EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukraine5e45d6e-2217-4980-a4ed-c37dcfa7f656-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ukraine5e45d6e-2217-4980-a4ed-c37dcfa7f656-415x250-IndiaHerald.jpgఉక్రెయిన్ కు అమెరికా ఇచ్చిన 100 శాతం హామీల్లో ఇప్పటి వరకు 20 శాతం కూడా అమలు కాలేవని తెలుస్తోంది. ఉక్రెయిన్ కు ఇస్తున్నట్లు చెబుతున్నా ఆయుధాలు 20 శాతం కూడా పంపడం లేదని ఉక్రెయిన్ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉక్రెయిన్ లో ఇప్పటికే ఆయుధ కొరత తీవ్రంగా ఉంది. కానీ అమెరికా మాత్రం ప్రపంచ దేశాల ముందు యుద్ధాన్ని తామే నడిపిస్తున్నట్లు చెబుతోంది. యుద్ధరంగంలో ఇస్తున్న ఆయుధాలు మాత్రం చాలా తక్కువే అని తెలుస్తోంది. ఉక్రెయిన్ కు ఇస్తున్నట్లు చెప్పి అమెరికా తన ఆయుధ భాండాగారాలను పూర్తిగా నింపేసుకుంటోంది. అమెUKRAIN{#}Russia;Ukraine;American Samoa;warయుద్ధం: అమెరికాను నమ్మి ఉక్రెయిన్‌ మోసపోయిందా?యుద్ధం: అమెరికాను నమ్మి ఉక్రెయిన్‌ మోసపోయిందా?UKRAIN{#}Russia;Ukraine;American Samoa;warWed, 05 Apr 2023 10:00:00 GMTఉక్రెయిన్ కు అమెరికా ఇచ్చిన 100 శాతం హామీల్లో ఇప్పటి వరకు 20 శాతం కూడా అమలు కాలేవని తెలుస్తోంది. ఉక్రెయిన్ కు ఇస్తున్నట్లు చెబుతున్నా ఆయుధాలు 20 శాతం కూడా పంపడం లేదని ఉక్రెయిన్ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉక్రెయిన్ లో ఇప్పటికే ఆయుధ కొరత తీవ్రంగా ఉంది. కానీ అమెరికా మాత్రం ప్రపంచ దేశాల ముందు యుద్ధాన్ని తామే నడిపిస్తున్నట్లు చెబుతోంది.


యుద్ధరంగంలో ఇస్తున్న ఆయుధాలు మాత్రం చాలా తక్కువే అని తెలుస్తోంది. ఉక్రెయిన్ కు ఇస్తున్నట్లు చెప్పి అమెరికా తన ఆయుధ భాండాగారాలను పూర్తిగా నింపేసుకుంటోంది. అమెరికా తరఫున ఉక్రెయిన్ లో పని చేస్తున్న మాజీ సైనికాధికారులకు ఇచ్చే జీతాల్ని సైతం ఉక్రెయిన్ కు ఖర్చు పెడుతున్నట్లు రికార్డుల్లో చూపించుకుంటోంది.


మాజీ సైనికాధికారులకు ఎలాగో జీతాలు ఇవ్వాల్సిందే. కానీ వాటిని ఉక్రెయిన్ యుద్ధంలో ఇచ్చినట్లు రికార్డుల్లో రాసుకుని ఎక్కువ మొత్తంలో సాయం చేసినట్లు ప్రపంచ దేశాల ముందు ఉంచుతోంది. ఉక్రెయిన్ కు సరైన ఆయుధాలు, యుద్ధ విమానాలు లేక ఆ దేశ సైనికులు ప్రస్తుతం పిట్టల్లా రాలిపోతున్నారు. అడవుల్లోకి వెళ్లి దాక్కుంటున్నారు. బంకర్లలో తలదాచుకుంటున్న వైనం.


అయినా అమెరికా సరైన ఆయుధాలను పంపడం లేదు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రారంభానికి ముందు ఉక్రెయిన్ కు అన్ని విధాలా సాయం అందిస్తామని, అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది. కానీ ఎక్కడా అది జరగడం లేదు. దీంతో ఉక్రెయిన్ పై నలు మూలల నుంచి రష్యా ఎటాక్ చేస్తోంది. దీని వల్ల ఉక్రెయిన్ సైనికులు ఎంతలా పోరాడాలి అనుకున్న వారికి సరైన ఆయుధాలు లేక చతికిలబడిపోతున్నారు. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఒక గుణపాఠం మాత్రం నేర్చుకోవచ్చు. ఏ దేశంతోనైనా యుద్ధంలోకి దిగితే మాకు అమెరికా, సాయం చేస్తుంది. మాకు ఆ దేశం అండగా ఉంటుందనే ఇలాంటి మాటల్ని నమ్మొద్దని మాత్రం తెలిసొచ్చింది.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ 30 వ మూవీ విషయంలో ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంట..!

ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

బ్లాక్‌ హోల్స్‌.. ఈ డార్క్‌ సీక్రెట్‌ కనిపెడతారా?

పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>