EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ware06462b2-8b17-4a20-b8db-f37ac60af1e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ware06462b2-8b17-4a20-b8db-f37ac60af1e5-415x250-IndiaHerald.jpgనాటో భాగస్వామిగా ఉన్న దేశం పోలాండ్. ఉక్రెయిన్ దేశం తర్వాత రష్యా ఎటాక్ అనేది పోలండ్ పైనే ఉంటుందనేది ఆ దేశం అనుమానిస్తుంది. నాటో దళాల తరఫున ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇస్తే నాటోనే రష్యాపై దాడి చేసిందని భావిస్తామని పుతిన్ గతంలోనే హెచ్చరించారు. కానీ పోలండ్ రష్యాను చూసి భయపడుతోంది. ఉక్రెయిన్ పై యుద్దం అనంతరం పోలండ్ ను ఆక్రమించుకునేందుకు రష్యా ప్రయత్నిస్తుందని ఆరోపిస్తుంది. ఉక్రెయిన్ కు యుద్ద విమానాలు, యుద్ధ నౌకలు ఇస్తామని గతంలో పోలండ్ చెప్పింది. జర్మనీ, అమెరికా లెపార్టు టు ట్యాంకులు, ఇతర యుద్ధ ట్యాంకులనwar{#}Ukraine;Russia;war;American Samoaరష్యా దూకుడుతో.. వణుకుతున్న పోలండ్‌?రష్యా దూకుడుతో.. వణుకుతున్న పోలండ్‌?war{#}Ukraine;Russia;war;American SamoaMon, 03 Apr 2023 09:00:00 GMTనాటో భాగస్వామిగా ఉన్న దేశం పోలాండ్. ఉక్రెయిన్ దేశం తర్వాత రష్యా ఎటాక్ అనేది పోలండ్ పైనే ఉంటుందనేది ఆ దేశం అనుమానిస్తుంది. నాటో దళాల తరఫున ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇస్తే నాటోనే రష్యాపై దాడి చేసిందని భావిస్తామని పుతిన్ గతంలోనే హెచ్చరించారు. కానీ పోలండ్ రష్యాను చూసి భయపడుతోంది. ఉక్రెయిన్ పై యుద్దం అనంతరం పోలండ్ ను ఆక్రమించుకునేందుకు రష్యా ప్రయత్నిస్తుందని ఆరోపిస్తుంది. ఉక్రెయిన్ కు యుద్ద విమానాలు, యుద్ధ నౌకలు ఇస్తామని గతంలో పోలండ్ చెప్పింది.


జర్మనీ, అమెరికా  లెపార్టు టు ట్యాంకులు, ఇతర యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ కు ఇచ్చాయి.  చాలెంజ్ ట్యాంకులు, మిగ్ యుద్ధ విమానాలు ఇస్తానని ఉక్రెయిన్ కు పోలండ్ హామీ ఇచ్చింది. కానీ రష్యా చేసిన హెచ్చరికలకు భయపడి వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. రష్యా చేస్తున్న హెచ్చరికలకు సంబంధించి పోలండ్ వాటిని ఇచ్చేందుకు భయపడుతోంది.  అయినా వాటిని రహస్యంగా అందజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రష్యా, ఉక్రెయిన్ యుద్దం ముగిసిన తర్వాత పోలండ్ నే రష్యా టార్గెట్ చేసుకుంటుందని అక్కడి అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి.  


ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాల్లోని ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నామవుతుంటే యుద్ధం ఇంకా కొనసాగుతూ ఉండటం అనేది రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయనడంలో సందేహం లేదు.  ఉక్రెయిన్ పై దాడి అనంతరం పోలండ్ పై ఎటాక్ చేస్తే నాటో దేశాలు అడ్డుకుంటాయా.. లేకపోతే ఆ దేశ పరిస్థితి ఏంటి..?మరో ఉక్రెయిన్ లా మారాల్సిందేనా.. అనే చర్చ కొనసాగుతోంది. అందుకే అదేదో యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ముందుగానే ఇచ్చేస్తే అయిపోతుంది కదా పోలండ్ భావిస్తోంది.


ఒక వేళ ఉక్రెయిన్ ను పూర్తిగా ఆక్రమిస్తే రాబోయే రోజుల్లో పోలండ్ పై కూడా యుద్ధానికి దిగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి పోలండ్  ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళుతుందో.. ఎవరిపై దాడి కొనసాగిస్తుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

మంత్రి మల్లన్న రచ్చ.. మామూలుగా లేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>