PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kavitha-ed-delhi-kcr-ktred8ca836-0936-4a5a-ae24-24a436957400-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kavitha-ed-delhi-kcr-ktred8ca836-0936-4a5a-ae24-24a436957400-415x250-IndiaHerald.jpgవిచారణకు హాజరై తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటమే నిజమైన దమ్మంటే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిజంగానే తన పాత్ర లేకపోతే ఈడీ విచారణకు హాజరవ్వటంలో భయపడాల్సిన అవసరం ఏముంది ? కేవలం విచారణ ముగిసిన తర్వాత తనను అరెస్టు చేస్తారన్న ఒకే ఒక్క భయంతోనే కవిత విచారణ నుండి తప్పించుకోవాలని చూశారు. అందుకనే సుప్రింకోర్టులో కేసు వేసి వీలైనంతగా విషయాన్ని లాగదీద్దామని అనుకున్నారు. kavitha ED Delhi kcr ktr{#}Kalvakuntla Kavitha;Party;Hyderabad;monday;kavitha;Delhi;media;Newsఢిల్లీ : దెబ్బకు ఈడీ ముందు కూర్చోక తప్పలేదా ?ఢిల్లీ : దెబ్బకు ఈడీ ముందు కూర్చోక తప్పలేదా ?kavitha ED Delhi kcr ktr{#}Kalvakuntla Kavitha;Party;Hyderabad;monday;kavitha;Delhi;media;NewsTue, 21 Mar 2023 03:00:00 GMT


ఒకే ఒక్క భయంతోనే కల్వకుంట్ల కవిత సోమవారం ఢిల్లీలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఇంతకూ ఆ భయం ఏమిటంటే అరెస్టు భయం. తనిష్టం వచ్చినట్లు చలాయించవచ్చని కవిత అనుకున్నట్లున్నారు. రాష్ట్రంలో ఏమిచేసినా చెల్లుబాటు అవుతున్నట్లు ఈడీ ముందు కూడా అలాగే జరిపించుకోవచ్చని అనుకున్నారు. అందుకనే 16వ తేదీ విచారణకు గైర్హాజరయ్యారు.





20వ తేదీ అంటే సోమవారం విచారణకు కూడా గైర్హాజరయ్యేందుకు అవకాశం ఉన్నంతలో గట్టి ప్రయత్నాలే చేసినట్లున్నారు. అయితే ఈరోజు విచారణకు కూడా గైర్హాజరైతే జరగబోయే పరిణామాలు ఎలాగుంటాయో బహుశా లాయర్లు కవితకు వివరించుంటారు. అందుకనే చేసేదిలేక ఈడీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసులోనో లేకపోతే మీడియా ఇంటర్వ్యూల్లోనో తనిష్టం వచ్చినట్లు మాట్లాడటం కాదు. చాలెంజులు చేయటం కాదు. ఇక్కడ ఎలా మాట్లాడినా చెల్లిపోతుంది. 





విచారణకు హాజరై తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటమే నిజమైన దమ్మంటే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిజంగానే తన పాత్ర లేకపోతే ఈడీ విచారణకు హాజరవ్వటంలో భయపడాల్సిన అవసరం ఏముంది ? కేవలం విచారణ ముగిసిన తర్వాత తనను అరెస్టు చేస్తారన్న ఒకే ఒక్క భయంతోనే కవిత విచారణ నుండి తప్పించుకోవాలని చూశారు. అందుకనే సుప్రింకోర్టులో కేసు వేసి వీలైనంతగా విషయాన్ని లాగదీద్దామని అనుకున్నారు.





అయితే అందుకు సుప్రింకోర్టు అవకాశం ఇవ్వలేదు. ఇదే సమయంలో కోర్టులో పిటీషన్ వేసన్నా సరే కవితను విచారణకు తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి ఈడీ కూడా రెడీ అయ్యింది. ఇందులో భాగంగానే 24వ తేదీన జరగబోయే విచారణలో తమకు సమాచారం ఇవ్వకుండా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించవద్దని ఈడీ కేవియట్ వేయద్దని పిటీషన్ వేసింది. అందుకు సుప్రింకోర్టు కూడా ఓకే చెప్పింది. దాంతో  విచారణ నుండి తప్పించుకునే అవకాశాలు అన్నీ మూసుకుపోయినట్లు కవితకు లాయర్లు చెప్పారట. అందుకనే చివరకు ఈడీ ఆఫీసుకొచ్చి విచారణకు హాజరుకాక తప్పలేదు. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.




RRR Telugu Movie Review Rating

ఢిల్లీ : దెబ్బకు ఈడీ ముందు కూర్చోక తప్పలేదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>