Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli6832095f-9471-442f-90a9-517a4b7857f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli6832095f-9471-442f-90a9-517a4b7857f2-415x250-IndiaHerald.jpgటీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2021లో టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుని అభిమానులందరికీ కూడా ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఒకవైపు ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్గా తప్పుకోవడమే కాదు అటు అంతర్జాతీయ క్రికెట్ లో భారత టి20 కెప్టెన్ గా కూడా తప్పుకున్నాడు. దీంతో కోహ్లీ ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని అందరూ షాక్ అయ్యారు. అయితే కోహ్లీ తర్వాత భారత కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ చేపడితే... ఇక ఐపీఎల్ లో బెంగళూరు జట్టు బాధ్యతలను డూప్లెసిస్ భుజాన వేసుకున్నాడు అని చెప్పాలKohli{#}VIRAT KOHLI;INTERNATIONALకెప్టెన్సీ వదిలేయడం వల్లే.. కోహ్లీ నవ్వుతున్నాడు : ఏబిడికెప్టెన్సీ వదిలేయడం వల్లే.. కోహ్లీ నవ్వుతున్నాడు : ఏబిడిKohli{#}VIRAT KOHLI;INTERNATIONALThu, 06 Apr 2023 15:15:00 GMTటీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2021లో టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుని అభిమానులందరికీ కూడా ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఒకవైపు ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్గా తప్పుకోవడమే కాదు అటు అంతర్జాతీయ క్రికెట్ లో భారత టి20 కెప్టెన్ గా కూడా తప్పుకున్నాడు. దీంతో కోహ్లీ ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని అందరూ షాక్ అయ్యారు. అయితే కోహ్లీ తర్వాత భారత కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ చేపడితే... ఇక ఐపీఎల్ లో బెంగళూరు జట్టు బాధ్యతలను డూప్లెసిస్ భుజాన వేసుకున్నాడు అని చెప్పాలి.


 అయితే కోహ్లీ కెప్టెన్సీ రిటైర్మెంట్ తర్వాత బెంగళూరు జట్టు బాధ్యతలు అటు ఎబి డివిలియర్స్ చేతికి వెళ్తాయి అనుకున్నప్పటికీ 2021 ఐపిఎల్ ప్రారంభానికి ముందే దివిలియర్స్ ఏకంగా ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఇకపోతే ఇటీవల కోహ్లీ కెప్టెన్సీ వదిలేయడం గురించి అతని స్నేహితుడు ఏబీడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ తో పాటు భారత జట్టు సారధ్య బాధ్యతలు వదిలేయడంతోనే కోహ్లీ సంతోషంగా ప్రశాంతంగా ఉన్నాడు అంటూ అభిప్రాయపడ్డాడు.


 ప్రస్తుతం విరాట్ కోహ్లీలో పెద్దగా మార్పు ఏమీ లేదు. అతని ఆటతీరులో టెక్నిక్ అలాగే బలంగా ఉంది. ఇక క్రీజ్ లో ఎంతో చక్కగా కదులుతున్నాడు. అయితే ఈ సీజన్ కోసం ఎంతో ఫ్రెష్ గా కోహ్లీ సిద్ధమయ్యాడు. ఇక ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో విరాట్ కోహ్లీని చూస్తే మునుపటికంటే ఎక్కువగా నవ్వుతూ కనిపించాడు. అయితే అతని నవ్వుల వెనుక కెప్టెన్సీ వదిలేయడమే కారణం అనుకుంటున్నాను. అతను ఒక అద్భుతమైన నాయకుడు. కానీ సుదీర్ఘకాలం పాటు అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కు ఐపీఎల్ లో ఆర్సిబి కి సారధిగా వ్యవహరించడం కష్టమైన పని. కుటుంబం, స్నేహితులతో గడిపేందుకు సమయం దొరకదు. ఇక ఇప్పుడు ఆ భారం లేదు కాబట్టి కోహ్లీని నవ్వులు చిందిస్తున్నాడు. అంటూ ఎబి డివిలియర్స్ వ్యాఖ్యానించాడు.



RRR Telugu Movie Review Rating

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న దిల్ రాజు వైఫ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>