MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan6e9f724c-3fe4-4cce-a4e8-581da050e934-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan6e9f724c-3fe4-4cce-a4e8-581da050e934-415x250-IndiaHerald.jpgగతంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేసే సమయంలో నాలుగు రోజులు షూటింగ్ చేస్తే మరో పది రోజులు బ్రేక్ తీసుకుంటూ ఉండేవాడు. అయితే ఇప్పుడు పవన్ పూర్తిగా మారిపోయాడు. మొన్నటివరకు ఢిల్లీలో భారతీయ జనతాపార్టీ టాప్ లీడర్ లను కలుస్తూ తన భవిష్యత్ రాజకీయాలకు పదును పెట్టుకుంటూ బిజీగా గడిపిన పవన్ నిన్నటిరోజున హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమా షూటింగ్ కు రావడమే కాకుండా ఆ షూటింగ్ లో చాల ఉత్సాహంగా పాల్గొంటూ కనిపించిన పవన్ ను చూసి చాలామంది ఆశ్చర్యపోయినట్లు టాక్. ‘గబ్బర్ సింగ్’ మూవీ తరువాత వీరిద్దరి కాంబినేpavan kalyan{#}sujeeth;Leader;Pooja Hegde;kalyan;Tamil;Remake;Heroine;harish shankar;media;Cinemaహాట్ టాపిక్ గా మారిన పవన్ ద్విపాత్రాభినయం!హాట్ టాపిక్ గా మారిన పవన్ ద్విపాత్రాభినయం!pavan kalyan{#}sujeeth;Leader;Pooja Hegde;kalyan;Tamil;Remake;Heroine;harish shankar;media;CinemaThu, 06 Apr 2023 08:13:03 GMTగతంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేసే సమయంలో నాలుగు రోజులు షూటింగ్ చేస్తే మరో పది రోజులు బ్రేక్ తీసుకుంటూ ఉండేవాడు. అయితే ఇప్పుడు పవన్ పూర్తిగా మారిపోయాడు. మొన్నటివరకు ఢిల్లీలో భారతీయ జనతాపార్టీ టాప్ లీడర్ లను కలుస్తూ తన భవిష్యత్ రాజకీయాలకు పదును పెట్టుకుంటూ బిజీగా గడిపిన పవన్ నిన్నటిరోజున హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమా షూటింగ్ కు రావడమే కాకుండా ఆ షూటింగ్ లో చాల ఉత్సాహంగా పాల్గొంటూ కనిపించిన పవన్ ను చూసి చాలామంది ఆశ్చర్యపోయినట్లు టాక్.  


‘గబ్బర్ సింగ్’ మూవీ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ‘భవధీయుడు భగత్ సింగ్’ అంటూ ప్రచారంలోకి వచ్చిన ఈమూవీ టైటిల్ చివరకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా మారింది. తమిళ సినిమా రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ కథలో హరీష్ శంకర్ అనేక మార్పులు చేర్పులు చేసాడు అని అంటున్నారు.


ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పక్కన సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తూ ఉంటే మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ని ఫిక్స్ చేయడానికి హరీష్ శంకర్ చాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న ఉదయం ఈమూవీ షూటింగ్ ప్రారంభానికి ముందు హరీష్ శంకర్ ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం’ అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేసాడు.


ఈమూవీ షూటింగ్ లో 10 రోజులు వరసగా పాల్గొని ఆతరువాత పవన్ సుజిత్ దర్శకత్వంలోని లేటెస్ట్ మూవీ వైపు వెళతాడు అని అంటున్నారు. ఈసారి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న పవన్ వరసపెట్టి సినిమాలు చేస్తూ మరొకవైపు తన రాజకీయ వ్యూహాలకు పెడుతున్న పదును చూసి తలలు పండిన రాజకీయ వేత్తలు కూడ ఆశ్చర్యపోతు పూర్తిగా మారిపోయిన పవన్ కళ్యాణ్ ను ఎత్తులను నిశితంగా పరిశీలిస్తున్నారు..






RRR Telugu Movie Review Rating

నరేష్ "ఉగ్రం" మూవీ షూటింగ్ కంప్లీట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>