LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/junkfood4e787966-40db-45be-93d0-ae64cb037384-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/junkfood4e787966-40db-45be-93d0-ae64cb037384-415x250-IndiaHerald.jpgఇప్పుడిప్పుడే చలికాలం వెళ్ళిపోయి,ఉష్ణోగ్రతలు పెరిగి, వేసవిని తలపించేలా ఉంది. ఇంక వేసవి మొదలైతే ఎన్నో రకాల రోగాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల, మనమే మన చేతులారా మన ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకున్నట్టు ఉంటుంది. వేసవి కాలంలో ఎక్కువగా శరీరానికి తేమనందించి,తొందరగా జీర్ణం అయ్యే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం.కూల్ డ్రింకులు మరియు అతిగా మసాలాలు వున్న ఆహారాలు రుచిగా ఉంటాయని ఎక్కువగా తీసుకుంటూంటారు. అలాంటి ఆహారాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.ఈ వేసవికాలంలో ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు JUNKFOOD{#}Manam;Cholesterol;Eveningవేసవి సీజన్లో ఈ ఆహారాలు తీసుకుంటే అంతే సంగతులు..!వేసవి సీజన్లో ఈ ఆహారాలు తీసుకుంటే అంతే సంగతులు..!JUNKFOOD{#}Manam;Cholesterol;EveningSun, 19 Mar 2023 19:00:00 GMTఇప్పుడిప్పుడే చలికాలం వెళ్ళిపోయి,ఉష్ణోగ్రతలు పెరిగి, వేసవిని తలపించేలా ఉంది. ఇంక వేసవి మొదలైతే ఎన్నో రకాల రోగాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల, మనమే మన చేతులారా మన ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకున్నట్టు ఉంటుంది. వేసవి కాలంలో ఎక్కువగా శరీరానికి తేమనందించి,తొందరగా జీర్ణం అయ్యే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం.కూల్ డ్రింకులు మరియు అతిగా మసాలాలు వున్న ఆహారాలు రుచిగా ఉంటాయని ఎక్కువగా తీసుకుంటూంటారు. అలాంటి ఆహారాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.ఈ వేసవికాలంలో ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..

 స్పైసెస్:
 వీటిని వంటల్లో వాడటంతో,ఆహార రుచిని పెంచుతాయి, కానీ ఇవి శరీరంలో వేడిని పెంచడానికి కూడా దోహదం చేస్తాయి.దీనివల్ల డిహైడ్రేషన్ గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కావున ఇలాంటి ఆహారాలు తీసుకోకపోవడమే చాలా మంచిది.

మాంసాహారాలు:
 మాంసాహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల, అవి జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల అజీర్తి,మలబద్ధకం సమస్యలు పెరుగుతాయి.

జంక్ ఫుడ్ : చాలామంది పిల్లలకు సాయంత్రం సమయంలో స్నాక్స్ గా ఎక్కువగా జంక్ ఫుడ్ ని ఇస్తుంటారు. అలాంటి పిల్లల్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగి, కడుపునొప్పి,గ్యాస్ మరియు తిన్నది సరిగా అరగక వాంతులు వంటి రోగాలు,మొదలవుతాయి.

నివారణ చర్యలు..
వేసవికాలంలో మనం తినే ఆహారాల మీద చాలా శ్రద్ధ పెట్టాలి. ఈ సీజన్లో మన శరీరం ఎక్కువగా డిహైడ్రేట్ కాకుండా, పెరుగు వంటి పదార్థాలు తినడంతో  కడుపులో మంచి బ్యాక్టీరియా పెరిగి, జీర్ణసమస్యలు రాకుండా కాపాడడమే కాక, శరీరానికి చలువనందిస్తుంది.

 నీటిశాతం ఎక్కువగా ఉన్న పండ్లు:
నీటి శాతం ఎక్కువగా ఉన్న దోసకాయ,పుచ్చకాయ,నిమ్మకాయ వంటి ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో నీటిశాతం అధికంగా ఉండడంతో శరీరం డిహైడ్రెట్ కాకుండా కాపాడుతాయి. మరియు ఇందులోని ఫైబర్ కంటెంట్ తొందరగా జీర్ణం అవ్వడానికి దోహదపడతాయి. ఉల్లి, పుదీనా ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఇందులోని పోషకాలు, హిట్స్ స్ట్రోక్ నుండి శరీరాన్ని కాపాడుతాయి. కావున వేసవిలో ఈ ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం చాలా ఉత్తమం.



RRR Telugu Movie Review Rating

సల్మాన్ ఖాన్ ని చంపడం నా లక్ష్యం: లారెన్స్

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?

బాబోయ్‌.. మన భూమి భారీగా చీలబోతోందా?

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>