SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ind-vs-aus354f3bd0-3b0f-4fe3-a11d-60f6fc48e741-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ind-vs-aus354f3bd0-3b0f-4fe3-a11d-60f6fc48e741-415x250-IndiaHerald.jpgఇక వైజాగ్‌ వన్డేలో ఇండియన్ టీం చాలా దారుణంగా చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది. విచిత్రం ఏమిటంటే.. సొంత గడ్డపై పైగా వైజాగ్ లో ఆస్ట్రేలియా టీంకి కనీసం పోటీ కూడా ఇవ్వలేక పూర్తిగా చేతులెత్తేసింది టీమిండియా. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఇండియా టీం పరాజయం పాలైంది. అది కూడా 39 ఓవర్లు మిగిలి ఉండగానే దారుణంగా ఓడిపోయింది. మొత్తానికి తమకు అచ్చొచ్చిన మైదానంలో టీమిండియా ఉసూరుమనిపించడంతో ఇండియన్ క్రికెట్‌ ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్‌ అయ్యారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగింది ఇండియా టీం.అయితే ఆసీస్IND vs AUS{#}Ravindra Jadeja;wednesday;Chennai;Tsunami;ICC T20;VIRAT KOHLI;Australia;Vishakapatnam;India;IndianIND vs AUS: చిత్తుచిత్తుగా ఓడిన ఇండియా?IND vs AUS: చిత్తుచిత్తుగా ఓడిన ఇండియా?IND vs AUS{#}Ravindra Jadeja;wednesday;Chennai;Tsunami;ICC T20;VIRAT KOHLI;Australia;Vishakapatnam;India;IndianSun, 19 Mar 2023 19:49:10 GMTఇక వైజాగ్‌ వన్డేలో ఇండియన్ టీం చాలా దారుణంగా చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది. విచిత్రం ఏమిటంటే.. సొంత గడ్డపై పైగా వైజాగ్ లో ఆస్ట్రేలియా టీంకి కనీసం పోటీ కూడా ఇవ్వలేక పూర్తిగా చేతులెత్తేసింది టీమిండియా. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఇండియా టీం పరాజయం పాలైంది. అది కూడా 39 ఓవర్లు మిగిలి ఉండగానే దారుణంగా ఓడిపోయింది. మొత్తానికి తమకు అచ్చొచ్చిన మైదానంలో టీమిండియా ఉసూరుమనిపించడంతో ఇండియన్ క్రికెట్‌ ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్‌ అయ్యారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగింది ఇండియా టీం.అయితే ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ మిచెల్ స్టార్క్‌ (53/5) బౌలింగ్ ధాటికి స్టార్‌ ప్లేయర్లు అందరూ కూడా పెవిలియన్‌కు క్యూ కట్టారు. శుభ్‌మన్‌ గిల్‌ (0), రోహిత్‌ (13), సూర్యకుమార్‌ యాదవ్‌ (0), రాహుల్‌ (9), హార్దిక్‌ పాండ్యా (1) ఇంకా అలాగే రవీంద్ర జడేజా (16) పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో 26 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఇండియా దెబ్బకి కుప్పకూలింది. విరాట్‌ కోహ్లీ (31), అక్షర్‌ (29) కొంచెంసేపు రాణించడంతో ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది ఇండియా.


స్కార్క్‌కు తోడు ఆసీస్ పేసర్‌ సీన్‌ అబాట్‌ మూడు వికెట్లు ఇంకా నాథన్‌ ఇల్లిస్ రెండు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకు తక్కువ స్కోరుకే కుప్పకూల్చారు.ఇక స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ టీం టీ20 తరహాలో బ్యాటింగ్‌ చేసింది. ఆసీస్‌ టీం బౌలర్లు అదరగొట్టిన పిచ్‌పై ఇండియా టీం బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఓపెనర్లు మిచెల్‌ మార్ష్ (66 నాటౌట్‌), ట్రావిస్ హెడ్ (51 నాటౌట్‌) సునామీ లాంటి స్పీడ్ తో అర్ధ సెంచరీలు చేశారు. దీంతో ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా కేవలం 11 ఓవర్లలోనే మొత్తం 121 పరుగులు చేసి ఆసీస్‌ టీం గెలుపొందింది. టీమిండియాను కుప్పకూల్చిన స్టార్క్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్ లభించింది. ఆస్ట్రేలియా ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ కాస్తా 1-1 తో సమమైంది.ఇక సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే మూడో వన్డే మ్యాచ్‌ బుధవారం నాడు (మార్చి 22న ) చెన్నై వేదికగా జరగనుంది.మరి ఆ మ్యాచ్ లో అయిన టీం ఇండియా రాణించి పరువు నిలబెడుతుందో లేదో చూడాలి.



RRR Telugu Movie Review Rating

సల్మాన్ ఖాన్ ని చంపడం నా లక్ష్యం: లారెన్స్

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?

బాబోయ్‌.. మన భూమి భారీగా చీలబోతోందా?

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>