Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/fhavanbf72b574-82f0-4d4f-8389-e1f9bd5fe915-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/fhavanbf72b574-82f0-4d4f-8389-e1f9bd5fe915-415x250-IndiaHerald.jpgభారత జట్టులో యువ ఆటగాళ్ల హవా పెరిగిపోవడంతో భారత క్రికెట్ లో సీనియర్ గా కొనసాగుతున్న శిఖర్ ధావన్ కు ఇక జట్టులో చోటు లేకుండా పోయింది అని చెప్పాలి. మొన్నటి వరకు వన్ డే ఫార్మాట్లో అవకాశం దక్కించుకున్న శిఖర్ ధావన్.. ఇక ఇప్పుడు వన్డే ఫార్మాట్లో కూడా కనిపించడం లేదు. దీంతో ఇక ఇప్పుడు ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణించి.. ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో చోటు సంపాదించుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు అని చెప్పాలి. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించడమే కాదుFhavan{#}murali;Zimbabwe;Yuva;Shikhar Dhawan;Punjab;World Cup;Cricket;Yevaru;sam;Sam Mendes;Samantha;Indianధావన్ కి మతిమరుపు.. అతని పేరునే మర్చిపోయాడుగా?ధావన్ కి మతిమరుపు.. అతని పేరునే మర్చిపోయాడుగా?Fhavan{#}murali;Zimbabwe;Yuva;Shikhar Dhawan;Punjab;World Cup;Cricket;Yevaru;sam;Sam Mendes;Samantha;IndianSun, 02 Apr 2023 13:15:00 GMTభారత జట్టులో యువ ఆటగాళ్ల హవా పెరిగిపోవడంతో భారత క్రికెట్ లో సీనియర్ గా కొనసాగుతున్న శిఖర్ ధావన్ కు ఇక జట్టులో చోటు లేకుండా పోయింది అని చెప్పాలి. మొన్నటి వరకు వన్ డే ఫార్మాట్లో అవకాశం దక్కించుకున్న శిఖర్ ధావన్.. ఇక ఇప్పుడు వన్డే ఫార్మాట్లో కూడా కనిపించడం లేదు. దీంతో ఇక ఇప్పుడు ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణించి.. ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో చోటు సంపాదించుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు అని చెప్పాలి.


 కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించడమే కాదు ఇక సారధ్య బాధ్యతలను కూడా భుజాన వేసుకొని ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇకపోతే ఇటీవల  ఐపీఎల్ లో భాగంగా తొలి మ్యాచ్ లోనే కోల్కతా పై ఇక జట్టుకు విజయాన్ని అందించాడు. ఒకవైపు వరుణుడి రూపంలో అదృష్టం కలిసి రావడంతో ఇక పంజాబ్ కింగ్స్ జట్టు డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విజయం సాధించింది అని చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ వేసే సమయంలో మాత్రం ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది అని చెప్పాలి.



 టాస్ వేసిన తర్వాత జట్టులో ఎవరు ఉన్నారు అనే విషయంపై సారధిగా ఉన్న ఆటగాడు మాట్లాడటం ఆనవాయితీ. ఈ క్రమంలోనే మురళి కార్తక్ ధావన్ ను తుది జట్టు గురించి వివరాలు అడిగాడు. అయితే శిఖర్ ధావన్ తుది జట్టు గురించి మాట్లాడుతూ విదేశీ ఆటగాళ్ల పేర్లు చెబుతున్న సమయంలో ముగ్గురు పేర్లు మాత్రమే చెప్పి ఒకరి పేరు మర్చిపోయాడు. బానుక రాజపక్స, నాథన్ ఎల్లిస్, సామ్ కరణ్ అంటూ ఆగిపోయాడు. నాలుగవ ఆటగాడి పేరు మర్చిపోయాను క్షమించండి అంటూ అని ఆన్సర్ చెప్పాడు. అయితే ఇలా శిఖర్ ధావన్ మరిచిపోయిన నాలుగవ ఆటగాడి పేరు జింబాబ్వే సంచలనం సికిందర్ రాజా. దీంతో ఇక శిఖర్ ధావన్ ను క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.. 37 ఏళ్లు వచ్చాయి. వయసు మీద పడింది. అందుకే మతిమరుపు వచ్చినట్టుంది అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

అదిరిపోయే లుక్ ఉన్న డ్రెస్ లో మైమరపిస్తున్న మృణాల్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>