EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan2b8924d9-3e34-4622-929c-b2887485859a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan2b8924d9-3e34-4622-929c-b2887485859a-415x250-IndiaHerald.jpgరాజకీయాన్ని ఎప్పుడు రాజకీయంలాగే చేయాలి. బుజ్జగింపులు, మందలింపులు, బెదిరింపులు ఇలాగా. రాజకీయం ముక్కుసూటిగా నిర్మొహమాటంగా చేస్తే ఎలా ఉంటుందో జగన్ ని చూస్తే అర్థమవుతుంది. తను అభ్యర్థులు ఎంపిక విషయంలో కొన్నిసార్లు అన్ని నియోజకవర్గాలకి ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. పాదయాత్ర అయినా, సోనియాతో విభేదాలు అయినా అదే మొండితనంతో ఉన్నారు. పార్టీ పెట్టడంలోనైనా అదే మొండితనంతో మొదలుపెట్టారు. తాను జైల్లో ఉండి కూడా పార్టీని ఏర్పాటు చేయడం అదొక మొండితనం. ఒకేసారి సచివాలయాలు ఏర్పాటు చేయడం కూడా మొండితనమే. ఒక విధానానJAGAN{#}CBN;Party;Jaganజగన్‌ తెగింపు.. వైసీపీకి లాభమా.. నష్టమా?జగన్‌ తెగింపు.. వైసీపీకి లాభమా.. నష్టమా?JAGAN{#}CBN;Party;JaganSun, 02 Apr 2023 10:00:00 GMTరాజకీయాన్ని ఎప్పుడు రాజకీయంలాగే చేయాలి. బుజ్జగింపులు, మందలింపులు, బెదిరింపులు ఇలాగా. రాజకీయం ముక్కుసూటిగా నిర్మొహమాటంగా చేస్తే ఎలా ఉంటుందో జగన్ ని చూస్తే అర్థమవుతుంది. తను అభ్యర్థులు ఎంపిక విషయంలో కొన్నిసార్లు అన్ని నియోజకవర్గాలకి ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. పాదయాత్ర అయినా, సోనియాతో విభేదాలు అయినా అదే మొండితనంతో ఉన్నారు. పార్టీ పెట్టడంలోనైనా అదే మొండితనంతో మొదలుపెట్టారు.


తాను జైల్లో ఉండి కూడా పార్టీని ఏర్పాటు చేయడం అదొక మొండితనం. ఒకేసారి సచివాలయాలు ఏర్పాటు చేయడం కూడా మొండితనమే. ఒక విధానాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకువచ్చే రైతు భరోసా కేంద్రం, నాడు నేడు ఇలా. ముందు ఒక బిల్డప్ తో తాను అనుకున్నది పదిమందికి చెప్పి వాళ్ళ నిర్ణయం తీసుకోవడం కాకుండా తాను నిర్ణయం తీసుకుని బాధ్యత అంతా నాదే అనుకోవడః జగన్ మోహన్ రెడ్డి పద్ధతి. చంద్రబాబు నాయుడు కి జగన్ కి ఉన్న తేడా ఇక్కడే.


చంద్రబాబు నాయుడు అయితే తాను అనుకున్న విషయాన్ని అందరితో కూర్చుని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ జగన్ అలా చేయకుండా బాధ్యత అంతా తాను ఒక్కడి మీద వేసుకుంటారు. అంతేకాకుండా తన పార్టీలోని ఉన్న వాళ్ళతో నీకు సీటు రాదు, ఇంకొకళ్ళని పెట్టుకోబోతున్నామని ముందుగా చెప్పడం గాని, పబ్లిక్ లో నీకు ఆదరణ తగ్గుతుంది సరిదిద్దుకోమని చెప్పడం గాని టైం ఇవ్వడం గాని ఇవేమీ రాజకీయ నాయకులకు నచ్చవు.


రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత తనకు తిరుగులేదు అనుకుంటాడు. తన నియోజకవర్గంలో చేసేటువంటి సంక్షేమ పథకాలతో తనకు తిరుగులేదు అనుకుంటాడు. అలాంటి సందర్భంలో జగన్ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అందుతున్నా కూడా నువ్వు గెలవలేవు ఎందుకంటే వారి దగ్గర నువ్వు పలుచన అయ్యావు అని చెప్తే, ఎవరో మీకు గిట్టని వాళ్ళు చెప్పారు అంటారు కానీ ఒప్పుకోరు. ఇప్పుడు జగన్ తెగింపు తప్పవుతుందా రాబోయే కాలంలో ఎదురు దెబ్బ అవుతుందా అనేది చూడాలి.



RRR Telugu Movie Review Rating

విజయ్ "లియో" మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ఆ తేదీ నుండి ప్రారంభం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>