MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jagannath-and-chiru1e9a372d-2317-41cf-b5fb-48c72e1e7a90-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jagannath-and-chiru1e9a372d-2317-41cf-b5fb-48c72e1e7a90-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో సినిమా గురించి అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. అప్పుడెప్పుడో ఆటో జానీ అనే సినిమాను వీరి కాంబినేషన్లో అనౌన్స్ చేసి ఆ తర్వాత వివిధ కారణాలవల్ల సినిమాను ఆపేశారు. ఆ తర్వాత దాని గురించి చాలా రోజుల వరకు చర్చ నడిచింది. అయితే ఇప్పుడు వాటన్నిటినీ పక్కనపెట్టి మెగాస్టార్ కోసం సరికొత్త కథను రాస్తున్నానంటూ ఆ మధ్య పూరి జగన్నాథ్ స్వయంగా చెప్పడంతో.. ఆ కొత్త కథ ఏమిటి? ఆ కథ ఎలా ఉండొచ్చు? అనే చర్చలు కూడా మొదలయ్యాయPuri Jagannath And Chiru{#}johnny;Johnny;puri jagannadh;Fidaa;God Father;Remake;Chiranjeevi;vijay deverakonda;Ram Charan Teja;News;Cinema;Directorమెగాస్టార్ కోసం కథ రెడీ చేసిన పూరీ జగన్నాథ్.. ఈసారైనా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?మెగాస్టార్ కోసం కథ రెడీ చేసిన పూరీ జగన్నాథ్.. ఈసారైనా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?Puri Jagannath And Chiru{#}johnny;Johnny;puri jagannadh;Fidaa;God Father;Remake;Chiranjeevi;vijay deverakonda;Ram Charan Teja;News;Cinema;DirectorMon, 03 Apr 2023 20:15:00 GMTటాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో సినిమా గురించి అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. అప్పుడెప్పుడో ఆటో జానీ అనే సినిమాను వీరి కాంబినేషన్లో అనౌన్స్ చేసి ఆ తర్వాత వివిధ కారణాలవల్ల సినిమాను ఆపేశారు. ఆ తర్వాత దాని గురించి చాలా రోజుల వరకు చర్చ నడిచింది. అయితే ఇప్పుడు వాటన్నిటినీ పక్కనపెట్టి మెగాస్టార్ కోసం సరికొత్త కథను రాస్తున్నానంటూ ఆ మధ్య పూరి జగన్నాథ్ స్వయంగా చెప్పడంతో.. ఆ కొత్త కథ ఏమిటి? ఆ కథ ఎలా ఉండొచ్చు? అనే చర్చలు కూడా మొదలయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం చిరు కోసం పూరి రాస్తున్న కథ చివరి దశకు వచ్చిందని అంటున్నారు. 

ఇటీవల విజయ్ దేవరకొండ తో లైగర్ అనే సినిమా చేసి భారీ డిజాస్టర్ తో పాటు భారీ నష్టాలను కూడా ఎదుర్కొని చాలా ఇబ్బందులు పడ్డాడు పూరి జగన్నాథ్. ఆర్థికంగా కూడా చాలా డౌన్ అయిపోయాడు. సరిగ్గా అదే సమయంలో చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించి ఆకట్టుకున్నాడు. అదే సమయంలో ఏకంగా మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. మొదటిసారి ఛాన్స్ పోగొట్టుకున్న పూరి జగన్నాథ్ ఈసారి మాత్రం చాలా స్ట్రాంగ్ గా కథ రాసుకుంటున్నాడట. చిరంజీవి కోసం మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న కథను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే చిరంజీవికి ఈ కథను వినిపించబోతున్నాడట.

ఇక ఇది ఒక ఎమోషనల్ యాక్షన్ స్టోరీ అని.. తండ్రి, కొడుకుల మధ్య సాగే ఈ కథలో ఓ థ్రిల్లింగ్ పాయింట్ కూడా ఉంటుందని.. ఈ సినిమాలో ఎమోషన్ ఉన్నా మెయిన్ గా కామెడీనే హైలెట్ అవుతుందని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఇదేదో రీమేక్ మూవీ లాగా అనిపిస్తోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల మలయాళం లో మంచి విజయం అందుకున్న 'బ్రో డాడీ' సినిమా రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ స్వయంగా కొనుగోలు చేశారు. దీంతో ఆ సినిమానే మెగాస్టార్ తో పూరి జగన్నాథ్ స్టైల్ లో తీయబోతున్నారా? అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనిపై త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి పూరి వినిపించబోయే కథకి మెగాస్టార్ కనుక ఫిదా అయితే ఈ కాంబినేషన్లో సినిమా కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కోరిక నెరవేరినట్లే...!!



RRR Telugu Movie Review Rating

బ్లాక్ దుస్తులలో అందాలతో మైమరిపిస్తున్న హెబ్బా పటేల్..!!

కర్ణాటక ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కీలక పాత్ర?

మంత్రి కొప్పుల.. ఆ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారా?

దసరా సినిమాలో ఆ సీన్‌ తొలగించాల్సిందే?

రష్యా దూకుడుతో.. వణుకుతున్న పోలండ్‌?

కిమ్‌ అరాచకం.. బుల్లెట్ల కోసం లాక్‌డౌన్?

ఆసియాలో మరో కొత్త సైనిక కూటమి?

గ్రేట్‌: బ్రిటన్‌ను పరిపాలిస్తున్న భారత్‌, పాక్‌?

ఆ విషయంలో జగన్‌కు కేంద్రం షాక్‌ ఇచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>