EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modif4245a97-462c-47af-b1fe-c261c60dba8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modif4245a97-462c-47af-b1fe-c261c60dba8a-415x250-IndiaHerald.jpgదేశ ప్రధాని మోదీ.. ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే పెట్రోలు ధరలు తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజలను దోచుకుంటోందని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. చమురు ధరల పేరిట దోపిడీ ఆపకపోతే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదంటూ కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. పెట్రో భారం తగ్గాలంటే.. భాజపాను వదిలించుకోవడమే ఏకైక మార్గమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చమురు ధరల పెరుగుదలపై పార్లమెంటులో చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మmodi{#}Prime Minister;Diesel;KTR;Letter;Corporate;Petrol;central government;Narendra Modi;Bharatiya Janata Party;INTERNATIONAL;Ministerమోదీ.. సారీ చెప్పు.. రేటు తగ్గించు?మోదీ.. సారీ చెప్పు.. రేటు తగ్గించు?modi{#}Prime Minister;Diesel;KTR;Letter;Corporate;Petrol;central government;Narendra Modi;Bharatiya Janata Party;INTERNATIONAL;MinisterFri, 31 Mar 2023 09:04:32 GMTదేశ ప్రధాని మోదీ.. ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే పెట్రోలు ధరలు తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజలను దోచుకుంటోందని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. చమురు ధరల పేరిట దోపిడీ ఆపకపోతే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదంటూ కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. పెట్రో భారం తగ్గాలంటే.. భాజపాను వదిలించుకోవడమే ఏకైక మార్గమని మంత్రి కేటీఆర్‌ అన్నారు.


చమురు ధరల పెరుగుదలపై పార్లమెంటులో చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్రం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీ రామారావు డిమాండ్ చేశారు. భాజపా ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్,  డీజిల్ ధరలను అమాంతం పెంచి దేశ ప్రజలను నిలువునా దోచుకుంటోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.


అంతర్జాతీయ ముడిచమురు ధరలను బూచిగా చూపించి కేంద్రం ఇంతకాలం చెప్పిన మాటలన్నీ  కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బ్యారెల్ ముడి చమురు ధర  2013లో 110 డాలర్లు ఉన్నప్పుడు, దేశంలో లీటర్ పెట్రోల్ రేటు కేవలం 76 రూపాయలు ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇప్పుడు బ్యారెల్ ముడిచమురు రేటు దాదాపు సగం పడిపోయి 66 డాలర్లకు తగ్గినా, పెట్రోల్ ధర లీటర్ కు 110 రూపాయలు ఉండడమేంటని మంత్రి కేటీఆర్‌ నిలదీశారు.


దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదని, మోదీనేనని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ముడి చమురును బూచిగా చూపి తన కార్పొరేట్ మిత్రుల ఖజానాను లాభాలతో నింపేందుకు మోదీ ప్రభుత్వం పెట్రోల్ ధరను పెంచుకుంటూ పోతున్నదని మంత్రి కేటీఆర్‌ అంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు ధరల భారంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.



RRR Telugu Movie Review Rating

లీకేజీ కేసు.. శంకరలక్ష్మిదే కీలక పాత్ర?

నాని నమ్మకం నిలబెట్టిన దసరా..!

దసరా నాని మరో లెవల్ అంతే..!

వివేకా కేసులో కొత్త సిట్‌.. జగన్‌కు ప్లస్సా.. మైనస్సా?

రష్యా దూకుడుతో.. ఉక్రెయిన్‌కు లొంగుబాటు తప్పదా?

రాహుల్ అనర్హత.. కాంగ్రెస్‌లో జోష్‌ తెచ్చిందా?

జోష్‌లో ఉన్న చంద్రబాబుకు ఐటీ షాక్‌ తప్పదా?

అమెరికా పాఠ్యపుస్తకాల్లో ఓ ఇండియన్‌ స్టోరీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>