Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli66207b80-c777-47bf-9daa-1e9b80bdfdc7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli66207b80-c777-47bf-9daa-1e9b80bdfdc7-415x250-IndiaHerald.jpgటీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . అతనిలో ఉన్న ఎనర్జీతోనే ఏకంగా ప్రత్యర్థులను భయపెడుతూ ఉంటాడు. ఇక ఎన్నోసార్లు మైదానంలో ప్రత్యర్థులతో గొడవలకు దిగిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక బౌలర్లు వికెట్ తీసిన సమయంలో విరాట్ కోహ్లీ చేసుకునే సెలబ్రేషన్స్ కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి . అయితే ఇప్పుడు మాత్రమే కాదు కెరియర్ ప్రారంభం నుంచి కూడా విరాట్ కోహ్లీ ఇక ఇలాంటి యాటిట్యూడ్ తోనే టీమిండియాలో Kohli{#}VIRAT KOHLI;Cricket;Australiaఅప్పుడు కోహ్లీ చేసిన పనికి.. జీవితకాల నిషేధం పడేది తెలుసా?అప్పుడు కోహ్లీ చేసిన పనికి.. జీవితకాల నిషేధం పడేది తెలుసా?Kohli{#}VIRAT KOHLI;Cricket;AustraliaSun, 26 Mar 2023 08:24:08 GMTటీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . అతనిలో ఉన్న ఎనర్జీతోనే ఏకంగా ప్రత్యర్థులను భయపెడుతూ ఉంటాడు. ఇక ఎన్నోసార్లు మైదానంలో ప్రత్యర్థులతో గొడవలకు దిగిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక బౌలర్లు వికెట్ తీసిన సమయంలో విరాట్ కోహ్లీ చేసుకునే సెలబ్రేషన్స్ కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి . అయితే ఇప్పుడు మాత్రమే కాదు కెరియర్ ప్రారంభం నుంచి కూడా విరాట్ కోహ్లీ ఇక ఇలాంటి యాటిట్యూడ్ తోనే టీమిండియాలో కొనసాగుతూ వస్తున్నాడు.



 అయితే ఇక విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు క్రికెట్ రూల్స్ ని ఖచ్చితంగా ఫాలో అవుతాడని అలాంటి రూల్స్ ని ఉపయోగించుకునే ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తాడు అన్న విషయం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు తెలుసు. అయితే అలాంటి విరాట్ కోహ్లీ 2012లో మాత్రం కాస్త దూకుడుతనం ప్రదర్శించి ఏకంగా జీవితకాల నిషేధం ఎదుర్కొనే పరిస్థితులను కొని తెచ్చుకున్నాడు అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. 2012 లో సిడ్ని క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరిగింది. స్టేడియం కి వచ్చిన ఆస్ట్రేలియా ప్రేక్షకులందరికీ కూడా మిడిల్ ఫింగర్ చూపించాడు కోహ్లీ. ఇక ఈ చర్య తర్వాత మ్యాచ్ రిఫర్ అతన్ని నిషేధించేందుకు సిద్ధమయ్యాడు అని చెప్పాలి. ఈ విషయాన్ని కోహ్లీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు.



 నేను మధ్య వేలు చూపించిన తర్వాత ఎంతో కూల్ గా ఉన్నాను. మ్యాచ్ రిఫరీ గా ఉన్న రంజన్ మధుగల్లే మరుసటి రోజు తన ఆఫీసుకి నన్ను  రమ్మన్నారు. ఎందుకు పిలిచారు అంటూ అక్కడికి వెళ్లి అడిగాను. అప్పుడు ఆయన మాట్లాడుతూ నిన్న బౌండరీ లైన్ వద్ద ఏం జరిగింది అంటూ ప్రశ్నించాడు. ఏమీ లేదని సమాధానం చెప్పాను. తర్వాత వార్తాపత్రికను నా ముందు పెట్టగా అందులో మొదటి పేజీలో మిడిల్ ఫింగర్ చూపించిన పెద్ద ఫోటో కనిపించింది. దీంతో నేను వెంటనే సారి చెప్పాను. నన్ను క్షమించండి. నన్ను నిషేధించకండి అంటూ విజ్ఞప్తి చేశాను. దీంతో ఇక నాపై నిషేధం విధించకుండా మ్యాచ్ ఫీజులో సగం తగ్గించాడు. నువ్వు ఇంకా చిన్న వాడిని కెరియర్ నేను నాశనం చేసుకోవద్దు అంటూ సూచించాడు అని కోహ్లీ ఇటీవల చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : బీజేపీ విషయంలో చంద్రబాబు ప్లానిదేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>