PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/stresse54a3bd0-70e9-4bd3-a83e-d63a6770a486-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/stresse54a3bd0-70e9-4bd3-a83e-d63a6770a486-415x250-IndiaHerald.jpgసాఫ్ట్ వేర్ ఉద్యోగం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.చదివిన చదువుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేసే జాబ్. ఈ జాబ్ చెయ్యాలని చాలా మంది కలలు కంటుంటారు. దానికి కారణం మంచి జీతం. కానీ పని ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే జీతానికి తగ్గట్టు ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. కొన్నిసార్లు ఆ ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎక్కువగా వున్నాయి.ఇప్పుడు తాజాగా మరో వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవడం చాలా కలకలం రేపుతోంది. చేసే పనిలో ఒత్తిడి అలాగే ఉద్యోగ భద్రత కూడా లేకపోవడంతో ఓ సాఫ్టSTRESS{#}vinod kumar;software;job;police;Police Station;Hyderabad;Guntur;thursday;Wife;Houseపని ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య?పని ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య?STRESS{#}vinod kumar;software;job;police;Police Station;Hyderabad;Guntur;thursday;Wife;HouseFri, 31 Mar 2023 14:50:22 GMTసాఫ్ట్ వేర్ ఉద్యోగం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.చదివిన చదువుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేసే జాబ్. ఈ జాబ్ చెయ్యాలని చాలా మంది కలలు కంటుంటారు. దానికి కారణం  మంచి జీతం. కానీ పని ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే జీతానికి తగ్గట్టు ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. కొన్నిసార్లు ఆ ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎక్కువగా వున్నాయి.ఇప్పుడు తాజాగా మరో వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవడం చాలా కలకలం రేపుతోంది. చేసే పనిలో ఒత్తిడి అలాగే ఉద్యోగ భద్రత కూడా లేకపోవడంతో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ నగర శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి అల్కాపూర్ టౌన్ షిప్ లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.


పూర్తి వివరాల్లోకి వెళ్తే గుంటూరుకి చెందిన వినోద్ కుమార్ (32) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇప్పటి దాకా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా గుంటూరు నుంచే అతను పని చేశాడు. కానీ ఈ మధ్య ఆఫిస్ కు వెళ్లి రావాల్సి ఉండటంతో అల్కాపూర్ లోని తన సోదరుని ఇంట్లో ఉంటూ ఆఫీసుకి పనికి వెళ్తున్నాడు.అయితే ఆఫీసులో ఉద్యోగ నిర్వహణలో భాగంగా కొత్త టూల్స్ వస్తుండటంతో వినోద్ వాటిపై అంతగా పట్టు సాధించలేకపోయాడు. ఈ విషయంపై తన సోదరుడితో కూడా అతను తరచూ చర్చించేవాడు. తాను చేసే ఉద్యోగంలో పని ఒత్తడి ఇంకా ఉద్యోగ భద్రత కూడా లేదని భావించిన వినోద్ గురువారం నాడు సోదరుడు అతని భార్య బయటకు వెళ్లటంతో ఆ ఇంట్లో ఉరివేసుకున్నాడు. ఇక ఈ తర్వాత ఇంటికి వచ్చిన సోదరుడు వినోద్ ను ఆసుపత్రికి తరలించినా కూడా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వినోద్ కు భార్య ఇంకా మూడేళ్ల కుమార్తె ఉన్నారు.



RRR Telugu Movie Review Rating

"ఎన్బికె108" మూవీని ఆ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారా..?

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>