EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pakistande8feda3-84b8-4a92-a901-8fd9b56bac3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pakistande8feda3-84b8-4a92-a901-8fd9b56bac3a-415x250-IndiaHerald.jpgపాకిస్థాన్ కు గతంలో భారత్ గుర్తుకు రావాలంటే ఏదైనా బాంబు దాడి జరిగి అందులో పాకిస్థాన్ వారు ఉంటే వారిని హీరోలుగా గుర్తించే వారు. అలాగే ఇండియాలోని కమ్యూనిస్టులు భారత్ లో ఏదో జరిగిపోతుందని.. గోవులపై వ్యతిరేక వార్తలు, ముస్లింలను అణిచివేస్తున్నారని చెప్పడం లాంటి విషయాలు ఎక్కువగా అక్కడి ప్రజలకు గుర్తుకు వచ్చేవి. కానీ ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోయింది. అప్పులు ఎక్కువై, తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి దాపురించింది. ఇండియాలో 140 కోట్ల జనాభా ఉన్నా వారికి ఎన్ని ఇబ్బందులు PAKISTAN{#}Population;Imran Khan;Prime Minister;police;India;Pakistan;Governmentఇండియాను మెచ్చుకుంటున్న పాక్‌ జనం?ఇండియాను మెచ్చుకుంటున్న పాక్‌ జనం?PAKISTAN{#}Population;Imran Khan;Prime Minister;police;India;Pakistan;GovernmentTue, 21 Mar 2023 11:03:00 GMTపాకిస్థాన్ కు గతంలో భారత్ గుర్తుకు రావాలంటే ఏదైనా బాంబు దాడి జరిగి అందులో పాకిస్థాన్ వారు ఉంటే వారిని హీరోలుగా గుర్తించే వారు. అలాగే ఇండియాలోని కమ్యూనిస్టులు భారత్ లో ఏదో జరిగిపోతుందని.. గోవులపై వ్యతిరేక వార్తలు, ముస్లింలను అణిచివేస్తున్నారని చెప్పడం లాంటి విషయాలు ఎక్కువగా అక్కడి ప్రజలకు గుర్తుకు వచ్చేవి. కానీ ప్రస్తుతం  పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోయింది. అప్పులు ఎక్కువై, తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి దాపురించింది.


ఇండియాలో 140 కోట్ల జనాభా ఉన్నా వారికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వారు తట్టుకుని నిలిచే విధానం నేర్చుకోవాలని పాక్ లోని ప్రజలు ఇప్పుడు అక్కడి ప్రభుత్వానికి సూచిస్తున్నారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ తీరా అతని ఇంటి వద్దకు పోలీసులు వెళ్లాక.. అక్కడ పోలీసు వాహనాలను తగలబెట్టారు. పోలీసులనే కొట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు ఇమ్రాన్ ఖాన్ గోడ దూకి పారిపోయి సుప్రీం కోర్టుకు వెళ్లి అరెస్టును ఆపండని కోరుకోవాల్సి వచ్చింది. అయితే భారత్ లో గొడవలు జరిగిన సమయంలో ఆ ప్రభుత్వం స్పందించిన తీరును చూసి నేర్చుకోవాలని పాక్ ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


భారత్ లో రైతు ఉద్యమం, ఖలిస్తాన్ వేర్పాటు వాదులు ఎర్రకోట వద్ద అలజడి సృష్టించడం లాంటి సున్నితమైన అంశాలను ఇండియా గవర్నమెంట్ ఎలా ఢీల్ చేసింది. ఏ విధమైన చర్యలు తీసుకుంది. అణిచివేత కాకుండా వారు పాటించిన పద్దతులు చూసి నేర్చుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇక్కడేమో ఇళ్లు తగలబెట్టడాలు.. పోలీసుల వాహనాలనే ధ్వంసం చేయడం చూస్తుంటే బాధ కలుగుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు భారత్ విధానాలపై పాక్ ప్రజలకు మక్కువ కలుగుతుంది. సమస్యల్ని ఎదుర్కొన్న సత్తాపై వారికి అభిమానం కలిగి పాక్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

మరో క్రేజీ మూవీ లో ఆఫర్ కొట్టేసిన మాళవిక..!

ఆ టెక్నాలజీలో అమెరికా, చైనాను దాటేసిన ఇండియా?

భారత్‌ ఊహించని నిర్ణయంతో చైనాకు చెక్‌?

జగన్‌కు ఇక ముందు ఉందంతా మొసళ్ల పండుగేనా?

కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. చుక్కలు చూపించారుగా?

జగన్‌కు విజయసాయిలేని లోటు తెలిసిందా?

డేంజర్‌: ఆ దేశం నుంచి దారి తప్పుతున్న అణుబాంబులు?

ఆ దేశాధినేతల చెవుల్లో నిత్యానంద క్యాలిఫ్లవర్లు?

ఆ దేశాల వ్యవహారాల్లో వేలు పెడుతున్న అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>