీ బ్లాక్ బష్టర్ హిట్ కావాలి. దీనితో అతడు లేటెస్ట్ గా నటిస్తున్న 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' మూవీ ఎదోవిధంగా బ్లాక్ బష్టర్ హిట్ చేయాలని అనేక కమర్షియల్ టెక్నిక్స్ అనుసరిస్తున్నాడు.సల్మాన్ మూవీకి దక్షిణాదిలో కూడ భారీ కలక్షన్స్ రాబట్టాలి అన్న SALMANKHAN{#}Athidhi;Salman Khan;Athadu;Mass;Father;Telugu;Hero;Venkatesh;Telangana;Ram Charan Teja;Cinemaసల్మాన్ ఖాన్ ఋణం తీర్చుకున్న చరణ్ !సల్మాన్ ఖాన్ ఋణం తీర్చుకున్న చరణ్ !SALMANKHAN{#}Athidhi;Salman Khan;Athadu;Mass;Father;Telugu;Hero;Venkatesh;Telangana;Ram Charan Teja;CinemaThu, 06 Apr 2023 10:00:00 GMTబాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ కు ఇప్పుడు ఒక సూపర్ హిట్ కావాలి. గత కొంతకాలంగా అతడి సినిమాలు వరసగా ఫ్లాప్ లు అవుతున్న పరిస్థితులలో సల్మాన్ మార్కెట్ బాగా దెబ్బతిన్నది. దీనికితోడు షారూఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీతో 1000 కోట్ల హీరోగా మారిన పరిస్థితులలో సల్మాన్ కు ఒక భారీ బ్లాక్ బష్టర్ హిట్ కావాలి. దీనితో అతడు లేటెస్ట్ గా నటిస్తున్న 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' మూవీ ఎదోవిధంగా బ్లాక్ బష్టర్ హిట్ చేయాలని అనేక కమర్షియల్ టెక్నిక్స్ అనుసరిస్తున్నాడు.


సల్మాన్ మూవీకి దక్షిణాదిలో కూడ భారీ కలక్షన్స్ రాబట్టాలి అన్న ఉద్దేశ్యంతో ఈమూవీలో వెంకటేష్ తో ఒక కీలక పాత్రలో నటింప చేస్తున్నాడు. ఇది చాలదు అన్నట్లుగా రామ్ చరణ్ ను అతిధి పాత్రలో ఈమూవీలో కనిపించే విషయంలో చరణ్ పై ఒత్తిడి చేసి ఒప్పించినట్లు తెలుస్తోంది. ఈమూవీలో కూడ ఒక లుంగీ డాన్స్ పాట ఉంది. ఈపాటలో చరణ్ వెంకటేష్ లు సల్మాన్ తో కలిసి లుంగీలు కట్టుకుని స్టెప్స్ వేయబోతున్నారు.


ఈపాటకు సంబంధించిన స్టిల్ ను లేటెస్ట్ గా విడుదలచేసారు. ఈ స్టిల్ లో చరణ్ సల్మాన్ ఖాన్ వెంకటేష్ లు లుంగీలు కట్టుకుని మాస్ స్టెప్స్ కు రెడీ అవుతున్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. వాస్తవానికి సల్మాన్ కు చిరంజీవితో అదేవిధంగా వేకటేశ్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ చనువుతోనే రామ్ చరణ్ కోరగానే చిరంజీవితో కలిసి ‘గాడ్ ఫాదర్’ మూవీలో అతిధిగా నటించడమే కాకుండా చిరంజీవితో కలిసి ఒక పాటకు స్టెప్స్ కూడ వేసాడు.


అయితే ఆసినిమా ఊహించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో సల్మాన్ ఖాన్ గురించి తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు చరణ్ తన తండ్రి సినిమాలో అతిధిగా నటించిన సల్మాన్ ఖాన్ ఋణం తీర్చుకుంటూ ఈమూవీలో అతిధిగా చేస్తున్నాడు అనుకోవాలి. ఈమూవీలో తెలంగాణ సంస్క్రతిని ప్రతిబింబించే బతుకమ్మ పాట పెట్టి సల్మాన్ వ్యూహాత్మకంగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు అనుకోవాలి..





RRR Telugu Movie Review Rating

నరేష్ "ఉగ్రం" మూవీ షూటింగ్ కంప్లీట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>