EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/dsc83244a9-cdf0-4338-9409-939501268568-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/dsc83244a9-cdf0-4338-9409-939501268568-415x250-IndiaHerald.jpgధర్మపురి శ్రీనివాస్‌ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా తాజాగా చేశారు. పార్టీలో చేరిన 24 గంటల లోపే రాజీనామా చేస్తున్నట్లు డీ శ్రీనివాస్‌ ప్రకటించారు. మొన్న గాంధీ భవన్‌లో చేపట్టిన నిరసన దీక్ష సందర్భంగా బిఆర్‌ఎస్‌ మాజీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌, ఆయన కుమారుడు డి సంజయ్‌లు హస్తం కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిల సమక్షంలో ఇద్దరు కాంగ్రెస్‌ తీర్థం తీసుకున్నారు. ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదుకాని ...నిన్న మల్లిఖార్జున ఖర్గేds{#}vijayalakshmi;Mohandas Karamchand Gandhi;Rajya Sabha;Wife;Gandhi Bhavan;Kavuru Srinivas;Congress;రాజీనామా;media;politics;Partyడీఎస్‌.. కాంగ్రెస్‌లో చేరారు.. వెంటనే రాజీనామా?డీఎస్‌.. కాంగ్రెస్‌లో చేరారు.. వెంటనే రాజీనామా?ds{#}vijayalakshmi;Mohandas Karamchand Gandhi;Rajya Sabha;Wife;Gandhi Bhavan;Kavuru Srinivas;Congress;రాజీనామా;media;politics;PartyTue, 28 Mar 2023 06:35:00 GMTధర్మపురి శ్రీనివాస్‌ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా తాజాగా చేశారు. పార్టీలో చేరిన 24 గంటల లోపే రాజీనామా చేస్తున్నట్లు డీ శ్రీనివాస్‌ ప్రకటించారు. మొన్న గాంధీ భవన్‌లో చేపట్టిన నిరసన దీక్ష సందర్భంగా బిఆర్‌ఎస్‌ మాజీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌, ఆయన కుమారుడు డి సంజయ్‌లు హస్తం కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిల సమక్షంలో ఇద్దరు కాంగ్రెస్‌ తీర్థం తీసుకున్నారు.

ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదుకాని ...నిన్న  మల్లిఖార్జున ఖర్గేకి డి శ్రీనివాస్‌ లేఖ రాశారు. తన కుమారుడు డి.సంజయ్‌ కాంగ్రెస్‌ పార్టీలో తిరిగి చేరిన సందర్భంగా ఆశీస్సులు ఇచ్చేందుకు గాంధీభవన్‌ వెళ్లినానని.., ఆ సందర్భంగా తనపై కండవా వేశారన్నారు. దీంతో తాను కూడా పార్టీలో చేరినట్లు మీడియా ప్రచారం చేసిందని అన్నారు.


తాను ఎప్పటికీ కాంగ్రెస్‌ వాదినేనని కాని వయస్సు రీత్యా, ఆరోగ్యపరిస్థితులు దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నట్లు డీ శ్రీనివాస్‌ వివరించారు. పార్టీలో తన చేరికకు బి సంజయ్‌ టికెట్‌కు ముడి పెట్టొద్దని డీ శ్రీనివాస్‌ సూచించారు. కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు, సంప్రదాయాలు, ప్రజామోదం మేరకే పార్టీ టికెట్ల కేటాయింపు జరుగుతుందని డీ శ్రీనివాస్‌ తెలిపారు. ఆరోగ్య రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న తనను వివాదాల్లోకి లాగొద్దని డీ శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు.


కాంగ్రెస్‌ పార్టీలో తాను మల్లీ చేరినట్లు భావిస్తే ఈ లేఖను తన రాజీనామాగా భావించి ఆమోదించాలని మల్లిఖార్జున ఖర్గేకి డీ శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు. ఈ లేఖతోపాటు ఆయన భార్య ధర్మపురి విజయలక్ష్మి కూడా స్పందించారు. రాజకీయాలు చేసే సమయం కాదని, పార్టీలో చేర్చుకునే పద్దతి కూడా ఇది కాదని ఆమె స్పష్టం చేశారు. దయచేసి మీడియా వాళ్లు ఎప్పుడు తమ ఇంటి వైపు రావద్దని డీ శ్రీనివాస్‌ భార్య సూచించారు.





RRR Telugu Movie Review Rating

అమరావతి : ఈమె నిజంగా మహానటేనా ?

చంద్రబాబు దెబ్బ.. జగన్ భయపడుతున్నారా?

టీఎస్‌పీఎస్సీ లీకేజీలో పెద్ద తలకాయల పాత్ర?

తెలంగాణలో మూడోసారీ.. కేసీఆర్‌దే అధికారం?

యుద్ధం: రష్యాను ఫుల్‌గా వాడేసుకుంటున్న ఇండియా?

సినిమా హాల్లో రచ్చ రచ్చ చేసిన మంత్రి మల్లారెడ్డి?

పాక్‌ అండతో రెచ్చిపోతున్న సిక్కు తీవ్రవాది అమృత్‌పాల్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>