EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/rapakac1f4eb4d-444b-4d8e-ab4c-c7f51b8a21aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/rapakac1f4eb4d-444b-4d8e-ab4c-c7f51b8a21aa-415x250-IndiaHerald.jpgరాపాక జనసేనలో గెలిచి వైసీపీ లో చేరిన విషయం తెలిసిందే. రాపాకలో మొదటి నుంచి ఒక అసంతృప్తి ఉన్న విషయం ఎంటంటే ఎక్కడికెళ్లినా పవన్ కల్యాణ్ స్టేజీ పైన నాదెండ్ల మనోహర్ ను పక్కన కూర్చొబెట్టుకుంటారు. రాపాక ను స్టేజీపైకి పిలవరు అని ఒక అవమానం పడ్డట్లు తెలుస్తోంది. రెండో అంశం నియోజకవర్గ అభివృద్ధి పనులు అధికార పక్షంలో ఉంటేనే జరుగుతుందని నమ్మకం. ఈ రెండింటి కారణంగా ఆయన వైసీపీకి వచ్చారని అందరూ అనుకుంటున్నారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ రాపాక వరప్రసాద్ కు రూ. 10 కోట్లు ఇవ్వాలని చూపినట్లు ఆయన మాట్లRAPAKA{#}Pawan Kalyan;Nadendla Manohar;Donga;Telugu Desam Party;media;RAPAKA VARA PRASADA RAO;YCP;Thief;Nijam;TDPఆ జనసేన ఎమ్మెల్యే.. పూర్తిగా ఇరుక్కుపోయాడా?ఆ జనసేన ఎమ్మెల్యే.. పూర్తిగా ఇరుక్కుపోయాడా?RAPAKA{#}Pawan Kalyan;Nadendla Manohar;Donga;Telugu Desam Party;media;RAPAKA VARA PRASADA RAO;YCP;Thief;Nijam;TDPSat, 01 Apr 2023 10:00:00 GMTరాపాక జనసేనలో గెలిచి వైసీపీ లో చేరిన విషయం తెలిసిందే. రాపాకలో మొదటి నుంచి ఒక అసంతృప్తి ఉన్న విషయం ఎంటంటే ఎక్కడికెళ్లినా పవన్ కల్యాణ్ స్టేజీ పైన నాదెండ్ల మనోహర్ ను పక్కన కూర్చొబెట్టుకుంటారు. రాపాక ను స్టేజీపైకి పిలవరు అని ఒక అవమానం పడ్డట్లు తెలుస్తోంది. రెండో అంశం నియోజకవర్గ అభివృద్ధి పనులు అధికార పక్షంలో ఉంటేనే జరుగుతుందని నమ్మకం. ఈ రెండింటి కారణంగా ఆయన వైసీపీకి వచ్చారని అందరూ అనుకుంటున్నారు.


మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ రాపాక వరప్రసాద్ కు రూ. 10 కోట్లు ఇవ్వాలని చూపినట్లు ఆయన మాట్లాడుతున్న ఒక వీడియో వైరల్ గా మారింది. కానీ ఆ డబ్బులు తీసుకోవడానికి నేను వద్దన్నాను. నిజాయతీగానే ఉంటాను అనే వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. అది ఎంతవరకు నిజం అన్నది ఆయన మనసుకు తెలియాలి. తెలుగుదేశం పార్టీకి ఓటేసినా కూడా ఎలాంటి లాభం లేదు. కాబట్టి ఆయన ఓటేయడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. కానీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడిన విషయం చర్చనీయాంశంగా మారింది.


నేను దొంగ ఓట్లతో గెలిచాను అని ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన వీడియో బయటకొచ్చింది. కాపుల, ఎస్సీల ఓట్లు ఎవరికి పడతాయో తెలీదు. అంతకుముందు గెలిచినా, మొన్న గెలిచినపుడు కూడా దొంగ ఓట్లతో గెలిచాను. ఒక్కొక్కరు 15 ఓట్లు వేయడంతో 800 ఓట్ల తేడాతో గెలిచానని అన్నారు. ఇలా అనడం వరకే బాగానే ఉన్నా.. రాపాక గెలిచిన స్థానంలో టీడీపీ అభ్యర్థి ఇప్పుడు ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.


అదే గనక జరిగితే ఆయన మాట్లాడిన వీడియోనే సాక్ష్యంగా నిలుస్తుంది. తనే స్వయంగా అన్న మాటలను ఎన్నికల కమిషన్ ముందుంచుతారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు తీసుకోకుండా నిజాయతీగా ఉన్నా అని రాపాక,  దొంగఓట్లతో గెలిచానని చెప్పి ఒక్కసారిగా ఇరుక్కుపోయాడు.



RRR Telugu Movie Review Rating

కార్తికేయ కామెంట్స్ పై సెటైర్లు !

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>