LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgమన పొట్ట ఇంకా ప్రేగులు సరిగ్గా శుభ్రం కాకపోవడం వల్ల దాదాపు మనం 30 నుండి 40 కు పైగా చాలా రకాల వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యను మనం వీలైనంత త్వరగా తగ్గించుకోవాలి. ఈ సమస్య కారణంగా శరీరంలో విష పదార్థాలు ఇంకా మలినాలు చాలా ఎక్కువగా పేరుకుపోతాయి. ఇవి మనల్ని ఖచ్చితంగా తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యేలా చేస్తాయి.ఇంకా మలబద్దకం కారణంగా గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం, ఆకలి లేకపోవడం వంటి ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది.అయితే పొట్ట పూర్తిగా శుభ్రం కాని వాHEALTH{#}Ginger;cumin;Mixie;Manamపొట్ట, ప్రేగులని శుభ్రం చేసే హెల్తీ డ్రింక్ ఇదే?పొట్ట, ప్రేగులని శుభ్రం చేసే హెల్తీ డ్రింక్ ఇదే?HEALTH{#}Ginger;cumin;Mixie;ManamThu, 23 Mar 2023 19:15:14 GMTమన పొట్ట ఇంకా ప్రేగులు సరిగ్గా శుభ్రం కాకపోవడం వల్ల దాదాపు మనం 30 నుండి 40 కు పైగా చాలా రకాల వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యను మనం వీలైనంత త్వరగా తగ్గించుకోవాలి. ఈ సమస్య కారణంగా శరీరంలో విష పదార్థాలు ఇంకా మలినాలు చాలా ఎక్కువగా పేరుకుపోతాయి. ఇవి మనల్ని ఖచ్చితంగా తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యేలా చేస్తాయి.ఇంకా మలబద్దకం కారణంగా గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం, ఆకలి లేకపోవడం వంటి ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది.అయితే పొట్ట పూర్తిగా శుభ్రం కాని వారు, మలబద్దకం సమస్యతో ఎక్కువగా బాధపడే వారు ఇంట్లోనే ఒక పొడిని తయారు చేసుకుని వాడడం వల్ల ఖచ్చితంగా ఈ సమస్య నుండి ఈజీగా ఇంకా శాశ్వతంగా బయటపడవచ్చు. మలబద్దకం సమస్యను తగ్గించే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలి? ఇంకా ఎలా వాడాలి వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఈ పొడిని తయారు చేసుకోవడానికి  రెండు టీ స్పూన్ ధనియాలను, రెండు టీ స్పూన్ల వాము, రెండు టీ స్పూన్ల జీలకర్రను, రెండు టీ స్పూన్ల సోంపు గింజలు, అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ అతి మధురం పొడిని, 10 కరక్కాయలను, 8 యాలకులను ఇంకా అర టేబుల్ స్పూన్ నల్ల ఉప్పును వాడాల్సి ఉంటుంది.


ముందుగా కళాయిలో ధనియాలు, జీలకర్ర ఇంకా వాము వేసి దోరగా వేయించి జార్ లోకి తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన పొడిని ముందుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం రసం వేసి బాగా కలపాలి.ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ని ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున కొద్ది కొద్దిగా టీ తాగినట్టు తాగాలి. దీనిని క్రమం తప్పకుండా ఒక 15 రోజుల పాటు తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా మలబద్దకం సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ పొడి వల్ల పొట్ట అంతా పూర్తిగా శుభ్రమవుతుంది. జీర్ణవ్యవస్థ కూడా చాలా చక్కగా పని చేస్తుంది. ఇంకా అలాగే ఈ పొడిని వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్  ఉండవు. ఈ టిప్ ని పాటిస్తూనే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి.అలాగే నీటిని ఎక్కువగా తాగాలి. తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ విధంగా టిప్స్ పాటించడం వల్ల మనం చాలా ఈజీగా మలబద్దకం సమస్యను తగ్గించుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

ఇండస్ట్రీలోకి మరో వారసుడు.. ఎవరంటే..?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఏపీ: సీన్‌ మారింది.. జనసేన జాగ్రత్త పడాల్సిందే?

జగన్‌పై ఆ వర్గానికి మహా మంటగా ఉందా?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>