MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ss-rajamoulia50c5039-abb0-44ff-9b75-7f6811737ac9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ss-rajamoulia50c5039-abb0-44ff-9b75-7f6811737ac9-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా నాని 'దసరా' సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ అగ్ర హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ దసరా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులో లో దర్శక దిగిజం ఎస్ ఎస్ రాజమౌళి కూడా చేరిపోయారు. తాజాగా దసరా సినిమాను వీక్షించిన రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి స్పందించారు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో 'ఈగ' అనే సినిమాలో నటించాడు నాచురల్ స్టార్ నాని. ఇక ఇప్పుడు నాని నటించిన దసరా సినిమాను చూసిన రాజమౌళిSS Rajamouli{#}krishnam raju;Heart;Research and Analysis Wing;Tollywood;Prabhas;Love Story;March;Rajani kanth;Varsham;Rajamouli;keerthi suresh;Audience;Nani;Dussehra;Vijayadashami;media;Darsakudu;Cinema;Director;India'దసరా' సినిమాపై స్పందించిన రాజమౌళి.. ఏమన్నాడంటే..?'దసరా' సినిమాపై స్పందించిన రాజమౌళి.. ఏమన్నాడంటే..?SS Rajamouli{#}krishnam raju;Heart;Research and Analysis Wing;Tollywood;Prabhas;Love Story;March;Rajani kanth;Varsham;Rajamouli;keerthi suresh;Audience;Nani;Dussehra;Vijayadashami;media;Darsakudu;Cinema;Director;IndiaMon, 03 Apr 2023 19:55:25 GMTప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా నాని 'దసరా' సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ అగ్ర హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ దసరా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులో లో దర్శక దిగిజం ఎస్ ఎస్ రాజమౌళి కూడా చేరిపోయారు. తాజాగా దసరా సినిమాను వీక్షించిన రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి స్పందించారు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో 'ఈగ' అనే సినిమాలో నటించాడు నాచురల్ స్టార్ నాని. ఇక ఇప్పుడు నాని నటించిన దసరా సినిమాను చూసిన రాజమౌళి సినిమా గురించి మాట్లాడుతూ..

" దసరా సినిమాలో హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఉంది. రా క్యారెక్టర్లు, రగ్డ్ లాండ్స్ కేప్ అన్ని ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఎంతో బాగా చూపించారు. నాని కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమా. కీర్తి సురేష్ తనదైన పాత్రలో ఒదిగిపోయింది. సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటుడు అద్భుతమైన నటనను కనపరిచారు. ఇక ముఖ్యంగా సినిమా ఫోటోగ్రాఫీ అయితే ఫస్ట్ క్లాస్ గా ఉంది. అన్నింటికంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. దసరా చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అంటూ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా దసరా సినిమా గురించి తనదైన శైలిలో స్పందించారు.

ఇక రాజమౌళి పెట్టిన ఈ పోస్టులకు నాని ప్రతిస్పందిస్తూ మీరు మా సినిమాను చూసి ఫీడ్ బ్యాక్ ఇవ్వడం జీవితంలోనే మర్చిపోలేని అనుభూతి అని అన్నాడు. దీంతో ప్రస్తుతం రాజమౌళి పెట్టిన ఈ పోస్టులు  ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇక మరోవైపు మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన దసరా సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్  క్రాస్ చేసి 100 కోట్ల క్లబ్ కి చేరువులో ఉంది. నాచురల్ స్టార్ నాని కెరియర్ లోని హైయెస్ట్ గ్రాఫర్ గా దసరా సినిమా నిలిచింది. సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ ని సైతం ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటుంది.ఇక ఓవర్సీస్ లో సైతం ఈ సినిమా భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది.మరి ముందు ముందు కలెక్షన్స్ విషయంలో ఈ సినిమా ఇంకెలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి...!!



RRR Telugu Movie Review Rating

బ్లాక్ దుస్తులలో అందాలతో మైమరిపిస్తున్న హెబ్బా పటేల్..!!

కర్ణాటక ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కీలక పాత్ర?

మంత్రి కొప్పుల.. ఆ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారా?

దసరా సినిమాలో ఆ సీన్‌ తొలగించాల్సిందే?

రష్యా దూకుడుతో.. వణుకుతున్న పోలండ్‌?

కిమ్‌ అరాచకం.. బుల్లెట్ల కోసం లాక్‌డౌన్?

ఆసియాలో మరో కొత్త సైనిక కూటమి?

గ్రేట్‌: బ్రిటన్‌ను పరిపాలిస్తున్న భారత్‌, పాక్‌?

ఆ విషయంలో జగన్‌కు కేంద్రం షాక్‌ ఇచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>