Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavib615b339-d46d-4035-a2c1-d0108bf8a982-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavib615b339-d46d-4035-a2c1-d0108bf8a982-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయమైన తర్వాత అందాల ఆరబోత చేస్తేనే అవకాశాలు వస్తాయి అనే భావన ఎంతోమందిలో ఇప్పటికీ ఉంది. అయితే అందాల ఆరబోత చేయడం ఎందుకు టాలెంట్ ఉంటే సరిపోతుంది అని కొంతమంది హీరోయిన్లు మాత్రం నిరూపించారు అని చెప్పాలి. అందరిలాగా చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోకుండా కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగిన వారు కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో సాయి పల్లవి పేరే ముందుగా వినిపిస్తూ ఉంటుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో ప్రేక్షకులSai pallavi{#}bhavana;sekhar;Telangana;Fidaa;BEAUTY;Event;Sai Pallavi;Makeup;Audience;Heroine;Cinemaఅందుకే మేకప్ వేసుకోను.. షాకింగ్ నిజం చెప్పిన సాయిపల్లవి?అందుకే మేకప్ వేసుకోను.. షాకింగ్ నిజం చెప్పిన సాయిపల్లవి?Sai pallavi{#}bhavana;sekhar;Telangana;Fidaa;BEAUTY;Event;Sai Pallavi;Makeup;Audience;Heroine;CinemaMon, 03 Apr 2023 07:40:00 GMTసాధారణంగా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయమైన తర్వాత అందాల ఆరబోత చేస్తేనే అవకాశాలు వస్తాయి అనే భావన ఎంతోమందిలో ఇప్పటికీ ఉంది. అయితే అందాల ఆరబోత చేయడం ఎందుకు టాలెంట్ ఉంటే సరిపోతుంది అని కొంతమంది హీరోయిన్లు మాత్రం నిరూపించారు అని చెప్పాలి. అందరిలాగా చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోకుండా కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగిన వారు కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో సాయి పల్లవి పేరే ముందుగా వినిపిస్తూ ఉంటుంది.


 శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో ప్రేక్షకుల కు హీరోయిన్ గా పరిచయమైన సాయి పల్లవి మొదటి సినిమాతోనే అందరిని ఫిదా చేసేసింది. తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి అందరి మదికి చేరువైంది ఈ హీరోయిన్. ఇక ఆ తర్వాత కూడా ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను చేసి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఏదైనా వైవిద్యమైన క్యారెక్టర్ ఉంది అంటే చాలు దర్శక నిర్మాతలు అందరికి కూడా సాయి పల్లవి మొదటి ఆప్షన్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి.


 అంతేకాదు సినిమాల్లో అందరిలాగా ఎక్కువగా మేకప్ వేసుకోకుండా ఎంతో న్యాచురల్ గా కనిపిస్తూ ఉంటుంది. అందుకే సాయి పల్లవిని నాచురల్ బ్యూటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే సినిమాల్లో మేకప్ లేకుండా సాయి పల్లవి ఎందుకు నటిస్తుంది అన్న విషయంపై ఇటీవల క్లారిటీ ఇచ్చింది. ముంబైలో ఒక ఈవెంట్ లో మాట్లాడింది సాయి పల్లవి. నేను ఇన్ సెక్యూర్ గా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే నా వాయిస్ అంతగా బాగోదు. మొహంపై కూడా మొటిమలు ఎక్కువగా ఉండడంతో అవి భయపెట్టేది. ఇక నా మొదటి సినిమా ప్రేమలో మేకప్ లేకుండానే నటించాను. ఇక సమయంలో ప్రేక్షకులు నన్ను ఇష్టపడ్డారు. ఇక అది నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అప్పటినుంచి మేకప్ లేకుండానే నటిస్తున్నాను. డైరెక్టర్లు కూడా ఈ విషయంలో నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది.



RRR Telugu Movie Review Rating

మంత్రి మల్లన్న రచ్చ.. మామూలుగా లేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>