PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu7fb71d43-ff2a-42b4-b1c1-ea557e0cf91a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu7fb71d43-ff2a-42b4-b1c1-ea557e0cf91a-415x250-IndiaHerald.jpgచివరగా టీడీపీకి మిగిలేది 110 నియోజకవర్గాలు మాత్రమే. ఇందులో సిట్టింగులు 19 మందిని తీసేస్తే మిగిలేది 91 సీట్లు. ఇప్పటికే చంద్రబాబు ఓ 20 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేశారు. అంటే మిగిలిన 71 సీట్లలో యువతకు 40 శాతం టికెట్లు కేటాయిస్తారా ? ఇది జరిగేపనికాదు. ఎందుకంటే చాలామంది సీనియర్లు పోటీకి రెడీ అయిపోతున్నారు. సో, ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు హామీ మీద అనుమానాలు పెరిగిపోతున్నాయి. tdp chandrababu {#}CBN;ATCHANNAIDU KINJARAPU;YCP;Kathanam;GEUMఅమరావతి : చంద్రబాబు మాట నిలబెట్టుకుంటారా ?అమరావతి : చంద్రబాబు మాట నిలబెట్టుకుంటారా ?tdp chandrababu {#}CBN;ATCHANNAIDU KINJARAPU;YCP;Kathanam;GEUMSat, 01 Apr 2023 07:00:00 GMT


ఇపుడీ విషయంపై పార్టీలో అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో యువతకు 40 శాతం టికెట్లు కేటాయిస్తామని చంద్రబాబు చాలా సందర్భాల్లోనే చెప్పారు. మామూలుగా అయితే చంద్రబాబుకు ఉన్న పేరు ఏమిటంటే మాట మీద నిలబడరని. అయితే 40 శాతం హామీని చాలాసార్లు చెప్పటంతో ఏమోలే ఈసారికి మాట మీద నిలబడతారేమో అని అనుకున్నారు. అయితే తాజా పరిణామాలు చూస్తున్న తమ్ముళ్ళకి అనుమానాలు పెరిగిపోతున్నాయి.





ఇక్కడ గమనించాల్సిందేమంటే  వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చేస్తామని 40 మంది ఎంఎల్ఏలు పదేపదే ఫోన్లు చేస్తున్నారంటు అచ్చెన్నాయుడు చెబుతున్నారు. వీళ్ళు వైసీపీపై మైండ్ గేమ్ మొదలుపెట్టారులే అని అనుకున్నారు. అయితే ఒకే విషయాన్ని పదేపదే చెబుతున్నారు. దీనికి తోడు ఎల్లోమీడియాలో కూడా సుమారు 30 మంది వైసీపీ ఎంఎల్ఏలు టీడీపీలోకి వచ్చేయటానికి రెడీగా ఉన్నారంటు కథనం వచ్చింది.






వీళ్ళకి చంద్రబాబునాయుడు టికెట్ హామీ ఇస్తే చాలట వెంటనే టీడీపీలోకి దూకేయటానికి రెడీగా ఉన్నారన్నది కథనం సారంశం. అచ్చెన్న చెప్పింది, ఎల్లోమీడియా చెబుతున్నదే నిజమని అనుకుందాం. గోడదూకటానికి రెడీగా ఉన్న 30 మంది ఎంఎల్ఏల్లో కనీసం 25 మందికన్నా టికెట్లు అయితే ఇవ్వాల్సిందే కదా. అలాగే జనసేనతో పొత్తు దాదాపు ఖాయమైనట్లే. జనసేనకు కూడా ఓ 30 టికెట్లు ఇవ్వకతప్పదు కదా. అంటే వైసీపీ నుండే వచ్చే 30 మందికి, జనసేనకు 30 టికెట్లు అంటే 60 టికెట్లు వదులుకోవాల్సిందే. అడ్వాన్స్ బుకింగ్ లో 60 టికెట్లు పోతే ఇక మిగిలేది 115 టికెట్లు మాత్రమే. మళ్ళీ పొత్తుల్లో వామపక్షాలకు కనీసం ఐదు టికెట్లు కేటాయించాలి.






చివరగా టీడీపీకి మిగిలేది 110 నియోజకవర్గాలు మాత్రమే. ఇందులో సిట్టింగులు 19 మందిని తీసేస్తే మిగిలేది 91 సీట్లు. ఇప్పటికే చంద్రబాబు ఓ 20 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేశారు.  అంటే మిగిలిన 71 సీట్లలో యువతకు 40 శాతం టికెట్లు కేటాయిస్తారా ? ఇది జరిగేపనికాదు. ఎందుకంటే చాలామంది సీనియర్లు పోటీకి రెడీ అయిపోతున్నారు. సో,  ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు హామీ మీద అనుమానాలు పెరిగిపోతున్నాయి. 







RRR Telugu Movie Review Rating

అమరావతి : చంద్రబాబు మాట నిలబెట్టుకుంటారా ?

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>