Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-e0a8983b-d0ec-4d87-bb53-dc482c1566e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-e0a8983b-d0ec-4d87-bb53-dc482c1566e3-415x250-IndiaHerald.jpgసాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో ఒంటి చేత్తో మ్యాచులు గెలిపించడం గురించి అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అప్పుడప్పుడు ఎందుకు అంటే ఎప్పుడు ఇలాంటిది సాధించడం ఆటగాళ్లకు సాధ్యం కాదు అని చెప్పాలి. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం అటు బ్యాట్స్మెన్లు పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతూ బౌలర్ల పై వీర విహారం చేస్తూ ఉంటారు. జట్టు కష్టాల్లో ఉంది ఇక ఓడిపోవడం ఖాయం అనుకునే పరిస్థితి నుంచి.. ఒంటి చేత్తో విజయం వైపుకు నడిపించడం లాంటివి చేస్తూ ఉంటారు ఎంతోమంది ప్లేయర్లు. ఇక ఇలా ఎవరైనా బ్యాట్స్మెన్లు వార్ వన్ సైడ్ అన్న విధంగCricket {#}West Indies;South Africa;war;Telugu;INTERNATIONALమెరుపు సెంచరీ.. సంతోషంలో సన్రైజర్స్ ఫ్యాన్స్?మెరుపు సెంచరీ.. సంతోషంలో సన్రైజర్స్ ఫ్యాన్స్?Cricket {#}West Indies;South Africa;war;Telugu;INTERNATIONALThu, 23 Mar 2023 13:30:00 GMTసాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో ఒంటి చేత్తో మ్యాచులు గెలిపించడం గురించి అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అప్పుడప్పుడు ఎందుకు అంటే ఎప్పుడు ఇలాంటిది సాధించడం ఆటగాళ్లకు సాధ్యం కాదు అని చెప్పాలి. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం అటు బ్యాట్స్మెన్లు పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతూ బౌలర్ల పై వీర విహారం చేస్తూ ఉంటారు. జట్టు కష్టాల్లో ఉంది ఇక ఓడిపోవడం ఖాయం అనుకునే పరిస్థితి నుంచి.. ఒంటి చేత్తో విజయం వైపుకు నడిపించడం లాంటివి చేస్తూ ఉంటారు ఎంతోమంది ప్లేయర్లు.



 ఇక ఇలా ఎవరైనా బ్యాట్స్మెన్లు వార్ వన్ సైడ్ అన్న విధంగానే బ్యాటింగ్ చేశారు అంటే చాలు ఇక అంతర్జాతీయ క్రికెట్లో అతని పేరు మారుమోగిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల మెరుపు సెంచరీ తో ఒక ఆటగాడు ఇలాగే వార్తల్లో నిలిచాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో నేనున్నాను అంటూ అండగా నిలబడ్డాడు. సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయి వీరవిహారం చేశాడు అని చెప్పాలి. అతని వికెట్ పడగొట్టాలని బౌలర్లు శతవిధాలా ప్రయత్నించిన.. చివరికి అతనే పైచేయి సాధించాడు. అతను ఎవరో కాదు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ క్లాసన్.



 సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో భాగంగా ఇక ఇలా అద్భుతమైన ఇన్నింగ్స్ తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. 261 పరుగుల లక్ష్యంతో సౌత్ ఆఫ్రికా జట్టు బరిలోకి దిగింది. ఇలాంటి సమయంలో ఇక సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ విభాగం పేక మెడల కూలిపోయింది. 87 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఓటమి తప్పదు అనుకున్న దశలో క్రీజులోకి వచ్చిన క్లాసన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 61 బంతుల్లో ఐదు సిక్సర్లు 15 ఫోర్ లతో 119 పరుగులు చేశాడు. దీంతో 29.3 ఓవర్లలోనే సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. కాగా క్లాసన్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున ఆడుతుండటంతో తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు.



RRR Telugu Movie Review Rating

'అమ్మ ఒడి ' అనే టైటిల్ తో రాబోతున్న స్టార్ హీరో మూవీ.... నిజమేనా...?

పాక్‌ అణ్వాయుధాలు.. తీవ్రవాదుల చేతుల్లోకి?

అక్కడ టీడీపీ విజయంతో జనసేనకు బిగ్‌ లాస్‌?

అమెరికా, రష్యా.. మధ్య ఇరకాటంలో స్విట్జర్లాండ్‌?

జగన్‌ ఫ్యూజ్‌ ఎగిరిపోయింది.. జాగ్రత్త పడాలి?

ఏపీ: సీన్‌ మారింది.. జనసేన జాగ్రత్త పడాల్సిందే?

జగన్‌పై ఆ వర్గానికి మహా మంటగా ఉందా?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>