LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/ricefbe0ccc6-245d-4ba1-a4b2-ba2a57989534-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/ricefbe0ccc6-245d-4ba1-a4b2-ba2a57989534-415x250-IndiaHerald.jpgపూర్వం మన పెద్దలు ఇంట్లో వాడే పప్పులు,ఉప్పులు సంవత్సరానికి సరిపడా ఒకేసారి కొని పెట్టి, నిల్వ ఉంచుకొనేవారు.కానీ అవి అస్సలు పురుగులు పట్టేవి కావు.కానీ ఇప్పుడు నెలకి సరిపోయే బియ్యం, పప్పులు తెచ్చుకున్నా సరే అవి అప్పుడే పురుగులు పట్టేస్తున్నాయని చాలా మంది అంటుంటారు.మరీ ముఖ్యంగా బియ్యం తొందరగా పురుగులు పట్టేస్తాయి. మాటి మాటికీ వాటిని శుభ్రం చేసుకోవడం కూడా కష్టతరమే.కావున కొన్ని చిట్కాలు పాటిస్తే బియ్యం ఎన్ని రోజులు వున్న పురుగులు పట్టవని,పెద్దవారు చెబుతుంటారు.అవేంటో ఇప్పుడు చూద్దాం.. RICE{#}surya sivakumar;Air;Manamబియ్యం ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఈ చిట్కా పాటించాల్సిందే..!బియ్యం ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఈ చిట్కా పాటించాల్సిందే..!RICE{#}surya sivakumar;Air;ManamWed, 05 Apr 2023 19:00:00 GMTపూర్వం మన పెద్దలు ఇంట్లో వాడే పప్పులు,ఉప్పులు సంవత్సరానికి సరిపడా ఒకేసారి కొని పెట్టి, నిల్వ ఉంచుకొనేవారు.కానీ అవి అస్సలు పురుగులు పట్టేవి కావు.కానీ ఇప్పుడు నెలకి సరిపోయే బియ్యం, పప్పులు తెచ్చుకున్నా సరే అవి అప్పుడే పురుగులు పట్టేస్తున్నాయని చాలా మంది అంటుంటారు.మరీ ముఖ్యంగా బియ్యం తొందరగా పురుగులు పట్టేస్తాయి. మాటి మాటికీ వాటిని శుభ్రం చేసుకోవడం కూడా కష్టతరమే.కావున కొన్ని చిట్కాలు పాటిస్తే బియ్యం ఎన్ని రోజులు వున్న పురుగులు పట్టవని,పెద్దవారు చెబుతుంటారు.అవేంటో ఇప్పుడు చూద్దాం..

బియ్యంలో సాధారణంగా నల్లటి పురుగులు ఎక్కువగా ఉంటాయి.దీనికి కారణం మిల్లులో ప్రాసెస్ చేసినా తర్వాత కూడా అందులో ఒక్క పురుగు వున్నా కూడా అది పిల్లలను లేపుతుంది.అలాగే మొత్తం పురుగుల మయం అవుతాయి.కావున పూర్వం మన పెద్దలు పాటించే చిట్కాలే మనం ఇప్పుడు తెలుసుకుందాం..

బిర్యానీ ఆకులు..

బియ్యం స్టోర్ చేసే మూటలో ఆరేడు బిర్యానీ ఆకులను ఉంచాలి.ఇలా చేయడం వల్ల, బిర్యానీ ఆకులకున్న వాసన వల్ల పురుగులు పట్టవు.

లవంగాలు..

లవంగాలకు బలమైన సువాసన కలిగి ఉంటుంది కాబట్టి బియ్యానికి పురుగులు పట్టకుండా సహాయపడతాయి.లవంగం నూనెను స్ప్రే చేయడంతో వేసవిలో ఎక్కువగా వచ్చే నల్ల దోమలను నివారిస్తుంది.

వెల్లుల్లి..

ప్రతి ఇంట్లో లభించే ఘాటయినా పదార్థం వెల్లుల్లి. దీన్ని పొట్టు తీసి బియ్యంలో కలిపేయాలి.వాటి వాసనకు పురుగులు వెళ్ళిపోతాయి.

మిరియాలు..

బియ్యం ఎక్కువగా తీసుకున్నప్పుడు వాటిని స్టోర్ చేసుకునే డబ్బాలో,ఒక గుడ్డ తీసుకొని అందులో గుప్పెడు మిరియాలు వేసి మూట కట్టి పెట్టాలి. అప్పుడు బియ్యం పురుగులు పట్టవు.

బియ్యం మరీ అధికంగా పురుగులు పడితే బియ్యాన్ని నీడలో అరబెట్టుకోవాలి.అలా అని మరీ ఎర్రటి ఎండలో ఎండబెడితే,విరిగిపోతాయి.పురుగులన్నీ పోయాక గాలి చొరబడకుండా డబ్బాలో వేసి, స్టోర్ చేసుకోవాలి.మరియు ఇంట్లో ఎక్కువగా వున్నా బియ్యం, పప్పులు అప్పుడప్పుడు సూర్య కాంతిలో అరబెట్టుకోవడం చాలా మంచిది.కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే బియ్యం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.



RRR Telugu Movie Review Rating

నితిన్ మూవీలో మరో బ్యూటిఫుల్ నటి..?

ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

బ్లాక్‌ హోల్స్‌.. ఈ డార్క్‌ సీక్రెట్‌ కనిపెడతారా?

పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>