MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan4c5b910d-f040-489b-9766-cb5191b163f4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan4c5b910d-f040-489b-9766-cb5191b163f4-415x250-IndiaHerald.jpgగత కొంతకాలంగా అచ్చ తెలుగుపదాల పై క్రేజ్ బాగా పెరుగుతోంది. లేటెస్ట్ గా పూర్తి అచ్చ తెలుగు పదాలతో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ కోసం చంద్రబోస్ వ్రాసిన ‘నాటు నాటు’ పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డ్ స్థాయికి వెళ్ళిన విషయం తెలిసిందే. స్వచ్చమైన తెలుగు పదాలతో సినిమాలకు టైటిల్స్ పెట్టే విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాల తెలివిగా వ్యవహరిస్తూ ఉంటాడు.అతడికి ఉన్న ‘అ’ అక్షరం సెంటిమెంట్ తో గతంలో అతడు తీసిన ‘అత్తారింటికి దారేది’ ‘అరవింద సమేత’ ‘అల వైకుంఠ పురములో’ సినిమాలు ఎలాంటి ఘన విజయాలు సాధించాయో అందరికీ తెలిసిన PAVANKALYAN{#}chandra bose;chandrabose;Subhas Chandra Bose;srinivas;sukumar;Athadu;trivikram srinivas;Oscar;Darsakudu;Director;Telugu;March;India;Cinemaఅచ్చ తెలుగు టైటిల్ కోసం త్రివిక్రమ్ అంతర్మధనం !అచ్చ తెలుగు టైటిల్ కోసం త్రివిక్రమ్ అంతర్మధనం !PAVANKALYAN{#}chandra bose;chandrabose;Subhas Chandra Bose;srinivas;sukumar;Athadu;trivikram srinivas;Oscar;Darsakudu;Director;Telugu;March;India;CinemaSat, 18 Mar 2023 09:00:00 GMTగత కొంతకాలంగా అచ్చ తెలుగుపదాల పై క్రేజ్ బాగా పెరుగుతోంది. లేటెస్ట్ గా పూర్తి అచ్చ తెలుగు పదాలతో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ కోసం చంద్రబోస్ వ్రాసిన ‘నాటు నాటు’ పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డ్ స్థాయికి వెళ్ళిన విషయం తెలిసిందే. స్వచ్చమైన తెలుగు పదాలతో సినిమాలకు టైటిల్స్ పెట్టే విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాల తెలివిగా వ్యవహరిస్తూ ఉంటాడు.


అతడికి ఉన్న ‘అ’ అక్షరం సెంటిమెంట్ తో గతంలో అతడు తీసిన ‘అత్తారింటికి దారేది’ ‘అరవింద సమేత’ ‘అల వైకుంఠ పురములో’ సినిమాలు ఎలాంటి ఘన విజయాలు సాధించాయో అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు మహేష్ తో త్రివిక్రమ్ తీస్తున్న మూవీకి ‘అ’ సెంటిమెంట్ తో కూడిన ఒక అచ్చ తెలుగు టైటిల్ కోసం త్రివిక్రమ్ చాల ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


కొన్ని టైటిల్స్ అతడి ఆలోచనలలోకి వచ్చినప్పటికీ ఆ టైటిల్స్ ఏమి అతడికి నచ్చక పోవడంతో త్రివిక్రమ్ తన టీమ్ మెంబర్స్ తో చాల చర్చలు జరుపుతున్నాడట. వచ్చే వారం రాబోతున్న ఉగాది రోజున ఎట్టి పరిస్థితులలోను ఈమూవీ టైటిల్ ను ప్రకతించాలని త్రివిక్రమ్ ఆలోచన అని అంటున్నారు. ఆగష్టులో విడుదల కాబోతున్న ఈమూవీ షూటింగ్ చాల వేగంగా జరుగుతోంది. ఈమూవీ షూట్ ను ఏప్రియల్ నెలాఖరకు పూర్తి చేసి మహేష్ కు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని త్రివిక్రమ్ చాల పట్టుదల పై ఉన్నాడు అని అంటున్నారు.


దీనికోసం త్రివిక్రమ్ ప్రతిరోజు ఉదయం 8 గంటలకే తన టీమ్ తో రెడీ అయి ఈమూవీ షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతానికి టాప్ దర్శకుల లిస్టులో త్రివిక్రమ్ ఉన్నప్పటికీ సుకుమార్ రాజమౌళి ల స్థాయిలో అత్యంత భారీ సినిమా తీయలేకపోతున్నాడు. అయితే ఆలోటును మహేష్ తో తీస్తున్న ఈమూవీని పాన్ ఇండియా మూవీగా మార్చి తాను కూడ అత్యంత భారీ సినిమాలు తీయగలను అన్న సంకేతాలను ఇవ్వాలని త్రివిక్రమ్ గట్టి ప్రయత్నం..







RRR Telugu Movie Review Rating

అమరావతి : వైసీపీ ఎందుకు వెనకబడిందో తెలుసా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>