EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/amaravati6ed027dc-ab8c-479b-acba-9938b5b82fb2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/amaravati6ed027dc-ab8c-479b-acba-9938b5b82fb2-415x250-IndiaHerald.jpgవిజయవాడ, గుంటూరు పరిసరాల చుట్టూ ఉన్న రియల్టర్లు చంద్రబాబు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర విభజనకు ముందు, విభజన తర్వాత హైదరాబాద్ లో చాలా వెంచర్లు, అపార్టు మెంట్లు కొనేవాళ్లు లేరు. కారణం రాష్ట్రం విడిపోతే కొనే వారు ఉండరేమోనని భయపడ్డారు. ముఖ్యంగా రియల్టర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు అమరావతి, గుంటూరు లాంటి ప్రాంతాల్లో ఉంది. ఎందుకంటే అమెరికా, గుంటూరులలో ముఖ్యంగా అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత అక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రియల్ ఎస్టేట్ ప్రతినిధులు, వెంచAMARAVATI{#}CBN;Jagan;Amaravati;Guntur;Capital;Party;Hyderabadబాబునే నమ్ముకున్న అమరావతి రియల్‌ ఎస్టేట్‌?బాబునే నమ్ముకున్న అమరావతి రియల్‌ ఎస్టేట్‌?AMARAVATI{#}CBN;Jagan;Amaravati;Guntur;Capital;Party;HyderabadWed, 05 Apr 2023 23:00:00 GMTవిజయవాడ, గుంటూరు పరిసరాల చుట్టూ ఉన్న రియల్టర్లు చంద్రబాబు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర విభజనకు ముందు, విభజన తర్వాత హైదరాబాద్ లో చాలా వెంచర్లు, అపార్టు మెంట్లు కొనేవాళ్లు లేరు. కారణం రాష్ట్రం విడిపోతే కొనే వారు ఉండరేమోనని భయపడ్డారు. ముఖ్యంగా రియల్టర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు అమరావతి, గుంటూరు లాంటి ప్రాంతాల్లో ఉంది. ఎందుకంటే అమెరికా, గుంటూరులలో ముఖ్యంగా అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత అక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రియల్ ఎస్టేట్ ప్రతినిధులు, వెంచర్లు వేసేవారు, రియల్టర్లు ఎక్కడికక్కడ భూములను కొనేశారు.


కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవంతులను కట్టారు. కానీ జగన్ సీఎం అయ్యాక మూడు రాజధానుల ప్రపోజల్ తీసుకురావడంతో ఒక్క సారిగా అమరావతి, గుంటూరులో భూముల, ప్లాట్ల రేట్లు పడిపోయాయి. దీంతో ఏమీ చేయాలో తోచని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. ఎవరూ కొనడానికి ముందుకు రావడం లేదు. దీని వల్ల రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా చతికిల బడిపోయింది. ఇప్పుడు కూడా ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కాబట్టి చంద్రబాబు టీడీపీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తేనే అమరావతి డెవలప్ మెంట్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు.


అమరావతి రాజధానిగా ఉండాలని రియల్టర్లు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్క చోట ఉంటే భూములు, ఇతర అన్ని రంగాలు తొందరగా రేట్లు పెరుగుతాయి. ఆ ప్రాంతం రాజధాని అయ్యే సమయంలో ఎన్నో కంపెనీలు పెట్టుబడులు పెడతాయి. నిర్మాణ రంగం పుంజుకుంటుంది. ఎంతో మందికి ఉపాధి దొరకుతుంది. కొత్త కొత్త కంపెనీలు వస్తాయి. వాటి వల్ల యువతకు ఉద్యోగాలు దొరకుతాయి. ఇలా ఎందరికో లాభం కలుగుతుంది. ఒక ప్రాంతం లో డెవలప్ చేయడం వల్ల దానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. బాబుని ప్రస్తుతం రియల్టర్లు నమ్ముతున్నారు. ఒక వేళ వచ్చే ఎన్నికల్లో బాబు గెలిస్తే వారు అనుకున్నది సాధించేందుకు తోడ్పాటు అందిస్తారని బలంగా విశ్వసిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

నిన్న బికినీలో ఈరోజు ఇలా.. మృణాల్ ఠాకూర్..!!

ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

బ్లాక్‌ హోల్స్‌.. ఈ డార్క్‌ సీక్రెట్‌ కనిపెడతారా?

పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>