HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/heart9fda3074-2d00-494b-9a2a-b595b72e083e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/heart9fda3074-2d00-494b-9a2a-b595b72e083e-415x250-IndiaHerald.jpgసరిగ్గా నిద్రపోకుంటే రోజంతా కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. అసలు ఏ పని మీదా శ్రద్ధ పెట్టలేం. అలాగని ఎక్కువ సమయం నిద్రపోతే బద్ధకంగా రోజంగా చాలా డల్‌గా గడుస్తుంది. అందుకే నిద్ర ఎక్కువగా పోయినా లేదా తక్కువ సమయం నిద్రపోయినా చాలా ఇబ్బందులు తప్పవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా రోజులో 5 గంటల కంటే తక్కువ నిద్రపోయేవారిలో ఖచ్చితంగా హృదయ సంబంధ వ్యాధులు (గుండె సంబంధిత వ్యాధులు) వచ్చే ప్రమాదం చాలా ఎక్కువని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఇక యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. రోజుకు 5 HEALTH{#}Sugar;Cholesterol;Heartఇలా నిద్రపోతే గుండె జబ్బు కన్ఫామ్?ఇలా నిద్రపోతే గుండె జబ్బు కన్ఫామ్?HEALTH{#}Sugar;Cholesterol;HeartWed, 22 Mar 2023 16:32:05 GMTసరిగ్గా నిద్రపోకుంటే రోజంతా కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. అసలు ఏ పని మీదా శ్రద్ధ పెట్టలేం. అలాగని ఎక్కువ సమయం నిద్రపోతే బద్ధకంగా రోజంగా చాలా డల్‌గా గడుస్తుంది. అందుకే నిద్ర ఎక్కువగా పోయినా లేదా తక్కువ సమయం నిద్రపోయినా చాలా ఇబ్బందులు తప్పవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా రోజులో 5 గంటల కంటే తక్కువ నిద్రపోయేవారిలో ఖచ్చితంగా హృదయ సంబంధ వ్యాధులు (గుండె సంబంధిత వ్యాధులు) వచ్చే ప్రమాదం చాలా ఎక్కువని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఇక యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వలన పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD) వృద్ధి చెంది గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుందని తెలిసింది.ఇంకా అంతే కాకుండా తక్కువ సమయం నిద్రపోవడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం ఇంకా అలాగే ఊబకాయం వంటి సమస్యలు రావచ్చని తెల్పింది.5 గంటల కంటే తక్కువ నిద్రపోతే ఖచ్చితంగా చేతులు, కాళ్ళ ధమనులు కుచించుకుపోయి పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి వస్తుంది.


ఇక ఇది కనుక సంభవిస్తే కాళ్ళు, చేతుల్లోని రక్త నాళాల్లో కొవ్వు నిల్వ ఉండి, రక్తప్రవాహాన్ని బాగా అడ్డుకుంటుంది. కాళ్ళలో తిమ్మిరి, కాళ్లు చల్లగా ఉండటం, కాళ్ళలో పల్స్ బలహీనంగా ఉండటం ఇంకా పిరుదులలో నొప్పితో కూడిన తిమ్మిర్లు, కాళ్ళపై చర్మం రంగు మారడం, కాళ్ళపై గాయాలు పూర్తిగా నయం కాకపోవడం ఇంకా అలాగే  జుట్టు రాలడం జరుగుతుంది.దాదాపు 6.50 లక్షల మందిపై జరిపిన పరిశోధనలో తక్కువ సమయం నిద్ర పోయినవారిలో పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ప్రమాదం పెరుగుతున్నట్లు తెలిసింది. రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తులకు అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్ ఇంకా ఊబకాయం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని ఇతర అధ్యనాల్లో కూడా బయటపడింది. ఈ లక్షణాలన్నీ కూడా ఖచ్చితంగా గుండె జబ్బులకు దారితీస్తాయి. అలాగే తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ మొదలై రక్త నాళాలను దెబ్బతీసి, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.అందుకే గుండె ఆరోగంగా ఉండాలంటే ప్రతి రోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

రంగమార్తాండ: ఉగాదికి సరైన సినిమా.. సూపర్?

ఆ విషయంలో ప్రపంచంలోనే జపాన్‌ గ్రేటెస్ట్‌?

అటో.. ఇటో.. పవన్ తేల్చుకోవాల్సిన టైమ్‌ వచ్చేసింది?

అమెరికా ఆయుధాలతో పాక్‌ను వణికిస్తున్న తాలిబన్లు?

ఎమ్మెల్సీ ఎఫెక్ట్‌.. జగన్ కమాండ్‌ కోల్పోతారా?

టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నిక విజయం.. లోకేశే కారణమా?

షాకింగ్.. నోబెల్‌ లిస్టులో నరేంద్ర మోదీ?

ఆ టెక్నాలజీలో అమెరికా, చైనాను దాటేసిన ఇండియా?

భారత్‌ ఊహించని నిర్ణయంతో చైనాకు చెక్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>