PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chandrababu-atchennaidua4eeadfe-a8a6-4afe-b445-8af99747e2de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-chandrababu-atchennaidua4eeadfe-a8a6-4afe-b445-8af99747e2de-415x250-IndiaHerald.jpgఎందుకంటే రెండు ఎంఎల్సీ స్ధానాల్లో గెలుపు బాటలో ఉందో లేదో (దాదాపు గెలిచినట్లే) వెంటనే జగన్మోహన్ రెడ్డి పనైపోయిందని గోల మొదలుపెట్టేసింది. ప్రజలంతా తిరుగుబాటు చేశారట, ప్రభుత్వం మీద తమలోని వ్యతిరేకతను ప్రజలు ఎంఎల్సీ ఎన్నికల్లో చూపించారని నానా రచ్చ చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ బ్రహ్మాండమైన మెజారిటితో అధికారంలోకి వచ్చేస్తుందనటానికి ఈ ఎంఎల్సీ ఎన్నికలే నిదర్శనమని చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ట ఏదేదో మాట్లాడుతున్నారు. tdp chandrababu atchennaidu{#}TDP;YCP;Raccha;Hanu Raghavapudi;Elections;Jagan;Reddy;Governmentఅమరావతి : తాజా ఫలితాలతో టీడీపీ రెచ్చిపోతోందా ?అమరావతి : తాజా ఫలితాలతో టీడీపీ రెచ్చిపోతోందా ?tdp chandrababu atchennaidu{#}TDP;YCP;Raccha;Hanu Raghavapudi;Elections;Jagan;Reddy;GovernmentSun, 19 Mar 2023 07:00:00 GMT


చాలాకాలం తర్వాత వచ్చిన గెలుపు కదా అందుకనే టీడీపీ రెచ్చిపోతోంది. 2019 ఎన్నికల్లో తగిలిన దెబ్బనుండి టీడీపీ కోలుకోలేదు. ఆ ఎన్నికల తర్వాత స్ధానికసంస్ధల ఎన్నికలను కూడా వైసీపీ స్వీప్ చేసింది. ఆ తర్వాత జరిగిన మూడు ఉఫఎన్నికల్లో కూడా వైసీపీదే గెలుపు. ఎన్నిక ఏదైనా గెలుపు అధికారపార్టీదే అన్నట్లుంది పరిస్ధితి. ఇలాంటి సమయంలో రెండు ఎంఎల్సీ స్ధానాల్లో టీడీపీ గెలిచిందంటే నిజంగా గొప్ప విజయమనే చెప్పాలి. కాకపోతే టీడీపీ చెప్పుకుంటున్నట్లుగా కాదు.





ఎందుకంటే రెండు ఎంఎల్సీ స్ధానాల్లో గెలుపు బాటలో ఉందో లేదో (దాదాపు గెలిచినట్లే) వెంటనే జగన్మోహన్ రెడ్డి పనైపోయిందని గోల మొదలుపెట్టేసింది. ప్రజలంతా తిరుగుబాటు చేశారట, ప్రభుత్వం మీద తమలోని వ్యతిరేకతను ప్రజలు ఎంఎల్సీ ఎన్నికల్లో చూపించారని నానా రచ్చ చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ బ్రహ్మాండమైన మెజారిటితో అధికారంలోకి వచ్చేస్తుందనటానికి ఈ ఎంఎల్సీ ఎన్నికలే నిదర్శనమని చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ట ఏదేదో మాట్లాడుతున్నారు.





14 ఎంఎల్సీ  స్ధానాలకు ఎన్నికలు జరిగితే వైసీపీ 12 చోట్ల గెలిస్తే టీడీపీ గెలిచింది 2 సీట్లలో మాత్రమే. గెలిచింది రెండు సీట్లలోనే అయినా టీడీపీకి బూస్టప్ ఇచ్చేదే అనటంలో సందేహంలేదు. కానీ 2 చోట్ల గెలిచినంత మాత్రాన 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేయటం ఖాయమని తమ్ముళ్ళు  అనుకుంటే బోర్లా పడినట్లే. ఇదే సమయంలో రెండుచోట్ల ఎందుకు ఓడిపోయిందో వైసీపీ నిజాయితీగా పోస్టుమార్టమ్ చేసుకోవాల్సిందే.





ఇక్కడ గమనించాల్సిందేమంటే టీచర్లలో జగన్ ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత ఉందని జరిగిన ప్రచారానికి వచ్చిన ఫలితం భిన్నంగా ఉంది. రెండు టీచర్ల నియోజకవర్గాల్లోను వైసీపీ అభ్యర్ధులే గెలిచారు. ఇదేసమయంలో మూడు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలను గెలుచుకుంటామని అధికారపార్టీ అనుకున్నా రెండింటిలో ఓడి ఒకటి మాత్రం గెలిచింది. ఫలితాల సరళిని చూస్తుంటే మంత్రులు, ఎంఎల్ఏలు, నేతల ఓవర్ కాన్ఫిడెన్సు వల్లే గెలుస్తామనుకున్న స్ధానాల్లో  వైసీపీ ఓడిపోయినట్లుంది. అన్నీస్ధానాల్లోను గెలవాలన్న పట్టుదల జగన్ లో తప్ప మంత్రులు, ఎంఎల్ఏల్లో ఉన్నట్లు లేదు. మరి ఇదే ట్రెండ్ కంటిన్యు అయితే....






RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ హీరోయిన్ పై ఆ డైరెక్టర్ లైంగిక దాడి..!!

స్నేహం నటిస్తూనే ఆ దేశంలో అమెరికా కుట్ర చేస్తోందా?

కేసీఆర్‌ టీమ్‌.. ఈ లాజిక్ మర్చిపోయిందా?

కవిత ఎపిసోడ్‌: లాజిక్‌తో కొట్టిన కేసీఆర్‌?

పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?

బాబోయ్‌.. మన భూమి భారీగా చీలబోతోందా?

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>