MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nbk10895ea357f-bd82-4a40-9f64-ab78a904d9b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nbk10895ea357f-bd82-4a40-9f64-ab78a904d9b1-415x250-IndiaHerald.jpgఇటీవల వీర సింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 'NBK 108' అనే వర్కింగ్ టైటిల్ తో గత కొద్దిరోజులుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. సైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ధి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. యంగ్ హీరోయిన్ శ్రీ లీల ఓ కీలకపాత్రలో కనిపించనుంది. పక్కా తెలంగాణ నేపథ్యంలో భారీ కమర్షియల్ యాక్NBK108{#}anil music;thaman s;Episode;October;anil ravipudi;Dussehra;Balakrishna;kajal aggarwal;Telangana;Comedy;Vijayadashami;Cinema;News;HeroineNBK108: కాళీమాత భక్తుడిగా బాలయ్య.. ఫ్యాన్స్ కి పూనకలు గ్యారెంటీ..!!NBK108: కాళీమాత భక్తుడిగా బాలయ్య.. ఫ్యాన్స్ కి పూనకలు గ్యారెంటీ..!!NBK108{#}anil music;thaman s;Episode;October;anil ravipudi;Dussehra;Balakrishna;kajal aggarwal;Telangana;Comedy;Vijayadashami;Cinema;News;HeroineMon, 03 Apr 2023 15:45:00 GMTఇటీవల వీర సింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 'NBK 108' అనే వర్కింగ్ టైటిల్ తో గత కొద్దిరోజులుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. సైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ధి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. యంగ్ హీరోయిన్ శ్రీ లీల ఓ కీలకపాత్రలో కనిపించనుంది. పక్కా తెలంగాణ నేపథ్యంలో భారీ కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది. మునుపెన్నడు కనిపించని విధంగా సఈ సినిమాలో బాలయ్య పాత్ర ఉండబోతోంది. 

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలిం సర్కిల్స్లో చెక్కర్లు కొడుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య కాళీమాత భక్తుడిగా కనిపించబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో కాళీమాత దేవాలయంలో వచ్చే ఓ సీక్వెన్స్ కూడా ఉంటుందని సినిమా మొత్తంలో ఆ సీక్వెన్స్ చాలా బాగుంటుందనే టాక్ వినిపిస్తోంది.ఇక సినిమాలో బాలయ్య తెలంగాణ మాండలికంలో కొన్ని డైలాగ్స్ కూడా చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. సినిమాలో ఆయన రోల్ మాత్రం చాలా పవర్ ఫుల్ గా.. ఇప్పటివరకు ఫ్యాన్స్ చూడని విధంగా ఉంటుందని సమాచారం.

సినిమాలో యాక్షన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అలాగే కామెడీ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉండేలా ఈ మూవీ స్క్రిప్ట్ ని అనిల్ రావిపూడి ప్లాన్ చేసుకున్నాడట. ఇక సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా చాలా వైల్డ్ గా ఉంటుందట. మొత్తం మీద అనిల్ రాయపూడి బాలయ్య కలయికలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ అంచనాలను పెంచగా... తాజా అప్డేట్ తో ఈ అంచనాలు కాస్త రెట్టింపు అయ్యాయనే చెప్పాలి.ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా.. సి రాంప్రసాద్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20 న ఈ సినిమా విడుదల కానునట్లు తాజాగా మూవీ టీం అఫీషియల్ గా ప్రకటించింది...!!



RRR Telugu Movie Review Rating

'ఆర్ ఆర్ ఆర్' ను చూసి హాలీవుడ్ డైరెక్టర్లు నేర్చుకోవాలి: బ్రిటన్ నటుడు జేమీ హ్యారీస్

కర్ణాటక ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కీలక పాత్ర?

మంత్రి కొప్పుల.. ఆ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారా?

దసరా సినిమాలో ఆ సీన్‌ తొలగించాల్సిందే?

రష్యా దూకుడుతో.. వణుకుతున్న పోలండ్‌?

కిమ్‌ అరాచకం.. బుల్లెట్ల కోసం లాక్‌డౌన్?

ఆసియాలో మరో కొత్త సైనిక కూటమి?

గ్రేట్‌: బ్రిటన్‌ను పరిపాలిస్తున్న భారత్‌, పాక్‌?

ఆ విషయంలో జగన్‌కు కేంద్రం షాక్‌ ఇచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>