EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/india04444b95-322d-4d04-abdd-74cd02ae5e9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/india04444b95-322d-4d04-abdd-74cd02ae5e9e-415x250-IndiaHerald.jpgప్రపంచానికి మేధావులను, నిపుణులను అందించే పరిశ్రమగా మాత్రమే తయారవుతున్న ఇండియా ఇంటలెక్చువల్ కార్ఖానాగా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ కష్టపడుతున్నారు, చదువుతున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, కానీ ఒక స్టేజికి రాగానే దేశం వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఎందుకంటే విలాసవంతమైన జీవితం, అద్భుతమైన ప్రశాంతత, ఇంకా మౌలిక వసతుల పరంగా ప్రపంచంలోనే అద్భుతంగా ఉంటుందన్న ఆలోచనతో పాటుగా అక్కడ సంపాదించుకోవచ్చని కూడా, ఇలా వీటన్నింటిని విదేశీ వ్యామోహం అని కూడా అనవచ్చు. ఇక్కడ డాక్టర్ డిగ్రీలు చదివిన వాళ్లు విదేశాలకు వెళ్INDIA{#}Doctor;Coronavirus;Indiaఇండియాలో ఉద్యోగులు దొరకడం లేదా?ఇండియాలో ఉద్యోగులు దొరకడం లేదా?INDIA{#}Doctor;Coronavirus;IndiaSun, 26 Mar 2023 23:00:00 GMTప్రపంచానికి మేధావులను, నిపుణులను అందించే పరిశ్రమగా మాత్రమే తయారవుతున్న ఇండియా ఇంటలెక్చువల్ కార్ఖానాగా మారుతుంది.  ఎందుకంటే ఇక్కడ కష్టపడుతున్నారు, చదువుతున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, కానీ ఒక స్టేజికి రాగానే దేశం వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఎందుకంటే విలాసవంతమైన జీవితం, అద్భుతమైన ప్రశాంతత, ఇంకా మౌలిక వసతుల పరంగా ప్రపంచంలోనే అద్భుతంగా ఉంటుందన్న ఆలోచనతో పాటుగా అక్కడ సంపాదించుకోవచ్చని కూడా, ఇలా వీటన్నింటిని విదేశీ వ్యామోహం అని కూడా అనవచ్చు.


ఇక్కడ డాక్టర్ డిగ్రీలు చదివిన వాళ్లు విదేశాలకు వెళ్లి  సంపాదించుకుంటూ ఉంటే, స్థిరపడిపోతూ ఉంటే, దాని వలన ఇక్కడ డాక్టర్ల కొరత వస్తూ ఉంటే, డాక్టర్ల సీట్లు పెంచి ఏదో ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అలాగే ఇక్కడ రూరల్ లో ఇన్ని రోజులు పనిచేయాలి అనేటువంటి కండిషన్స్ పెట్టి నడుపుకు వస్తుంది. ముందు రోజుల్లో డాక్టర్లు పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది, అవకాశం ఉంది. ఇక మిగిలిన రంగాల్లో కూడా అలాగే ప్రయత్నించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇక్కడ పైలెట్ డిగ్రీలు చదివిన వాళ్ళు విదేశాలు వెళ్లి  ఉద్యోగాలు చేస్తున్నారు.


భారత్ కరెన్సీలో కంటే ఆ దేశపు డాలర్లలో, కరెన్సీలలో వచ్చే ఆదాయం ఎక్కువ కనపడటంతో వాళ్ళు అక్కడ స్థిరపడిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఒక 10వేల డాలర్లు అంటే, 8లక్షల రూపాయలు సంపాదించేసినట్టే. ఇక్కడైతే లక్షో లక్షన్నరో రెండు లక్షలో వస్తాయి. దీంతో  అవకాశాలు దొరికితే విదేశాలకి వెళ్ళిపోతున్నారు .


కరోనా తర్వాత అక్కడ  అవకాశాలు ఎక్కువగా ఉంటున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక వృత్తిలోని వాళ్ళు వేరే వృత్తులకు వెళ్లిపోవడం వల్ల అక్కడ అవకాశాలు రావడం మొదలయ్యాయి. అక్కడ ఎయిర్ వేస్ విభాగంలో పెద్ద ఎత్తున, అక్కడ చేసేటువంటి ఎయిర్ హోస్టెస్ గాని,  గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ గానీ కొరత వచ్చి అనేక విమానాలు రద్దు అయినట్టే ఎక్కడ కూడా ఉద్యోగులు దొరకక భారత విమాన సర్వీసులు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.



RRR Telugu Movie Review Rating

అందాలతో స్వీట్ షాక్ ఇచ్చిన పాయల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>