PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-ycp-tdp7e74720a-9824-4d63-82fc-f0b2e51fe7bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-ycp-tdp7e74720a-9824-4d63-82fc-f0b2e51fe7bd-415x250-IndiaHerald.jpgఅయితే ఇక్కడ జగన్ ఫుల్లు హ్యాపీ ఎందుకంటే తాను ఎవరికైతే టికెట్లు ఇవ్వకూడదని అనుకుంటున్నారో వాళ్ళంతా టీడీపీలో చేరుతున్నారంటే హ్యాపీగా ఉండక ఇంకెలాగుంటారు ? తాను చేయించుకున్న సర్వేల్లో అన్నీ విధాలుగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన వాళ్ళకే జగన్ టికెట్ ఇచ్చేది లేదని చెప్పేస్తున్నారు. టికెట్ ఇచ్చినా గెలవరని జగన్ ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళంతా టీడీపీలోకి వెళ్ళి టికెట్లు తీసుకుని పోటీ చేయాలని అనుకుంటున్నారని సమాచారం. jagan ycp tdp{#}ATCHANNAIDU KINJARAPU;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;YCP;Undavalli;Party;TDP;CBN;Jagan;Reddy;Hanu Raghavapudi;Racchaఅమరావతి : టీడీపీపై జగన్ రివర్స్ స్ట్రాటజీ...అదుర్సేనా ?అమరావతి : టీడీపీపై జగన్ రివర్స్ స్ట్రాటజీ...అదుర్సేనా ?jagan ycp tdp{#}ATCHANNAIDU KINJARAPU;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;YCP;Undavalli;Party;TDP;CBN;Jagan;Reddy;Hanu Raghavapudi;RacchaWed, 05 Apr 2023 09:00:00 GMT



రాష్ట్రంలో  రాజకీయం విచిత్రంగా ఉంది. ఒకపార్టీ నుండి మరోపార్టీలోకి నేతలు వెళిపోతున్నారంటే సదరు పార్టీలో టెన్షన్ పెరిగిపోవటం సహజం. కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫుల్లు హ్యాపీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవైపు 40-50 మంది ఎంఎల్ఏలు తమతో టచ్ లో ఉన్నారని, చంద్రబాబునాయుడు ఊ అనంటే చాలు వైసీపీలో నుండి టీడీపీలోకి వచ్చేయటానికి రెడీగా ఉన్నారని అచ్చెన్నాయుడు దగ్గర నుండి ఎల్లోమీడియా వరకు నానా రచ్చ చేస్తున్న విషయం చూస్తున్నదే.





తమ్ముళ్ళు, ఎల్లోమీడియా రచ్చ ఎంతవరకు నిజమో తెలీదు కానీ తొందరలోనే టీడీపీలో చేరటానికి నలుగురు సస్పెండెడ్ ఎంఎల్ఏలు సిద్ధంగా ఉన్నారని మాత్రం అర్ధమవుతోంది. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుండి జగన్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వీళ్ళంతా చంద్రబాబుతో డీల్ సెట్టయిన తర్వాతే క్రాస్ ఓటింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. కాబట్టి వీళ్ళకు టికెట్లిస్తారనే అనుకుందాం. మరి మిగిలిన ఎంఎల్ఏల మాటేమిటి ?





అయితే ఇక్కడ జగన్ ఫుల్లు హ్యాపీ ఎందుకంటే తాను ఎవరికైతే టికెట్లు ఇవ్వకూడదని అనుకుంటున్నారో వాళ్ళంతా టీడీపీలో చేరుతున్నారంటే హ్యాపీగా ఉండక ఇంకెలాగుంటారు ? తాను చేయించుకున్న సర్వేల్లో అన్నీ విధాలుగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన వాళ్ళకే జగన్ టికెట్ ఇచ్చేది లేదని చెప్పేస్తున్నారు. టికెట్ ఇచ్చినా గెలవరని జగన్ ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళంతా టీడీపీలోకి వెళ్ళి టికెట్లు తీసుకుని పోటీ చేయాలని అనుకుంటున్నారని సమాచారం.





అలా వచ్చిన వాళ్ళల్లో చంద్రబాబు ఎంతమందికి టికెట్లిస్తారో తెలీదు. నిజంగానే చంద్రబాబు అందరికీ టికెట్లు ఇస్తే వాళ్ళల్లో ఎంతమంది గెలుస్తారు ? వైసీపీ నుండి టీడీపీలో చేరిన వాళ్ళకి టికెట్లిస్తే మరి టికెట్లపై ఆశలు, నమ్మకం పెట్టుకున్న లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్న  తమ్ముళ్ళు చూస్తు ఊరుకుంటారా ? ఫిరాయింపులను తీసుకుని 2019 ఎన్నికల్లో కంపైనట్లే టీడీపీ మరోసారి కంపు కాకుండా ఉంటుందా ? ఇవన్నీ చూసుకునే జగన్ హ్యాపీగా ఉన్నారట.









RRR Telugu Movie Review Rating

ఆ మూవీలతో 2 మిలియన్ ను "యూఎస్ఏ" లో అందుకున్న టాలీవుడ్ హీరోలు విరే..!

ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

బ్లాక్‌ హోల్స్‌.. ఈ డార్క్‌ సీక్రెట్‌ కనిపెడతారా?

పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>