EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrainceb20eb8-87d0-421d-97b4-3cb7fced1385-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukrainceb20eb8-87d0-421d-97b4-3cb7fced1385-415x250-IndiaHerald.jpgయూరప్ పై ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉక్రెయిన్ కు యూరప్ దేశాలు ఇస్తున్న ఆయుధాలు నాసిరకంగా ఉంటున్నాయని మొదటి నుంచి ఆరోపిస్తుంది. అయితే ఎవరూ వాడకుండా పక్కన పాడేసిన ఆయుధాలను ఇచ్చి యుద్దం చేయమంటున్నాయని ఉక్రెయిన్ ఇప్పటికే చాలా సార్లు చెప్పింది. అసలు సమస్య ఇప్పుడే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. యూరప్ దేశాలు రష్యా పై విధించిన ఆర్థిక ఆంక్షలను పట్టించుకోకుండా గ్యాస్ ను రష్యా దేశం నుంచి కొనుగోలు చేస్తున్నట్లు ఉక్రెయిన్ కు తెలిసింది. దీంతో భారత్ గురించి జెలెన్ స్కీ గతంలో మాట్లాడుతూ.. రష్యా నుంUKRAIN{#}vishwa;Russia;Ukraine;oil;Europe countries;war;Indiaఉక్రెయిన్‌ను యూరప్‌ దేశాలు నట్టేట్లో ముంచాయా?ఉక్రెయిన్‌ను యూరప్‌ దేశాలు నట్టేట్లో ముంచాయా?UKRAIN{#}vishwa;Russia;Ukraine;oil;Europe countries;war;IndiaWed, 05 Apr 2023 09:00:00 GMTయూరప్ పై ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉక్రెయిన్ కు యూరప్ దేశాలు ఇస్తున్న ఆయుధాలు నాసిరకంగా ఉంటున్నాయని మొదటి నుంచి ఆరోపిస్తుంది. అయితే ఎవరూ వాడకుండా పక్కన పాడేసిన ఆయుధాలను ఇచ్చి యుద్దం చేయమంటున్నాయని ఉక్రెయిన్ ఇప్పటికే చాలా సార్లు చెప్పింది. అసలు సమస్య ఇప్పుడే ప్రారంభమైనట్లు తెలుస్తోంది.


యూరప్ దేశాలు రష్యా పై విధించిన ఆర్థిక ఆంక్షలను పట్టించుకోకుండా గ్యాస్ ను  రష్యా దేశం  నుంచి కొనుగోలు చేస్తున్నట్లు ఉక్రెయిన్ కు తెలిసింది.  దీంతో భారత్ గురించి జెలెన్ స్కీ గతంలో మాట్లాడుతూ..  రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నారంటే మా రక్తంతో కొన్నట్లే అని అన్నారు. ప్రస్తుతం అవే వ్యాఖ్యలను యూరప్ పై చేస్తున్నారు.


పెట్రోల్, డిజీల్ ను యూరప్ దేశాలు కొనడం లేదు. కానీ అమెరికా, యూరప్ దేశాలు విధించుకున్న ఆంక్షలకు విరుద్దంగా గ్యాస్ ను కొంటున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  రష్యా నుంచి ఆయిల్ ను కొన్ని యూరప్ దేశాలు కొంటున్నట్లు పోలండ్ అధ్యక్షుడు ఈ మధ్య ఆరోపించారు. కానీ యూరప్ దేశాలు తమకేమీ తెలియనట్లు ఇన్ని రోజులు కపట నాటకాన్ని ప్రదర్శించాయి.


ఒక వైపు యుద్ధం చేయమని ఆయుధాలు ఇస్తూనే మరో వైపు రష్యా దగ్గరి నుంచి గ్యాస్ కొని ఆ దేశానికి ఆర్థికంగా సాయపడుతున్నాయి. ఇన్ని రోజులు భారత్ ఆయిల్ కొంటుందని దాన్ని ఎలా గైనా నియంత్రించాలని యూరప్ దేశాలు  విశ్వ ప్రయత్నాలే చేశాయి. జీ20 సదస్సులో రష్యాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని పట్టుబడ్డాయి.  భారత్ తన నిర్ణయాన్ని ఎక్కడా మార్చుకోలేదు. తటస్థంగా ఉంటామన్న మాటకు కట్టుబడి ఉంటోంది. యూరప్ దేశాల లాగా ముందు ఒక మాట చెప్పడం, దాన్ని చాటుగా చేయడం లాంటి నిర్ణయాలకు దూరంగా ఉంటోంది. భారత్ ఏ విషయాన్నైనా  కుండబద్దలు కొట్టి చెబుతోంది.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ 30 వ మూవీ విషయంలో ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంట..!

ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

బ్లాక్‌ హోల్స్‌.. ఈ డార్క్‌ సీక్రెట్‌ కనిపెడతారా?

పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>