PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vivekanandaredd-supremecourt-kadapa-mp617f5d75-e220-46b3-95c0-4ba0a00ad919-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vivekanandaredd-supremecourt-kadapa-mp617f5d75-e220-46b3-95c0-4ba0a00ad919-415x250-IndiaHerald.jpgహోలు మొత్తంమీద మర్డర్ కేసులో జగన్మోహన్ రెడ్డే సూత్రదారని, కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రదారుడిగా చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నాయి. సీబీఐ విచారణ కూడా దాదాపు ఇలాగే సాగుతోంది. దీన్ని ఎంపీ అవినాష్ రెడ్డి తప్పుపడుతున్నారు. సీబీఐ విచారణ అధికారి టీడీపీ, ఎల్లోమీడియా డైరెక్షన్లోనే దర్యాప్తు, విచారణ చేస్తున్నారంటు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని నిందితుల్లో ఒకడైన దేవిరెడ్డి శివశంకరరెడ్డి భార్య తులశమ్మ కూడా ఆరోపించారు. vivekanandaredd supremecourt kadapa MP{#}devineni avinash;kadapa;CBI;Murder;Murder.;court;MP;TDP;Doctor;Wife;Reddy;Directorఅమరావతి : వివేకా మర్డర్ కేసులో ఊహించని షాక్అమరావతి : వివేకా మర్డర్ కేసులో ఊహించని షాక్vivekanandaredd supremecourt kadapa MP{#}devineni avinash;kadapa;CBI;Murder;Murder.;court;MP;TDP;Doctor;Wife;Reddy;DirectorTue, 28 Mar 2023 03:00:00 GMT




వివేకానందరెడ్డి మర్డర్ కేసులు టీడీపీ, ఎల్లోమీడియాకు సుప్రింకోర్టు పెద్ద షాకిచ్చింది.  దర్యాప్తు అధికారిని వెంటనే మార్చేయాలని సీబీఐ డైరెక్టర్ ను కోర్టు ఆదేశించింది. హత్యకేసు దర్యాప్తులో మొదటినుండి తెలుగుదేశంపార్టీ, ఎల్లోమీడియా చాలా అత్యుత్సాహం చూపిస్తున్నాయి. సీబీఐ ఎవరిని విచారణకు పిలపించినా విచారణలో ఏమి జరిగిందనే విషయాన్ని ఎల్లోమీడియా వార్తలు, కథనాలు ఇచ్చేస్తోంది. ఈ క్రమంలో సీబీఐ విచారణలో ప్రస్తావనకు రాని అంశాలు కూడా వచ్చినట్లు ప్రచారం చేసేస్తోంది.





హోలు మొత్తంమీద మర్డర్ కేసులో జగన్మోహన్ రెడ్డే సూత్రదారని, కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రదారుడిగా చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నాయి. సీబీఐ విచారణ కూడా దాదాపు ఇలాగే సాగుతోంది. దీన్ని ఎంపీ అవినాష్ రెడ్డి తప్పుపడుతున్నారు. సీబీఐ విచారణ అధికారి టీడీపీ, ఎల్లోమీడియా డైరెక్షన్లోనే దర్యాప్తు, విచారణ చేస్తున్నారంటు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని నిందితుల్లో ఒకడైన దేవిరెడ్డి శివశంకరరెడ్డి భార్య తులశమ్మ కూడా ఆరోపించారు.





తులశమ్మ వేసిన పిటీషన్ పై జరిగిన విచారణలో దర్యాప్తు అధికారిపై కోర్టు మండిపడింది. వెంటనే దర్యాప్తు అధికారిని మార్చేసి కొత్తగా వేరొకరిని నియమించాలని డైరెక్టర్ ను ఆదేశించింది. విచారణ తీరును కూడా తప్పుపట్టింది. విషయం ఏమిటంటే హత్య కేసుకు సంబంధించి  ఎంపీ, తులశమ్మ చేసిన ఆరోపణలను, ఇచ్చిన సమాచారాన్ని, వ్యక్తంచేసిన అనుమానాలను సీబీఐ ఏమాత్రం పట్టించుకోలేదు.





వివేకా కూతురు డాక్టర్ సునీత మొదట్లో  టీడీపీ నేతల హస్తముందని చెప్పారు. తర్వాత పరిణామాల్లో ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ఇపుడు ఎంపీ అదే విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అలాగే వివేకా మర్డర్ కేసులో కుటుంబ తగాదాలు కూడా కారణమై ఉండచ్చని పదేపదే ఆరోపిస్తున్నారు. అయితే దర్యాప్తు అధికారి దాన్ని పట్టించుకోలేదు. విచారణ నిష్పక్షపాతంగా జరుగాలంటే అందరి ఆరోపణలను వినాలి, అనుమానితులందరినీ విచారించాలి.  మరి కొత్తగా రాబోయే విచారణాధికారి రెండువైపులా ఆరోపణలను విని నిష్పక్షపాతంగా విచారణ జరుపుతారా ? ఏమో ఏమవుతుందో చూడాల్సిందే.




RRR Telugu Movie Review Rating

అమరావతి : ఈమె నిజంగా మహానటేనా ?

చంద్రబాబు దెబ్బ.. జగన్ భయపడుతున్నారా?

టీఎస్‌పీఎస్సీ లీకేజీలో పెద్ద తలకాయల పాత్ర?

తెలంగాణలో మూడోసారీ.. కేసీఆర్‌దే అధికారం?

యుద్ధం: రష్యాను ఫుల్‌గా వాడేసుకుంటున్న ఇండియా?

సినిమా హాల్లో రచ్చ రచ్చ చేసిన మంత్రి మల్లారెడ్డి?

పాక్‌ అండతో రెచ్చిపోతున్న సిక్కు తీవ్రవాది అమృత్‌పాల్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>