Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sachinc503bebe-99b6-4fe9-a1dd-f639e0cc22ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sachinc503bebe-99b6-4fe9-a1dd-f639e0cc22ce-415x250-IndiaHerald.jpgక్రికెట్ లో ఎలాంటి రూల్స్ ఉంటాయి అన్న విషయం దాదాపు అందరికి తెలుసు. అయితే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రం క్రికెట్ రూల్స్ పూర్తిగా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు క్రికెట్లో సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న కొన్ని అలవాట్లను చివరికి ఐసిసి బ్యాన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇలాంటి వాటిలో బంతిని షైన్ చేసేందుకు ఆటగాళ్లు లాలాజలం రుద్దడం పై కూడా బ్యాన్ విధించింది అన్న విషయం తెలిసిందే. ఇలాంటివి చేయడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉందని ఐసిసి భావించింది. దీంSachin{#}Sachin Tendulkar;Coronavirus;Cricket;Australiaఐసీసీ ఆ రూల్ సవరిస్తే బాగుంటుంది : సచిన్ఐసీసీ ఆ రూల్ సవరిస్తే బాగుంటుంది : సచిన్Sachin{#}Sachin Tendulkar;Coronavirus;Cricket;AustraliaSat, 18 Mar 2023 12:00:00 GMTక్రికెట్ లో ఎలాంటి రూల్స్ ఉంటాయి అన్న విషయం దాదాపు అందరికి తెలుసు. అయితే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రం క్రికెట్ రూల్స్ పూర్తిగా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు క్రికెట్లో సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న కొన్ని అలవాట్లను చివరికి ఐసిసి బ్యాన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇలాంటి వాటిలో బంతిని షైన్ చేసేందుకు ఆటగాళ్లు లాలాజలం రుద్దడం పై కూడా బ్యాన్ విధించింది అన్న విషయం తెలిసిందే. ఇలాంటివి చేయడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉందని ఐసిసి భావించింది.


 దీంతో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లు ఎవరైనా సరే బంతిని షైనింగ్ చేసేందుకు లాలాజలం రుద్దితే చర్యలు తీసుకుంటాము అంటూ కూడా హెచ్చరించింది అని చెప్పాలి. అయితే ఇప్పటికీ కూడా ఇక ఈ నిబంధనలను సవరించలేదు ఐసిసి. ఇక ఇదే విషయంపై సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కరోనా వైరస్ సమయంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని.. కానీ ఇప్పుడు మాత్రం బౌలర్లకు వెసులుబాటు కల్పించాలి అంటూ సూచించారు.


 పరిశుభ్రత గురించి చాలామంది ఆలోచిస్తున్నారు. బౌలర్లు చెమట కోసం బంతిని చంకల్లో పెట్టుకుంటున్నారు. ఇది బాగుంటుందా.. అలాంటప్పుడు లాలాజలం పెట్టడం పై అభ్యంతరం ఎందుకు.. బంతి కొత్తగా ఉన్నప్పుడు లాలాజలం చాలా ముఖ్యం. చెమటకంటే లాలాజలానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకవైపు ఎక్కువగా పెడతారు.. మరొకవైపు తక్కువగా వాడుతారు. ఇలా బంతి సమతూకంగా లేకపోవడం వల్ల స్వింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది అంటూ సచిన్ టెండూల్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.  అయితే ఇంతకుముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ సైతం ఇక ఇలాంటి సూచన చేశాడు అని చెప్పాలి. ఇక దీనిపై ఐసీసీ ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.



RRR Telugu Movie Review Rating

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హోస్ట్ గా రానా...?

పుతిన్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని కుట్రలో?

తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?

తెలంగాణలో సరిగ్గా బీజేపీ పుంజుకునే సమయానికి షాక్‌?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని చైనా ఆపుతుందా?

పవన్‌, లోకేశ్‌.. ఆ సీక్రెట్‌ తెలుసుకోవాల్సిందే?

రష్యాకు ఊహించని ఝలక్‌ ఇచ్చిన ఉక్రెయిన్‌?

కొత్త సర్వే.. ఏపీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రిజల్ట్‌ ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>