EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bhutan896c264d-54cf-4a87-aea9-9aa302e610fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bhutan896c264d-54cf-4a87-aea9-9aa302e610fd-415x250-IndiaHerald.jpgమచిలీ పట్నం పోర్టు ను యాంకరేజ్ పోర్టుగా వాడుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పోర్టును ఆ మధ్య కోరింది. కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓపెన్ టెండర్ లో పాల్గొనండి కానీ డైరెక్టుగా ఇవ్వలేం అని తేల్చి చెప్పింది. యాంకరేజ్ పోర్టు అంటే సముద్రం తమ ప్రదేశంలో లేనపుడు వేరే దేశంలో, వేరే రాష్ట్రంలో ఉన్న పోర్టు ను తమ ఆధీనంలోకి తీసుకుని కార్యకలాపాలను నడిపించడం. భూటాన్ దేశానికి సముద్ర సరిహద్దు లేదు. దీంతో భూటాన్ ఇప్పుడు యాంకరేజ్ పోర్టులపై దృష్టి సారించింది. భారత్ ఓడరేవుల నుంచే భూటాన్ కు సరకులు సరఫరా అవుతుBHUTAN{#}Andhra Pradesh;Bhutan;Sea;Telangana;Bangladesh;Indiaభూటాన్‌.. భారత్‌కు దూరమవుతుందా?భూటాన్‌.. భారత్‌కు దూరమవుతుందా?BHUTAN{#}Andhra Pradesh;Bhutan;Sea;Telangana;Bangladesh;IndiaSat, 01 Apr 2023 06:00:00 GMTమచిలీ పట్నం పోర్టు ను యాంకరేజ్ పోర్టుగా వాడుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పోర్టును ఆ మధ్య కోరింది. కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓపెన్ టెండర్ లో పాల్గొనండి కానీ డైరెక్టుగా ఇవ్వలేం అని తేల్చి చెప్పింది. యాంకరేజ్ పోర్టు అంటే సముద్రం తమ ప్రదేశంలో లేనపుడు వేరే దేశంలో, వేరే రాష్ట్రంలో ఉన్న పోర్టు ను తమ ఆధీనంలోకి తీసుకుని కార్యకలాపాలను నడిపించడం.


భూటాన్ దేశానికి సముద్ర సరిహద్దు లేదు. దీంతో భూటాన్ ఇప్పుడు యాంకరేజ్ పోర్టులపై దృష్టి సారించింది. భారత్ ఓడరేవుల నుంచే భూటాన్ కు సరకులు సరఫరా అవుతుంటాయి. బంగ్లాదేశ్ కూడా భూటాన్ కు దగ్గరగానే ఉంటుంది. బంగ్లాదేశ్ యాంకరేజ్ పోర్టుల కోసం భూటాన్ అడిగితే ఓకే అంది. భారత్ ఓడరేవుల నుంచి భూటాన్ కు సరకులు చేరాలంటే దాదాపు 260 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లాల్సి ఉంటుంది. దీని వల్ల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నట్లు భూటాన్ భావించింది.


దీంతో బంగ్లాదేశ్ లో యాంకరేజ్ పోర్టుల వల్ల భూటాన్ కు ఖర్చు తగ్గే అవకాశం ఉందని భావించింది. బంగ్లాదేశ్ లో ఏర్పాటు చేసుకున్న యాంకరేజ్ పోర్టులతో కేవలం 60 కిలోమీటర్ల దూరం మాత్రమే వస్తుందని దీంతో రవాణ ఖర్చులు తగ్గి సరకులు తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భూటాన్ భారత్ మీదే కాకుండా వేరే దేశాల మీద కూడా ఆధారపడుతోందని ఈ నిర్ణయం వల్ల వెల్లడవుతోంది.


మంగోలియా, చిట్టగాంగ్, లాంటి ప్రాంతాల్లో ఉన్న పోర్టులను యాంకరేజ్ పోర్టులుగా తీసుకుని భూటాన్ తనపై పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో భారత్ నుంచి సరకుల రవాణా తగ్గడంతో మన దేశంతో ఉన్న సంబంధం కూడా దూరమయ్యే అవకాశం ఉంది. సముద్ర తీర ప్రాంతాలను కూడా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చని భూటాన్ నిరూపిస్తోంది.



RRR Telugu Movie Review Rating

అమరావతి : చంద్రబాబు మాట నిలబెట్టుకుంటారా ?

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>