Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/veedu-director-enti-anukunna-26204e1e-24b1-418e-b4d9-52a0a79578f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/veedu-director-enti-anukunna-26204e1e-24b1-418e-b4d9-52a0a79578f3-415x250-IndiaHerald.jpgచిన్న సినిమాగా వచ్చి ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించింది బలగం సినిమా . జబర్దస్త్ కమెడియన్ గా అందరికీ తెలిసిన వేణు ఇక ఇప్పుడు బలగం డైరెక్టర్ వేణుగా మారిపోయాడు. అతనిలో ఇంత టాలెంట్ ఉంది అన్న విషయం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి. తెలంగాణ సాంప్రదాయాలను కట్టుబాట్లను ఇక మనుషుల మధ్య ఉండే బంధాలను బంధుత్వాలను కళ్లకు కట్టినట్లుగా చూపించి ప్రతి ఒక్కరిని కూడా ఏడిపించేసాడు వేణు. అయితే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వేణు మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని ఇక ఎప్పుడVenu{#}Telangana;Muralidhar Rao;Jabardasth;king;Darsakudu;Venu Thottempudi;Yevaru;CBN;producer;Producer;Audience;Director;Tollywood;Cinemaవీడు డైరెక్టర్ ఏంటి అనుకున్నా.. బలగం ఆర్టిస్ట్ కామెంట్?వీడు డైరెక్టర్ ఏంటి అనుకున్నా.. బలగం ఆర్టిస్ట్ కామెంట్?Venu{#}Telangana;Muralidhar Rao;Jabardasth;king;Darsakudu;Venu Thottempudi;Yevaru;CBN;producer;Producer;Audience;Director;Tollywood;CinemaMon, 03 Apr 2023 07:50:00 GMTచిన్న సినిమాగా వచ్చి ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించింది బలగం సినిమా . జబర్దస్త్ కమెడియన్ గా అందరికీ తెలిసిన వేణు ఇక ఇప్పుడు బలగం డైరెక్టర్ వేణుగా మారిపోయాడు. అతనిలో ఇంత టాలెంట్ ఉంది అన్న విషయం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి. తెలంగాణ సాంప్రదాయాలను కట్టుబాట్లను ఇక మనుషుల మధ్య ఉండే బంధాలను బంధుత్వాలను కళ్లకు కట్టినట్లుగా చూపించి ప్రతి ఒక్కరిని కూడా ఏడిపించేసాడు వేణు. అయితే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వేణు మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని ఇక ఎప్పుడూ ఇక నిర్మాతకు భారీగా లాభాలు వచ్చేలా చేశాడు అని చెప్పాలి.


 సాధారణంగా అయితే ఒక సినిమా ఓటీటిలో రిలీజ్ అయిన తర్వాత థియేటర్కు వెళ్లి చూడటానికి ఎవరు పెద్దగా ఇష్టపడరు. కానీ బలగం సినిమా ఓటీటిలో రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా థియేటర్లకు ప్రేక్షకులు బారులు తీరుతున్నారు అంటే ఈ సినిమా ప్రేక్షకుడి మదిని ఎంత ఇలా మెలి పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో కొమురయ్య అల్లుడు క్యారెక్టర్ చేసిన మురళీధర్ ఇటీవల దర్శకుడు వేణు గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. వేణు ముందుగా వచ్చి మురళీధరను పాత్ర కోసం అడిగితే ఇతను డైరెక్టర్ ఏంటి అని కాసేపు ఆలోచించుకున్నారట.



 ఇతని సినిమాలో నటిస్తే కెరియర్ ఏమైనా పాడవుతుందా అని అనుకున్నారట మురళీధర్. ఈ విషయాన్ని ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు అని చెప్పాలి. మొదట్లో వేణు వచ్చి సినిమా కథ వినిపించినప్పుడు ఈయన డైరెక్టర్ ఏంట్రా బాబు అని అనుకున్నాను. అయితే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో నమ్మకం ఉంటేనే సపోర్ట్ చేస్తారు. అందుకే ఇక ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. కానీ తర్వాత వేణు కి డైరెక్షన్ లో ఉన్న పట్టు గురించి తెలిసి షాక్ అయ్యాను. సినిమాలో కొమురయ్య చనిపోయినప్పుడు ప్రతి ఒక్కరు ఏడుస్తారు. కానీ నా పాత్ర మాత్రం కన్నీళ్లు పెట్టుకోదు. నన్ను ఎందుకు ఏడవద్దు అని చెబుతున్నావ్ అని అడిగితే.. మీ శరీరంలో బాధ ఉంటుంది. మొహంలో బాధ ఉంటుంది. మీ కళ్ళల్లో బాధ ఉంటుంది. కానీ మీ కళ్ళ నుంచి కన్నీళ్లు రావు. అని నా పాత్ర గురించి చెప్పగానే వేణు ప్రతిభ గురించి తెలిసి షాక్ అయ్యా అంటూ మురళీధర్ చెప్పుకొచ్చాడు.
">



RRR Telugu Movie Review Rating

మంత్రి మల్లన్న రచ్చ.. మామూలుగా లేదుగా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>