EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tirumala2b9892e1-d4f6-4317-bd76-742e8d4ad02f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tirumala2b9892e1-d4f6-4317-bd76-742e8d4ad02f-415x250-IndiaHerald.jpgఒక అంశాన్ని ప్రజల దృష్టి నుంచి దారి మళ్లించాలంటే రాజకీయ నాయకులు వేసే ఎత్తుగడలు, వారి రూటు సెపరేటు. ఇలాంటి వ్యుహల్ని పన్నటంలో ప్రజా ప్రతినిధుల తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం కట్టాల్సిన మూడు కోట్ల రూపాయాల లైసెన్సు బిల్లును వెంటనే చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై ఏపీలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. 2018 సంవత్సరం నుంచి చెల్లించాల్సిన మొత్తం కలిపి మూడు కోట్లకు పైనే ఉండటంతో కేంద్రం ఏపీ ప్రభుత్వాన్ని చెల్లించాల్సిందేనని కోరింది. దీtirumala{#}Tirupati;YCP;Andhra Pradesh;TDP;central governmentతిరుమలకు కేంద్రం పెనాల్టీ.. అసలు తప్పెవరిది?తిరుమలకు కేంద్రం పెనాల్టీ.. అసలు తప్పెవరిది?tirumala{#}Tirupati;YCP;Andhra Pradesh;TDP;central governmentSat, 01 Apr 2023 20:34:00 GMTఒక అంశాన్ని ప్రజల దృష్టి నుంచి దారి మళ్లించాలంటే రాజకీయ నాయకులు వేసే ఎత్తుగడలు, వారి రూటు సెపరేటు. ఇలాంటి వ్యుహల్ని పన్నటంలో ప్రజా ప్రతినిధుల తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో  ఎలాంటి సందేహం అక్కర్లేదు.  అయితే తిరుమల తిరుపతి దేవస్థానం కట్టాల్సిన మూడు కోట్ల రూపాయాల లైసెన్సు  బిల్లును వెంటనే చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.


దీనిపై ఏపీలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. 2018 సంవత్సరం నుంచి చెల్లించాల్సిన మొత్తం కలిపి మూడు కోట్లకు పైనే ఉండటంతో కేంద్రం ఏపీ ప్రభుత్వాన్ని చెల్లించాల్సిందేనని కోరింది. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల దాడి కొనసాగుతోంది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరెవరూ విరాళాలు వేశారో లెక్కలు చెప్పాలని కేంద్రం అడుగుతోంది. దీనికి సంబంధించి లెక్కలు ఇవ్వాలని కోరుతోంది. విదేశీ నిధుల లెక్కలు చెప్పాలని ప్రశ్నిస్తోంది.  దేవస్థానం హుండీల ద్వారా  వచ్చిన డబ్బని అధికారులు చెబుతున్నారు.


కానీ దానికి లైసెన్సు రెన్యూవల్ చేయించుకోవాలి.  కానీ మూడేళ్ల నుంచి లైసెన్సు రెన్యూవల్ చేయించలేదు. మొత్తం మూడు కోట్లు, పెనాల్టీ కలుపుకొని నాలుగున్నర కోట్లు అయింది. దీంతో వైసీపీ పార్టీ నాయకులు తిరుమల వెంకటేశ్వర స్వామికే పెనాల్టీ వేస్తారా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. లైసెన్సు ఫీజు చెల్లించకుండా రెన్యూవల్ చేయకుండా ఇన్ని రోజులు ఉన్న అంశాన్ని పక్కకు పెట్టి కేంద్రంపై నిందలు వేసేందుకు, ప్రజలకు దేవుడిపై ఉన్న అభిమానంతో విషయాన్ని డైవర్ట్ చేయాలని వైసీపీ చూస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.


టీడీపీ నాయకులు వైసీపీని టార్గెట్ చేస్తూ ఈ విషయంపై తప్పించుకోవడానికి కేంద్రం పెనాల్టీ వేసి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ప్రచారం చేస్తోందని విమర్శిస్తోంది. అయితే 2018 నుంచి లైసెన్సు రెన్యూవల్ చేయించకపోవడం అనేది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వైఫల్యం అని ప్రముఖులు, ప్రజలు విమర్శిస్తున్నారు.  ఏదైమైనా అధికారులు చేసిన తప్పిదానికి పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.



RRR Telugu Movie Review Rating

సముద్రంలో సురేఖ వాణి కూతురు సుప్రీత అందాల విందు..!!

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>