PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chandrababu-modi-jagan07a2dc8e-ece1-42db-a55a-cb7b5bf37356-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chandrababu-modi-jagan07a2dc8e-ece1-42db-a55a-cb7b5bf37356-415x250-IndiaHerald.jpgఒకవైపేమో తనపైన ఉన్న కేసుల భయంతోనే జగన్మోహన్ రెడ్డి నరేంద్రమోడీకి వ్యతిరేకంగా నడుచుకోలేకపోతున్నట్లు రాస్తూనే చంద్రబాబు ఎందుకు ఎదిరించలేకపోతున్నారో చెప్పేశారు. ఎంతసేపు జగన్ను నెగిటివ్ గా ప్రొజెక్టు చేయటమే టార్గెట్ గా పెట్టుకున్న ఎల్లోమీడియా ఈసారి తొందరపాటులో చంద్రబాబు నైజాన్ని, భయాన్ని కూడా బయటపడేసింది. అసలిదంతా ఎందుకు వచ్చిందటే కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు చేసిన ప్రకటన కారణంగా. tdp chandrababu modi jagan{#}Mohandas Karamchand Gandhi;Chakram;CBN;TDP;Jagan;Narendra Modi;Reddy;media;sunday;Congressఅమరావతి : చంద్రబాబు పరువు తీసేసిన ఎల్లోమీడియాఅమరావతి : చంద్రబాబు పరువు తీసేసిన ఎల్లోమీడియాtdp chandrababu modi jagan{#}Mohandas Karamchand Gandhi;Chakram;CBN;TDP;Jagan;Narendra Modi;Reddy;media;sunday;CongressMon, 03 Apr 2023 03:00:00 GMT


ఉండి ఉండి ఎల్లోమీడియా చంద్రబాబునాయుడు పరువు తీసేస్తోంది. కొ(చె)త్తపలుకు పేరుతో ఎల్లోమీడియాలో ప్రతి ఆదివారం  అచ్చవుతున్న ఆర్టికల్లో ఈసారి చంద్రబాబు ధైర్యమేంటో చెప్పేసింది. వచ్చేఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోతే తన రాజకీయ జీవితం ముగిసిపోతుందని చంద్రబాబు భయపడుతున్నారట. ఓడిపోతే తన రాజకీయ జీవితంతో పాటు టీడీపీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్ధకమైపోతుందని ఆందోళనపడుతున్నారట. ఈ కారణంతోనే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని ఎదురించలేకపోతున్నట్లు చెప్పారు.





ఒకవైపేమో తనపైన ఉన్న కేసుల భయంతోనే జగన్మోహన్ రెడ్డి నరేంద్రమోడీకి వ్యతిరేకంగా నడుచుకోలేకపోతున్నట్లు రాస్తూనే చంద్రబాబు ఎందుకు ఎదిరించలేకపోతున్నారో చెప్పేశారు. ఎంతసేపు జగన్ను నెగిటివ్ గా ప్రొజెక్టు చేయటమే టార్గెట్ గా పెట్టుకున్న ఎల్లోమీడియా ఈసారి తొందరపాటులో చంద్రబాబు నైజాన్ని, భయాన్ని కూడా బయటపడేసింది. అసలిదంతా ఎందుకు వచ్చిందటే కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు చేసిన ప్రకటన కారణంగా.





రెండురోజుల క్రితం కేవీపీ మాట్లాడుతు రాహూల్ గాంధీ ఎంపీ పదవిపై అనర్హత వేటు వేస్తే ఏపీలోని ఒక్క రాజకీయ నేత కూడా మాట్లాడకపోవటం దారుణమన్నారు. జగన్ స్పందించలేదంటే ఏదో సమస్యలున్నాయని అనుకోవచ్చు కానీ చంద్రబాబుకు ఏమైంది ? అని కేవీపీ నిలదీశారు. జాతీయస్ధాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు ఉండాల్సింది రాష్ట్రంలో కాదు ఢిల్లీలో అని కేవీపీ అన్నారు. దాని ఆధారంగానే ఎల్లోమీడియాలో చెత్తపలుకు దర్శనమిచ్చింది.





ఇక్కడ విషయం ఏమిటంటే చంద్రబాబు ఏరోజూ ధైర్యవంతుడు కాదు. ప్రత్యర్ధుల బలహీనతనే తన ధైర్యంగా చంద్రబాబు మార్చుకుంటారంతే. పైగా మెజారిటి మీడియా చేతిలో ఉంది కాబట్టి తన చేతికి మట్టి అంటకుండా అనుకున్నపని అనుకున్నట్లు చేసుకుపోయేవారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రత్యర్ధులతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని చాణుక్యుడని, చక్రం తిప్పేస్తాడని టముకువేయించుకున్నారు. మొదటిసారి జగన్ రూపంలో చంద్రబాబుకు కొరకరాని కొయ్య ఎదురైంది. చంద్రబాబు మాయలను, ఎల్లోమీడియా దాడులను తట్టుకుని అందరినీ ఒక్కదెబ్బకు నేలకూల్చేశారు జగన్.  దాంతో చక్రాలు తిరగటంలేదు, చాణుక్యుడు పలకటంలేదు. ఇందుకనే జగన్ లాంటి వాడిని తన రాజకీయజీవితంలో ఇంతవరకు చూడలేదని చంద్రబాబు పదేపదే చెబుతున్నది.






RRR Telugu Movie Review Rating

అమరావతి : చంద్రబాబు క్రాస్ ఓటింగ్ ఎంఎల్ఏకి షాకిచ్చారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>