PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawan-bjp-aaf0738e-0ef9-4624-8c35-4d59d5c73642-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawan-bjp-aaf0738e-0ef9-4624-8c35-4d59d5c73642-415x250-IndiaHerald.jpgసత్యకుమార్ ఏమిచెబితే దాన్ని పవన్ గుడ్డిగా ఫాలో అయిపోయారు. ఈ ఘటనను బీజేపీ నాయకత్వం తీవ్రంగా పరిగణించి దర్యాప్తు జరిపించాలట. రాజధాని రైతులకు మద్దతుగా నిలుస్తున్న రాజకీయపార్టీలను, ప్రజాసంఘాలను ప్రభుత్వం వర్గ శతృవులుగా చూస్తోందని పవన్ ఆరోపించారు. అసలు వర్గశతృవు అనే పదం పవన్ కు బాగా నచ్చినట్లుంది. అందుకనే జగన్ కు వ్యతిరేకంగా పదే పదే ఆ పదాన్ని వాడేస్తున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే గొడవ ఎలా మొదలైందో తెలీదు.janasena pawan bjp {#}Bharatiya Janata Party;Jagan;Nandigam Suresh;Amaravati;AdiNarayanaReddy;Capital;YCP;Janasena;Press;Government;Reddy;Pawan Kalyan;Sureshఅమరావతి : ఇంత అర్జంటుగా గొంతు లేచిందే ?అమరావతి : ఇంత అర్జంటుగా గొంతు లేచిందే ?janasena pawan bjp {#}Bharatiya Janata Party;Jagan;Nandigam Suresh;Amaravati;AdiNarayanaReddy;Capital;YCP;Janasena;Press;Government;Reddy;Pawan Kalyan;SureshSat, 01 Apr 2023 03:00:00 GMT



ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ గొంతు చాలా వేగంగా రెస్పాండవుతుంది. అదికూడా రీ సౌండు వినబడేట్లుగా. అదే ప్రతిపక్షాలది ఎక్కడైనా తప్పుంటే మాత్రం ఎన్నిరోజులైనా పవన్ గొంతు ఎక్కడా వినబడదు. అసలా ఘటన జరగలేదన్నట్లే వ్యవహరిస్తారు. ఇపుడిదంతా ఎందుకంటే అమరావతి ప్రాంతంలో దీక్ష చేస్తున్న అమరావతి జేఏసీ సభ్యులను పరామర్శించేందుకు సత్యకుమార్ వెళ్ళినపుడు దాడి జరిగిందట.





బీజేపీ జాతీయ కార్యదర్శి శిబిరం దగ్గరకు వెళ్ళగానే వైసీపీ మూకలు దాడులు చేశారంటు పవన్ రెచ్చిపోయారు. రాజధాని రైతులకు మద్దతుగా నిలిస్తే అధికారపార్టీ దాడులు చేయటం ఏమిటనేది పవన్ ప్రశ్న. రైతులకు మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తామనే సంకేతాన్ని సమాజానికి పంపుతున్నారా అంటు జగన్మోహన్ రెడ్డి మీద పవన్ రెచ్చిపోయారు. ఆదినారాయణరెడ్డి తప్పించుకున్నారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారని సత్యకుమార్ చెప్పిన మాటను కూడా పవన్ ప్రస్తావించారు. అంటే సురేష్ అన్నారో లేదో కూడా పవన్ కు తెలీదు.





సత్యకుమార్ ఏమిచెబితే దాన్ని పవన్ గుడ్డిగా ఫాలో అయిపోయారు. ఈ ఘటనను బీజేపీ నాయకత్వం తీవ్రంగా పరిగణించి దర్యాప్తు జరిపించాలట. రాజధాని రైతులకు మద్దతుగా నిలుస్తున్న రాజకీయపార్టీలను, ప్రజాసంఘాలను ప్రభుత్వం వర్గ శతృవులుగా చూస్తోందని పవన్ ఆరోపించారు. అసలు వర్గశతృవు అనే పదం పవన్ కు బాగా నచ్చినట్లుంది. అందుకనే జగన్ కు వ్యతిరేకంగా పదే పదే ఆ పదాన్ని వాడేస్తున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే గొడవ ఎలా మొదలైందో తెలీదు.






మూడు రాజధానులకు మద్దతుగా దీక్షలు చేస్తున్న వారిపై బీజేపీ కార్యకర్తలే దాడులు చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాదు కాదు సత్యకుమార్ పై వైసీపీ వాళ్ళే దాడులు చేశారని బీజేపీ+పవన్ అంటున్నారు. ఇందులో వాస్తవం ఏమిటో తెలీదు. మొత్తానికి ఘటన అలా జరిగిందో లేదో వెంటనే పవన్ ప్రెస్ రిలీజ్ తో ప్రత్యక్షమైపోయారు. అదే వైసీపీ ఎంఎల్ఏలను చంద్రబాబునాయుడు లోబరుచుకుని క్రాస్ ఓటింగ్ చేయించుకున్న విషయం మీద మాత్రం పవన్ నోరిప్పలేదు.






RRR Telugu Movie Review Rating

అమరావతి : జగన్ ఢిల్లీ టూర్ ఇందుకేనా ?

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>