MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasara-movie-tho-nani-hit-kottinattena12a9a13a-62ca-4949-9216-2e15d7c7517d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasara-movie-tho-nani-hit-kottinattena12a9a13a-62ca-4949-9216-2e15d7c7517d-415x250-IndiaHerald.jpgప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం దసరా.. ఈ సినిమా ఈరోజు అనగా శ్రీరామనవమి సందర్భంగా పాన్ ఇండియా రేంజిలో విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్గా ఇందులో నటించారు. ఇకపోతే ఇందులో వీరిద్దరూ కూడా డి గ్లామరస్ పాత్ర పోషించడం నిజంగా సినిమాకే హైలెట్గా నిలిచింది తాజాగా నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు వేయగా అది చూసిన చాలా మంది ట్విట్టర్ ద్వారా అలాగే ఇతర సోషల్ మీడియా అకౌంట్ ల ద్వారా తమ అభిపDASARA{#}Nani;Suresh;keerthi suresh;silk smitha;festival;Varsham;Blockbuster hit;Director;Cinema;Chitram;India;Success;Heroine;media;Cricket;twitterదసరా మూవీతో నాని హిట్ కొట్టినట్టేనా..?దసరా మూవీతో నాని హిట్ కొట్టినట్టేనా..?DASARA{#}Nani;Suresh;keerthi suresh;silk smitha;festival;Varsham;Blockbuster hit;Director;Cinema;Chitram;India;Success;Heroine;media;Cricket;twitterThu, 30 Mar 2023 07:32:00 GMTప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం దసరా.. ఈ సినిమా ఈరోజు అనగా శ్రీరామనవమి సందర్భంగా పాన్ ఇండియా రేంజిలో విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్గా ఇందులో నటించారు.  ఇకపోతే ఇందులో వీరిద్దరూ కూడా డి గ్లామరస్ పాత్ర పోషించడం నిజంగా సినిమాకే హైలెట్గా నిలిచింది తాజాగా నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు వేయగా అది చూసిన చాలా మంది ట్విట్టర్ ద్వారా అలాగే ఇతర సోషల్ మీడియా అకౌంట్ ల ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

సినిమా మొదలవగానే సిల్క్ స్మిత పోస్టర్ తో ఇంట్రడక్షన్ సీను సినిమాకి హైలైట్ గా నిలవనుందట. మరోవైపు క్రికెట్ సన్నివేశము కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని తెలుస్తోంది. అలాగే యాక్షన్ , ఎమోషన్ ఎలివేషన్స్ తో కూడిన ప్రతి అంశాన్ని కూడా డైరెక్టర్ చాలా చక్కగా తెరకెక్కించారు అంటూ అటు డైరెక్టర్ పై కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వాస్తవానికి నాని శ్యామ్ సింగరాయ్ సినిమా తర్వాత మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మధ్యలో ఆయన నటించిన అంటే సుందరానికి సినిమా కూడా అట్టర్ ప్లాప్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆయన తదుపరి సినిమా కోసం బాగా ఎదురు చూశాడు.  అందులోనూ ఇది ఆయన కెరియర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం కావడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నాని.. ఈ సినిమాతో సక్సెస్ కొట్టినట్లు తెలుస్తోంది . ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ లభిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే హిట్టు కోసం ఎదురుచూస్తున్న నానికి బ్లాక్ బస్టర్ హిట్ లభించిందని చెప్పవచ్చు. ఇకపోతే అటు కీర్తి సురేష్ , నాని ఇద్దరు కలిసి నటిస్తున్న రెండవ చిత్రం కావడంతో ఇద్దరి మధ్య ముందే మంచి సన్నిహిత్యం ఉండేది . దాంతో సినిమా షూటింగ్ కూడా పండుగ వాతావరణంలా గడిచిపోయింది. ఏది ఏమైనా హిట్టు కోసం ఎదురుచూస్తున్న అటు నాని , ఇటు కీర్తి సురేష్ కి ఈ సినిమా మంచి విజయాన్ని అందించిందని చెప్పవచ్చు.



RRR Telugu Movie Review Rating

మోదీ.. అదానీ కోసం ఎందుకంత తాపత్రయం?

వివేకా కేసులో కొత్త సిట్‌.. జగన్‌కు ప్లస్సా.. మైనస్సా?

రష్యా దూకుడుతో.. ఉక్రెయిన్‌కు లొంగుబాటు తప్పదా?

రాహుల్ అనర్హత.. కాంగ్రెస్‌లో జోష్‌ తెచ్చిందా?

జోష్‌లో ఉన్న చంద్రబాబుకు ఐటీ షాక్‌ తప్పదా?

అమెరికా పాఠ్యపుస్తకాల్లో ఓ ఇండియన్‌ స్టోరీ?

మోదీ దెబ్బకు బ్రిటన్‌ సర్కారు దిగొచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>