Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-bab91282-184b-42cd-8c9d-944acd4fc613-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-bab91282-184b-42cd-8c9d-944acd4fc613-415x250-IndiaHerald.jpgప్రేమ అనేది నేటి రోజుల్లో ప్రాణాలు పోవడానికి చిరునామాగా మారిపోయింది. ఎందుకంటే ప్రేమించిన పాపానికి చివరికి మనసిచ్చిన వారి చేతిలోనే మోసపోతూ యువతి యువకులు అనే తేడా లేకుండా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక కొంతమంది ప్రేమను గెలిపించుకోవడానికి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ పరువు పోతుంది అన్న కారణంతో సొంత పిల్లలని దారుణంగా హత్య చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇక మరికొన్ని ఘటనల్లో తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరిస్తారో లేదో అనే భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నాయ్ ఈ ప్రేమ జంటలు. ఇలా ప్Suicide {#}Guntur;mandalam;Tenali;Murder.;prema;Yuva;srikanth;Traffic police;Parents;News;marriage;police;Loveపెద్దలు ప్రేమను కాదన్నారని.. ఆ జంట ఏం చేసిందో తెలుసా?పెద్దలు ప్రేమను కాదన్నారని.. ఆ జంట ఏం చేసిందో తెలుసా?Suicide {#}Guntur;mandalam;Tenali;Murder.;prema;Yuva;srikanth;Traffic police;Parents;News;marriage;police;LoveWed, 29 Mar 2023 16:42:43 GMTప్రేమ అనేది నేటి రోజుల్లో ప్రాణాలు పోవడానికి చిరునామాగా మారిపోయింది. ఎందుకంటే ప్రేమించిన పాపానికి చివరికి మనసిచ్చిన వారి చేతిలోనే మోసపోతూ యువతి యువకులు అనే తేడా లేకుండా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక కొంతమంది ప్రేమను గెలిపించుకోవడానికి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ పరువు పోతుంది అన్న కారణంతో సొంత పిల్లలని దారుణంగా హత్య చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇక మరికొన్ని ఘటనల్లో తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరిస్తారో లేదో అనే భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నాయ్ ఈ ప్రేమ జంటలు.


 ఇలా ప్రేమ అనే మాయలో పడిపోయి కని పెంచిన తల్లిదండ్రుల గురించి మాత్రం అస్సలు ఆలోచించడం లేదు అని చెప్పాలి. ఇక ఇటీవల ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. తమ ప్రేమను పెద్దలు కాదన్నారు అన్న కారణంతో ఒక యువ జంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి రైల్వే గేటు వద్ద చోటుచేసుకుంది అని చెప్పాలి. సెల పాడు గ్రామానికి చెందిన ఉయ్యూరు శ్రీకాంత్ అదే గ్రామానికి చెందిన త్రివేణి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల శ్రీకాంత్తో త్రివేణి వెళ్లడాన్ని గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు చెప్పారు.



 దీంతో తల్లిదండ్రులు చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్రివేణి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే సుద్ధపల్లి రైల్వే గేటు వద్ద మృతదేహాలను గ్యాంగ్ మెన్ గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇక పోలీసులు త్రివేణి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా.. సంఘటన స్థలానికి చేరుకున్న వారు ఇక అక్కడ చనిపోయింది తమ కూతురు త్రివేణి అంటూ బోరున విలపించారు.  ఈ ఘటన స్థానికంగా సంచలనగా మారిపోయింది. తెనాలి రైల్వే పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా.. ప్రపంచ రికార్డ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>