Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-fd765b18-828b-4ef4-8e28-bf709e737e45-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-fd765b18-828b-4ef4-8e28-bf709e737e45-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ని ఏలిన తెలుగు అమ్మాయిల్లో రంభ ఒకరు. 90లలో టాప్ స్టార్స్ తో రంభ జతకట్టారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో పలు చిత్రాల్లో నటించారు. ముద్దుగా బొద్దుగా ఉండే రంభ గ్లామర్ రోల్స్ చేశారు. స్కిన్ షోకి కూడా వెనుకాడేవారు కాదు. స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన రంభ… నాగార్జునతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. దీనికి పెద్ద కారణమే ఉందట. ఓ బ్లాక్ బస్టర్ సినిమా నుండి నాగార్జున తనను తప్పించడంతో ఆయనతో నటించకూడదని నిర్ణయం తీసుకున్నారట. 1992లో విడుదలైన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీతో రంభ వెండితెరకు పరిచSocialstars lifestyle {#}Rambha;indraja;silver screen;Hello;Ishtam;Venkatesh;Akkineni Nagarjuna;Heroine;Blockbuster hit;Hero;Cinema;Teluguనాగార్జునతో రంభ సినిమాలు చేయకపోవడానికి కారణం అదేనా....!!నాగార్జునతో రంభ సినిమాలు చేయకపోవడానికి కారణం అదేనా....!!Socialstars lifestyle {#}Rambha;indraja;silver screen;Hello;Ishtam;Venkatesh;Akkineni Nagarjuna;Heroine;Blockbuster hit;Hero;Cinema;TeluguThu, 06 Apr 2023 08:05:00 GMTటాలీవుడ్ ని ఏలిన తెలుగు అమ్మాయిల్లో రంభ ఒకరు. 90లలో టాప్ స్టార్స్ తో రంభ జతకట్టారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో పలు చిత్రాల్లో నటించారు.

ముద్దుగా బొద్దుగా ఉండే రంభ గ్లామర్ రోల్స్ చేశారు. స్కిన్ షోకి కూడా వెనుకాడేవారు కాదు. స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన రంభ… నాగార్జునతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. దీనికి పెద్ద కారణమే ఉందట. ఓ బ్లాక్ బస్టర్ సినిమా నుండి నాగార్జున తనను తప్పించడంతో ఆయనతో నటించకూడదని నిర్ణయం తీసుకున్నారట.

1992లో విడుదలైన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీతో రంభ వెండితెరకు పరిచయమయ్యారు. ఈవీవీ సత్యనారాయణ ఆ చిత్ర దర్శకుడు. రంభకు ఈవీవీ వరుస ఆఫర్స్ ఇచ్చారు. ఈ క్రమంలో తాను నాగార్జునతో చేస్తున్న హలో బ్రదర్ సినిమాకు రంభను హీరోయిన్ గా అనుకున్నారు. సౌందర్య, రంభ ఈ చిత్ర హీరోయిన్స్ గా ఈవీవీ ఫిక్స్ చేశారు. హీరో నాగార్జున హలో బ్రదర్ లో రంభకు బదులు రమ్యకృష్ణను పెట్టండని సూచించాడట.

ఈవీవీకి నాగార్జున సూచన ఇష్టం లేకపోయినా చేసేదేమీ లేక… రంభను తప్పించి ఆమె స్థానంలో రమ్యకృష్ణను తీసుకున్నారట. హలో బ్రదర్ ఆ ఏడాదికి అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రమ్యకృష్ణ, సౌందర్యల కెరీర్ కి ఆ చిత్ర విజయం ప్లస్ అయ్యింది. ఒక మంచి సినిమా నటించే ఛాన్స్ నాగార్జున కారణంగా కోల్పోయాననే అసహనం రంభలో ఉండిపోయిందట. దాంతో నాగార్జునతో లైఫ్ లో సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారట. ఆ నిర్ణయానికి కట్టుబడి రంభ ఆయన చిత్రాల్లో నటించలేదట.

విశేషం ఏమిటంటే… హలో బ్రదర్ మూవీలో ఛాన్స్ కోల్పోయిన రంభ ఆ మూవీలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. క్లైమాక్స్ కి ముందు వచ్చే 'కన్నె పెట్టరో' సాంగ్ లో రంభ, ఆమని, ఇంద్రజ నాగార్జునతో పాటు స్టెప్స్ వేశారు. తన గురువు ఈవీవీ అడగడంతో రంభ ఆ సాంగ్ చేసిందట. రంభ నాగార్జునతో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించిన ఏకైన సందర్భం అదే. మరలా కలిసి చిత్రాలు చేయలేదు. నాగార్జునను పక్కన పెట్టిన రంభ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో చిత్రాలు చేశారు. చిరంజీవితో బావగారు బాగున్నారా?, అల్లుడా మజాకా వంటి చిత్రాల్లో నటించారు.



RRR Telugu Movie Review Rating

నరేష్ "ఉగ్రం" మూవీ షూటింగ్ కంప్లీట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>