EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/indiacd7f973e-8061-45e2-a72c-0bbf53118098-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/indiacd7f973e-8061-45e2-a72c-0bbf53118098-415x250-IndiaHerald.jpgగతంలో యూరప్ దేశాలు భారత్ పై ప్రతి విషయంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూసేవి. రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా తమదే పై చేయి ఉండాలని అనుకునేవి. అలాంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం భారత్ తీరు పూర్తిగా మారిపోయింది. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ యూరప్ దేశాల తీరును ఎండగట్టారు. రాహుల్ గాాంధీ విషయంలో భారత్ లో ఏదో జరుగుతోందని దాన్ని మేం నిశితంగా గమనిస్తున్నామని సరైన సమయంలో స్పందిస్తామని యూరప్ దేశాల ప్రతినిధులు అన్నారు. దీనికి జై శంకర్ ఘాటు గానే సమాధానమిచ్చారు. యూరప్ దేశాలు ఇంకా ప్రతి దేశంలో తమ ఆధిపత్యINDIA{#}rahul;shankar;Minister;Rahul Sipligunj;Europe countries;INTERNATIONAL;Indiaయూరప్‌కు కర్రు కాల్చి వాత పెట్టిన భారత్‌?యూరప్‌కు కర్రు కాల్చి వాత పెట్టిన భారత్‌?INDIA{#}rahul;shankar;Minister;Rahul Sipligunj;Europe countries;INTERNATIONAL;IndiaThu, 06 Apr 2023 08:00:00 GMTగతంలో యూరప్ దేశాలు భారత్ పై ప్రతి విషయంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూసేవి. రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా తమదే పై చేయి ఉండాలని అనుకునేవి. అలాంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం భారత్ తీరు పూర్తిగా మారిపోయింది. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ యూరప్ దేశాల తీరును ఎండగట్టారు. రాహుల్ గాాంధీ విషయంలో భారత్ లో ఏదో జరుగుతోందని దాన్ని మేం నిశితంగా గమనిస్తున్నామని సరైన సమయంలో స్పందిస్తామని యూరప్ దేశాల ప్రతినిధులు అన్నారు. దీనికి జై శంకర్ ఘాటు గానే సమాధానమిచ్చారు.


యూరప్ దేశాలు ఇంకా ప్రతి దేశంలో తమ ఆధిపత్యం చెలాయించుకోవాలని అనుకుంటున్నాయని అన్నారు ప్రతి సమస్యను తమ సమస్యగా భావిస్తున్నాయని ఇది మానుకోవాలని హెచ్చరించారు. ఏ సమస్యలై నా యూరప్ దేశాలు తమ విగా భావించి వేరే దేశాల అంతర్గత విషయాల్లో తల దూర్చడం మానేస్తే మంచిదని హితువు పలికారు.


గతంలో యూరప్ దేశాలు ఎలా చెప్పినా భారత్ వినేది. తాన అంటే తందాన అనే రోజుల నుంచి అవి ఎటాకింగ్ పద్ధతిలో భారత్ పై నిందలు వేయాలని చూస్తే అదే తీరులో సమాధానం చెబుతోంది. దేశ సరిహద్దుల నుంచి దేశ అంతర్జాతీయ విషయాల్లో ఏ దేశమైనా భారత్ ను నిందించాలని చూస్తే కచ్చితమైన సమాధానాలతో ఆయా దేశాల తీరును ఎండగడుతోంది. విదేశాలతో దౌత్య విధానంలో కూడా కరాఖండిగా ఉంటోంది.


యూరప్ దేశాలనే కాకుండా ఏ దేశమైనా భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే గతంలో ఆయా దేశాలు ఏ సమయంలో ఏ తప్పు చేశాయని ఆధారాలతో సహా బయటపెడుతోంది. తద్వారా భారత్ అంటే బలహీనమైన దేశం కాదని బలమైన ఆర్థిక వ్యవస్థ, రాజకీయ ప్రజాస్వామ్య దేశమని నిరూపిస్తోంది. ఎప్పుడూ ఏదో దేశంపై ఆరోపణలు చేసే యూరప్, అమెరికాలకు సరైన సమాధానాలను చెబుతూ విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రతిష్ఠను పెంచుతున్నారు.



RRR Telugu Movie Review Rating

నరేష్ "ఉగ్రం" మూవీ షూటింగ్ కంప్లీట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>